జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

12955 / 12956 ముంబై సెంట్రల్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ రైల్వేలో ముంబై, రాజస్థాన్‌లోని జైపూర్ ల మధ్య నడుస్తున్న అత్యంత ముఖ్యమైన రైలు. ఈ రెండు నగరాల మధ్య ఇది మొదటి డైరెక్ట్ రైలు. ఇది సూపర్ ఫాస్ట్ కేటగిరీ రైళ్ల కింద ముంబై జైపూర్ మధ్య నడిచే రైళ్ళలో అత్యంత వేగవంతమైనది.

జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్
తొలి సేవ30 జనవరి 1993; 31 సంవత్సరాల క్రితం (1993-01-30)
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వ్బే
మార్గం
మొదలుMumbai Central (MMCT)
ఆగే స్టేషనులు19
గమ్యంJaipur (JP)
ప్రయాణ దూరం1,162 km (722 mi)
సగటు ప్రయాణ సమయం16 hours 50 minutes
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)12955 / 12956
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 Tier, AC 3 Tier, Sleeper class, General unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుAvailable
చూడదగ్గ సదుపాయాలుLarge windows
సాంకేతికత
రోలింగ్ స్టాక్LHB coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం130 km/h (81 mph) maximum,
70 km/h (43 mph) average with halts
మార్గపటం

అవలోకనం మార్చు

ఈ రైలు జైపూర్ జంక్షన్ నుండి నడిచిన మొదటి బ్రాడ్-గేజ్ రైలు. ఇది 1993 జనవరి 30 న మొదలైంది. జైపూర్ సూపర్‌ఫాస్ట్‌ని అనధికారికంగా గంగౌర్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. జైపూర్ జంక్షన్ బ్రాడ్-గేజ్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి ముందు, ఈ రైలు జైపూర్‌లోని మరొక రైల్వే స్టేషన్ అయిన దుర్గాపురా, ముంభై సెంట్రల్మ ల మధ్య నడిచింది.

ఇది ముంబై సెంట్రల్ నుండి జైపూర్ జంక్షన్ వరకు దిగువ దిశలో రైలు నంబర్ 12955గా ను, జైపూర్ జంక్షన్ & ముంబై సెంట్రల్ మధ్య రైలు నంబర్ 12956గానూ నడుస్తుంది. ఇది 70 కిమీ/గం సగటు వేగంతో 1162 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటల 45 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఎగువ దిశలో, ప్రయాణం సగటున 70 km/h వేగంతో 16 గంటల 55 నిమిషాలలో పూర్తవుతుంది. ఇది గరిష్టంగా 130 కిమీ/గం వేగంతో నడుస్తుంది. ఈ రైలులో బయో టాయిలెట్లు ఉన్నాయి. భోజన కూపన్ల పథకం మొదట ఈ రైలులో ప్రవేశపెట్టారు.

ఇంజను మార్చు

ముంబైలోని వెస్ట్రన్ లైన్ సబర్బన్ రైల్వే యొక్క DC నుండి AC మార్పిడికి ముందు, ఇది ముంబై యొక్క DC ట్రాక్షన్ మార్గాన్ని ఉపయోగించేందుకు వల్సాడ్ లోకో షెడ్ WCAM 2/2P లోకోమోటివ్‌తో ముంబై సెంట్రల్ నుండి బయలుదేరేది. వడోదర లోకో షెడ్ WAP 4 E కోసం WCAM 2/2P ని మార్చుకునే వడోదరలో లోకోమోటివ్ మార్పు జరిగేది.

జైపూర్ వరకు దాని మిగిలిన ప్రయాణం కోసం సవాయి మాధోపూర్ జంక్షన్ వద్ద భగత్ కి కోఠి షెడ్ నుండి WDP 4 /4B/4D కు తగిలించేవారు. సవాయి మాధోపూర్ జంక్షన్ వద్ద రైలు దిశను మారుస్తారు.

పశ్చిమ రైల్వే 2012 ఫిబ్రవరి 5 న DC నుండి AC కి విద్యుత్ మార్పిడిని పూర్తి చేసింది. ముంబైలోని వెస్ట్రన్ లైన్ సబర్బన్ సిస్టమ్ యొక్క పూర్తి AC విద్యుదీకరణ తర్వాత; ఇది ముంబై సెంట్రల్, సవాయి మాధోపూర్ జంక్షన్ ల మధ్య WAP 5 లేదా WAP 4 E ఇంజన్లు లాగుతాయి

నార్త్ వెస్ట్రన్ రైల్వే 2021 ఆగస్టులో జైపూర్ - సవాయి మాధోపూర్ రైలు మార్గాన్ని విద్యుద్దీకరణ చేయడంతో ఇప్పుడు దీని మొత్తం దూరాన్ని వడోదర లోకో షెడ్ లోని WAP 7 లోకోమోటివ్ లాగుతోంది.