జో రూట్
జోసెఫ్ ఎడ్వర్డ్ రూట్ (జననం 1990 డిసెంబరు 30) ఇంగ్లాడ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. గతంలో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఇంగ్లాండ్ దేశీయ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూట్ ప్రస్తుతం ఆడుతున్న బ్యాటర్లలో అత్యధిక పరుగుల స్కోరరు, టెస్టు క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన పదో బ్యాటరు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జోసెఫ్ ఎడ్వర్డ్ రూట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | షెఫీల్డ్, సౌత్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్ | 1990 డిసెంబరు 30|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Top-order batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Billy Root (brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 655) | 2012 డిసెంబరు 13 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 27 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 227) | 2013 జనవరి 11 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 జూలై 24 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 66 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 63) | 2012 డిసెంబరు 22 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 మే 5 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 66 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009– | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | సిడ్నీ థండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021– | Trent Rockets | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Dubai Capitals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 31 July 2023 |
రూట్, 2012లో టెస్టుల్లో ప్రవేశించాడు. 2013లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2012 - 2019 మధ్య ఇంగ్లండ్ ట్వంటీ20 ఇంటర్నేషనల్ టీమ్‌కు ఆడాడు. అతను 2017 ఫిబ్రవరి, 2011 ఏప్రిల్ మధ్య ఇంగ్లండ్ టెస్టు జట్టుకు నాయకత్వం వహించాడు.[1] ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు (64), విజయాలు (27), ఓటముల (26) రికార్డులు అతని పేరిట ఉన్నాయి.[2] 2018లో ఇంగ్లండ్ 1,000వ టెస్టు సందర్భంగా, రూట్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు దేశం లోని అత్యుత్తమ ఆల్-టైమ్ టెస్టు XIలో ఒకడిగా పేర్కొంది. [3] అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్. [4] అతను ICC పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2021 లో ప్రపంచంలోని విస్డెన్ లీడింగ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు [5] 2022 జూన్‌లో అతను ఇంగ్లండ్ తరపున 10,000 టెస్టు పరుగులు చేసిన రెండవ బ్యాటరు, మొత్తం మీద పద్నాలుగో బ్యాటరూ అయ్యాడు. [6]
కుడిచేతి వాటం బ్యాటరైన రూట్, మొదట్లో ఓపెనర్‌గా ఆడాడు. అయితే అతని క్రికెట్‌లో ఎక్కువ భాగం ఇంగ్లండ్ తరఫున మిడిల్ ఆర్డర్‌లోనే ఆడాడు. అలెస్టర్ కుక్ తర్వాత ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు,[7] ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ వన్‌డేలలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. [8] ఇంగ్లండ్ తరపున 16 శతకాలతో [9] అత్యధిక వన్‌డే సెంచరీలు చేసిన రికార్డు అతనికి ఉంది. జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి టెస్టుల్లో పదో వికెట్‌కి అత్యధిక స్కోరు (198) చేసిన ప్రపంచ రికార్డు సాధించాడు.[10] రూట్ అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగు కూడా చేస్తాడు.
ప్రారంభ జీవితం, కెరీర్
మార్చుజో, హెలెన్, మాట్ రూట్‌ల పెద్ద కుమారుడు. షెఫీల్డ్‌లోని డోర్‌లో పెరిగాడు. [11] అతని తమ్ముడు బిల్లీ గ్లామోర్గాన్ తరఫున క్రికెట్ ఆడతాడు. రూట్, షెఫీల్డ్‌లోని డోర్ ప్రైమరీ, కింగ్ ఎగ్‌బర్ట్ స్కూల్‌లో చదివాడు. 15 ఏళ్ళ వయసులో క్రికెట్ స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌పై, వర్క్‌సాప్ కాలేజీలో వీక్లీ బోర్డర్‌గా చదివాడు. [12]
రూట్ తన తండ్రి అడుగుజాడల్లో అబ్బేడేల్ పార్క్‌లోని షెఫీల్డ్ కాలేజియేట్ CCలో చేరాడు. మాజీ యార్క్‌షైర్ బ్యాటరు, ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా కాలేజియేట్‌లోనే తన ఆట మొదలుపెట్టాడు. రూట్‌కు స్పూర్తిగా నిలిచాడు. ప్రతిష్టాత్మకమైన బన్‌బరీ ఫెస్టివల్‌లో రూట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు. [12] [13] [14] రూట్ అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్ షెఫీల్డ్ యునైటెడ్‌కు మద్దతుదారు. [15]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2012 – 13: ఇంగ్లండ్ తరఫున రంగప్రవేశం
మార్చుభారత్తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో, రూట్ ఇంగ్లండ్ మాజీ ఆల్-రౌండర్ పాల్ కాలింగ్‌వుడ్ నుండి తన క్యాప్ అందుకున్నాడు. టెస్టు స్థాయిలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన 655వ ఆటగాడతడు. ఓపెనర్‌గా తన సాధారణ స్థానంలో కాకుండా ఆరో నంబర్ బ్యాటర్‌గా వచ్చిన అతను 229 బంతుల్లో 73 పరుగులు చేశాడు, కెవిన్ పీటర్సన్‌తో కలిసి సంయుక్తంగా అత్యధిక స్కోరు చేశాడు. [16] రెండో ఇన్నింగ్స్‌లో అతను 20 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడంలో సహాయం చేశాడు. 1984-85 తర్వాత భారత గడ్డపై మొదటి టెస్టు సిరీస్ విజయం సాధించాడు.
