జోసెఫ్ డాల్టన్ హుకర్

సర్ జాసఫ్ డాల్టన్ హుకర్ (Sir Joseph Dalton Hooker) OM, GCSI, CB, MD, FRS (30 June 1817 – 10 December 1911) 19వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ బ్రిటిష్ వృక్షశాస్త్ర ప్రముఖుడు. ఇతడు చార్లెస్ డార్విన్ కు సన్నిహిత స్నేహితుడు.. ఇతడు రాయల్ ఉద్యానవనానికి అధిపతిగా 20 సంవత్సరాలు పనిచేశారు. , in succession to his father, William Jackson Hooker, and was awarded the highest honours of British science.[1][2]

జోసెఫ్ డాల్టన్ హుకర్
జననం(1817-06-30)1817 జూన్ 30
Halesworth, Suffolk
మరణం1911 డిసెంబరు 10(1911-12-10) (వయసు 94)
Sunningdale, Berkshire
జాతీయతBritish
రంగములువృక్ష శాస్త్రం
వృత్తిసంస్థలుKew Gardens
చదువుకున్న సంస్థలుగ్లాస్గో విశ్వవిద్యాలయం
ప్రభావితం చేసినవారుసర్ విలియం జాక్సన్ హుకర్; చార్లెస్ డార్విన్; జార్జి బెంథామ్
ప్రభావితులుThiselton-Dyer
ముఖ్యమైన పురస్కారాలుOrder of Merit; Grand Cross Star of India; Royal Society Copley & Darwin Medals; Linnean Society Darwin-Wallace Medal
సంతకం
Daguerreotype of Hooker c.1852

బెంథామ్-హుకర్ వర్గీకరణ

మార్చు

జార్జి బెంథామ్ (George Bentham), జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా పుష్పించే మొక్కలకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.

జీవిత సంగ్రహం

మార్చు

హుకర్ సఫోక్ లో ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడైన సర్ విలియం జాక్సన్ హుకర్ (Sir William Jackson Hooker) కు రెండవ కుమారునిగా జన్మించాడు. చిన్ననాటి నుండి గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తండ్రి యొక్క ఉపన్యాసాలను విని మొక్కల మీద, జేమ్స్ కుక్ జరిపిన సముద్ర యాత్రల మీద అభిరుచి పెంచుకున్నాడు.[3] తర్వాత గ్లాస్గో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను 1939లో పూర్తిచేశాడు. అనంతరం నావల్ మెడికల్ సర్వీసు ఉద్యోగంలో చేరి ప్రముఖ సముద్ర యాత్రికుడైన జేమ్స్ క్లార్క్ రాస్ (James Clark Ross) తో అంటార్కిటికా లోని అయస్కాంత దక్షిణ ధృవానికి ప్రయాణమయ్యాడు.

హుకర్ 1851 సంవత్సరంలో ఫ్రాన్సిస్ హారియెట్ హెన్స్లో (Frances Harriet Henslow) ను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.

  • William Henslow Hooker (1853–1942)
  • Harriet Anne Hooker (1854–1945) married William Turner Thiselton-Dyer
  • Charles Paget Hooker (1855–1933)
  • Marie Elizabeth Hooker (1857–1863) died aged 6.
  • Brian Harvey Hodgson Hooker (1860–1932)
  • Reginald Hawthorn Hooker (1867–1944) statistician
  • Grace Ellen Hooker (1868–1873) died aged 5.

మొదటి భార్య 1874 సంవత్సరంలో చనిపోగా, 1876 లో హయసింథ్ జార్డిన్ (Hyacinth Jardine) ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలిగారు.

  • Joseph Symonds Hooker (1877–1940)
  • Richard Symonds Hooker (1885–1950).

హుకర్ 10 డిసెంబరు 1911 తేదీన స్వగృహంలో అర్ధరాత్రి నిద్రలోనే మరణించాడు. అతని వీలునామా ప్రకారం ఇతన్ని సెంట్ అన్నె చర్చి ఆవరణలో తండ్రి ప్రక్కనే పూడ్చబడ్డాడు.

బిబ్లియోగ్రఫీ

మార్చు
  • 1844–1859: Flora Antarctica: the botany of the Antarctic voyage. 3 vols, 1844 (general), 1853 (New Zealand), 1859 (Tasmania). Reeve, London.
  • 1846–1867: Handbook of the New Zealand flora
  • 1849: Niger flora
  • 1849–1851: The Rhododendrons of Sikkim-Himalaya
  • 1854: Himalayan Journals, or notes of a naturalist, in Bengal, the Sikkim and Nepal Himalayas, Khasia Mountains ...
  • 1855: Illustrations of Himalayan plants
  • 1855: Flora indica, with Thomas Thomson
  • 1858: with George Bentham, Handbook of the British flora. ("Bentham & Hooker")
  • 1859: A century of Indian orchids
  • 1862–1883: with George Bentham, Genera plantarum
Bentham, George; Hooker, Sir Joseph Dalton (1867). Genera plantarum ad exemplaria imprimis in herbariis kewensibus servata definita. Vol. LXXXIII. London: Reeve & Co.
  • 1870; 1878: The student's flora of the British Isles. Macmillan, London.
  • 1872–1897: The flora of British India
Hooker, Sir Joseph Dalton (1890). The Flora of British India. Vol. V. London: L. Reeve & Co. ISBN 0913196290. Retrieved 2009-04-08.
  • 1898–1900: Handbook to the Ceylon flora
  • 1904–1906: An epitome to the British Indian species of Impatiens

మూలాలు

మార్చు
  1. Huxley, Leonard 1918. Life and letters of Sir Joseph Dalton Hooker OM GCSI. London, Murray.
  2. Turrill W.B. 1963. Joseph Dalton Hooker: botanist, explorer and administrator. Nelson, London.
  3. Endersby, J. 2004. Hooker, Sir Joseph Dalton (1817–1911). Oxford Dictionary of National Biography, Oxford University Press

బయటి లింకులు

మార్చు