జోనాథన్ హెన్స్లీ

అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత

జోనాథన్ బ్లెయిర్ హెన్స్లీ అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. ప్రధానంగా యాక్షన్ - అడ్వెంచర్ జానర్లలో సినిమాలు తీశాడు. జుమాంజి డై హార్డ్ విత్ ఎ వెంజియన్స్, ఆర్మగెడాన్ వంటి సినిమాల రచనలతోపాటు 2004లో ది పనిషర్ అనే కామిక్ బుక్ యాక్షన్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.

జోనాథన్ హెన్స్లీ
జననం
జోనాథన్ బ్లెయిర్ హెన్స్లీ

(1959-02-13) 1959 ఫిబ్రవరి 13 (వయసు 65)
విద్యాసంస్థమసాచుసెట్స్ అమ్హెర్స్ట్ విశ్వవిద్యాలయం (1981)
తులానే యూనివర్సిటీ లా స్కూల్ (జె.డి.)
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత
జీవిత భాగస్వామి

హెన్స్లీ 1959 ఫిబ్రవరి 13న జన్మించాడు. 1981లో మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో పట్టభద్రుడయ్యాడు.[1] యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా లో చదివాడు, తులానే యూనివర్సిటీ లా స్కూల్ నుండి తన జెడి పొందాడు. 1985లో మసాచుసెట్స్ బార్లో చేరాడు. రచనలోకి రాకముందు ఏడు సంవత్సరాలపాటు న్యాయవాదిగా పనిచేశాడు.[2]

31 సంవత్సరాల వయస్సులో స్క్రిప్ట్స్, స్క్రీన్ ప్లేలు రాయడం ప్రారంభించాడు. గతంలో ఒక నవల , ఒక నాటకాన్ని రాశాడు, కానీ ఫిల్మ్ స్కూల్ కు వెళ్ళలేదు.[3]

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు దర్శకుడు రచయిత ఇతర వివరాలు
1992 - 1995 యంగ్ ఇండియానా జోన్స్ క్రానికల్స్ కాదు Yes టెలివిజన్ ధారావాహికాలు (5 భాగాలు)
1993 ఎ ఫార్ ఆఫ్ ప్లేస్ కాదు Yes
1995 డై హార్డ్ విత్ ఎ వెంజెఎన్స్ కాదు Yes
జుమాంజీ కాదు Yes
1997 ది సెయింట్ కాదు Yes
1998 ఆర్మగెడాన్ కాదు Yes
2004 ది పనిషర్ Yes Yes దర్శకుడిగా అరంగేట్రం
2007 నెక్ట్స్ కాదు Yes
వెల్కం టు ది జంగిల్ Yes Yes అలాగే సినిమాటోగ్రాఫర్ డైరెక్ట్ - టు - వీడియో
2011 కిల్ ది ఐరిష్ మెన్ Yes Yes
2021 సంచిక ది ఐస్ రోడ్ Yes Yes

కార్యనిర్వాహక నిర్మాత

  • కాన్ ఎయిర్ (1997)
  • అర్మగెదోన్ (1998)
  • గాన్ ఇన్ 60 సెకన్స్ (2000)

రచనలు (పేరు వేయనివి)

  • ది రాక్ (1996)
  • కాన్ ఎయిర్ (1997)
  • వైరస్ (1999)
  • గాన్ ఇన్ 60 సెకన్స్ (2000)
  • జెమిని మ్యాన్ (2019)

మూలాలు

మార్చు
  1. Carey, Mary. "True to their school". UMass Magazine, Winter 1999.
  2. Wanser, Brooke (15 December 2016). "Distillery gives nod to Nevada with its vodka, whiskey". Las Vegas Review Journal. Retrieved 2023-07-05.
  3. Needles, Tim. "Director Jonathan Hensleigh and Ray Stevenson on Kill the Irishman". Short and Sweet NYC. Archived from the original on 2021-05-07. Retrieved 2023-07-05.

బయటి లింకులు

మార్చు