రూట్ తన T20 అరంగేట్రం చేసిన తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అతను బ్యాటింగ్ చేయాల్సిన అవసరం పడలేదు. జానీ బెయిర్‌స్టో వైదొలగడంతో అతడిని వన్డే జట్టులోకి కూడా తీసుకున్నారు. [17] రూట్ తన తొలి వన్‌డేలో కూడా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. కానీ తొమ్మిది ఓవర్లు బౌల్ చేశాడు. 0-51 గణాంకాలను సాధించాడు. ఇంగ్లాండ్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది. అతను తర్వాతి రెండు మ్యాచ్‌లలో 36, 39 స్కోర్లు చేసాడు, సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్‌లో తన తొలి వన్‌డే ఫిఫ్టీని నమోదు చేసాడు. ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. రూట్ 163 పరుగులతో సిరీస్‌ను ముగించాడు.
విజయవంతమైన భారత పర్యటన తర్వాత, రూట్‌ను న్యూజిలాండ్ పర్యటన కోసం టెస్టు జట్టులో ఉంచారు. గతంలో ప్రకటించిన వన్‌డే, T20 జట్టులో చేర్చారు. అతను వన్‌డే సిరీస్‌ను రెండు అర్ధ సెంచరీలతో ప్రారంభించాడు, మొదటి గేమ్‌లో 56 పరుగులు, రెండవ మ్యాచ్‌లో 56 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అలా చేయడం ద్వారా, రూట్ తన వన్‌డే కెరీర్‌ను 30కి పైగా వరుసగా ఆరు స్కోర్‌లతో ప్రారంభించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. సిరీస్‌ను 163 పరుగులతో ముగించాడు. [18]
టెస్టు సిరీస్‌లో, రూట్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కొనసాగించాడు మూడవ టెస్టులో టిమ్ సౌతీ బౌలింగ్‌లో 176 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సిరీస్ 0-0తో ముగిసింది. రూట్ 88 పరుగులతో సిరీస్‌ను ముగించాడు.
2022 మేలో రూట్, 2022లో ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[19] మొదటి టెస్టు మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో, అతను 115* పరుగులు చేశాడు. ఇది 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సహాయపడింది. ఈ ప్రదర్శన ఫలితంగా, అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. [20] సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్‌లో, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేశాడు. మూడో టెస్టు మ్యాచ్‌లో, అతను ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 86* పరుగులు చేసి 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్‌కు సహాయం చేశాడు. సిరీస్ మొత్తం, అతను 6 ఇన్నింగ్స్‌లలో 99.00 సగటుతో మొత్తం 396 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. [21] [22]
2019: క్రికెట్ ప్రపంచ కప్
మార్చు2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [23] [24] అతను టోర్నమెంట్‌లో మంచి ఆరంభాన్ని పొందాడు, ఇంగ్లండ్ మొదటి ఆరు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు (పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై), మరో మూడు అర్ధసెంచరీలూ చేశాడు. [25] 2019 జూన్ 21న, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, రూట్ ఇంగ్లాండ్ తరపున తన 250వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు. [26]
ఐసిసి 2019 ప్రపంచ కప్ కోసం 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో అతను పేరు పొందాడు. "ఏళ్లుగా జో రూట్ ఇంగ్లాండ్‌కు పరుగుల యంత్రంగా ఉన్నాడు. టోర్నమెంటులో వారి ప్రసిద్ధ బ్యాటింగును కలిపి ఉంచిన వాడతను. ఈ యార్క్‌షైర్ బ్యాటరు 11 ఇన్నింగ్స్‌లలో 556 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. రూట్ దోషరహితమైన సాంకేతికత, స్ట్రైక్‌ని తిప్పుతూ, అవసరమైనప్పుడు బౌండరీలు సాధిస్తూ స్కోర్‌బోర్డ్‌ను కదిలించే సామర్థ్యం అతన్ని ఈ లైనప్‌లో పరిపూర్ణమైన నం.3గా చేసింది" అని ఐసిసి పేర్కొంది.[27]
2021 జూన్ 29 న, శ్రీలంకతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో, రూట్ తన 150వ వన్‌డే మ్యాచ్‌లో ఆడాడు. [28] అదే మ్యాచ్‌లో, రూట్ వన్‌డే క్రికెట్‌లో తన 6,000వ పరుగు కూడా సాధించాడు. తద్వారా 6000 పరుగులు సాధించిన నాల్గవ వేగవంతమైన ఆటగాడిగా (ఇన్నింగ్స్ పరంగా) నిలిచాడు. [29] [30]
2022-ప్రస్తుతం
మార్చుదక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టెస్ట్‌లలో తొలిసారిగా రూట్ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు, సంవత్సరం ప్రారంభంలో ఈ పాత్రకు నియమించబడ్డాడు. [31] మొదటి టెస్ట్‌లో, అతను 190 పరుగులు చేశాడు, ఇది ఇంగ్లండ్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌కు కొత్త రికార్డ్ స్కోరు.[32] ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచి 3-1 సిరీస్ విజయాన్ని సాధించింది. వెస్టిండీస్‌పై టెస్ట్-సిరీస్ విజయం తర్వాత, రూట్ వరుసగా 12 టెస్టు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ సాధించిన AB డివిలియర్స్ రికార్డును రెండో టెస్టులో సమం చేశాడు. [33]
భారత్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టు సమయంలో, రూట్ తన అజేయంగా 142 పరుగులతో విజయవంతమైన పరుగులు చేశాడు. ఐదు టెస్టుల్లో 700కు పైగా పరుగులతో సిరీస్‌ను ముగించాడు. [34]
2022 జూలైలో రూట్, 2022లో ఇంగ్లాండ్లో[35][36] జరిగిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్ వన్డే, టెస్టు జట్టుల్లో ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్లో అతను 4 ఇన్నింగ్స్లలో మొత్తం 46 పరుగులు చేశాడు.[21]
టెస్టు కెప్టెన్సీ
మార్చురూట్ 2017 ఫిబ్రవరి 13 న అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తరువాత రూట్‌ను పూర్తికాల టెస్టు కెప్టెనుగా నియమించారు. ఇంగ్లాండ్ కెప్టెన్లలో అతను 80వ వాడు.[37] కెప్టెనుగా తన తొలి మ్యాచ్లో 2017 జూలై 6 న దక్షిణాఫ్రికాతో లార్డ్స్ మైదానంలో రూట్ 190 పరుగుల ఇన్నింగ్స్తో తన 12వ టెస్టు సెంచరీని సాధించాడు. కెప్టెనుగా తొలి టెస్టులో సెంచరీ సాధించిన 6వ (అత్యధిక స్కోరు సాధించిన) ఇంగ్లాండ్ ఆటగాడు. కౌంటీ సహచరుడు గ్యారీ బ్యాలెన్స్ ఇంగ్లాండ్ జట్టులోకి తిరిగి రావడంపై కూడా అతని పాత్ర ఉంది.[38]
అంతర్జాతీయ శతకాలు
మార్చుప్రత్యర్థి | టెస్టులు | వన్‌డే | T20I |
---|---|---|---|
ఆస్ట్రేలియా | 4 | — | — |
బంగ్లాదేశ్ | — | 1 | — |
India | 9 | 3 | — |
న్యూజీలాండ్ | 5 | 3 | — |
పాకిస్తాన్ | 1 | 1 | — |
దక్షిణాఫ్రికా | 2 | 2 | — |
శ్రీలంక | 4 | 2 | — |
వెస్ట్ ఇండీస్ | 5 | 4 | — |
మొత్తం | 30 | 16 | — |
46 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన రూట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో పదకొండవ స్థానంలో ఉన్నాడు. [39]
అవార్డులు
మార్చు- ICC పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : 2021 [40]
- ICC టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ : 2014, 2015, 2016, 2021
- విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : 2014 [41]
- ICC వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్ : 2015, 2018 [42]
- ఇంగ్లండ్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: 2015 [43]
- ఇంగ్లండ్ లిమిటెడ్-ఓవర్ల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: 2015 [43]
- క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ రూట్ 2020 న్యూ ఇయర్ ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) సభ్యునిగా నియమితులయ్యారు. [44]
- ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ : ఆగస్టు (2021) [45]
- PCA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2021 [46]
- విస్డెన్ యొక్క ఐదుగురు క్రికెటర్లు ఆఫ్ ది ఇయర్: ఏప్రిల్ 2022 [47]
మూలాలు
మార్చు- ↑ "Root named England Test captain". ESPNcricinfo. Retrieved 16 November 2021.
- ↑ "England Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 16 November 2021.
- ↑ "England's greatest Test XI revealed". ICC. 30 July 2018. Archived from the original on 26 July 2019. Retrieved 26 July 2019.
- ↑ "England Cricket World Cup player ratings: How every star fared on the road to glory". Evening Standard. 15 July 2019. Archived from the original on 15 July 2019. Retrieved 15 July 2019.
- ↑ "Root named Wisden's leading cricketer in the world". BBC Sport. Retrieved 20 April 2022.
- ↑ "Joe Root: England batter passes 10,000 Test runs". BBC Sport. Retrieved 5 June 2022.
- ↑ "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 16 November 2021.
- ↑ "Batting records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 16 November 2021.
- ↑ "England Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 16 November 2021.
- ↑ "Records | Test matches | Partnership records | Highest partnerships by wicket | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 16 November 2021.
- ↑ "Joe Root: Man of Steel". Archived from the original on 6 September 2018. Retrieved 17 March 2018.
- ↑ 12.0 12.1 Squires, Neil (10 July 2013). "Exclusive: England's Joe Root in the words of those who helped him to the top". Daily Express. Archived from the original on 30 January 2016. Retrieved 27 July 2015.
- ↑ Hall, Danny. "Root is ready to branch out". ESPNcricinfo. Archived from the original on 7 November 2012. Retrieved 22 January 2010.
- ↑ "Root ready for India examination – Elite Player Development – England – News – ECB". England and Wales Cricket Board. Archived from the original on 4 June 2011. Retrieved 22 January 2010.
- ↑ Drury, Sam (3 July 2017). "Joe Root: Captaining England will drive me forward as a batsman". Sky Sports. Archived from the original on 1 December 2017. Retrieved 22 November 2017.
- ↑ "English cricket team in India – 4th Test". ESPNcricinfo. Archived from the original on 11 March 2014. Retrieved 14 December 2012.
- ↑ "Bairstow to miss India ODIs". ESPNcricinfo. 28 December 2012. Archived from the original on 31 December 2012. Retrieved 28 December 2012.
- ↑ Gardner, Alan (20 February 2013). "Anderson and Root deliver big win". ESPNcricinfo. Archived from the original on 23 February 2013. Retrieved 22 February 2013.
- ↑ "James Anderson & Stuart Broad recalled by England for New Zealand Tests". BBC Sport. Retrieved 18 May 2022.
- ↑ "Milestone man Root stars in England's win". Cricbuzz. Retrieved 25 November 2022.
- ↑ 21.0 21.1 "England wrap up series in 5.3 overs on fifth morning". Cricbuzz. Retrieved 25 November 2022.
- ↑ "Imperious Bairstow gives England thumping win in Leeds". Cricbuzz. Retrieved 25 November 2022.
- ↑ "Jofra Archer misses World Cup cut but included to play Ireland, Pakistan". ESPN Cricinfo. Archived from the original on 17 April 2019. Retrieved 17 April 2019.
- ↑ "England leave out Jofra Archer from World Cup squad". International Cricket Council. Archived from the original on 17 April 2019. Retrieved 17 April 2019.
- ↑ "World Cup 2019: Joe Root becomes first Englishman to score three World Cup hundreds". The Indian Express. 14 June 2019. Archived from the original on 19 June 2019. Retrieved 19 June 2019.
- ↑ "ICC Cricket World Cup 2019 (Match 27): England vs Sri Lanka – Stats Preview". Cricket Addictor. 21 June 2019. Archived from the original on 21 June 2019. Retrieved 21 June 2019.
- ↑ "CWC19: Team of the Tournament". Icc-cricket.com. Archived from the original on 15 July 2019. Retrieved 16 July 2019.
- ↑ "Off-field upheaval leaves Sri Lanka looking even more vulnerable for ODIs". ESPN Cricinfo. Retrieved 29 June 2021.
- ↑ "Joe Root surpasses Sourav Ganguly to become 4th fastest to 6,000 ODI runs". Times Now News. Retrieved 29 June 2021.
- ↑ "Eng vs SL 1st ODI stats review: Joe Root completes 6000 ODI runs and much more". SportsTiger. 29 June 2021. Retrieved 29 June 2021.
- ↑ "Root named England Test captain". BBC Sport. Retrieved 17 March 2022.
- ↑ "England seize day as Root launches captaincy with 184*". ESPNcricinfo. Retrieved 17 March 2022.
- ↑ "Root equals de Villiers and the Gabriel-Roach double-act". ESPNcricinfo. Archived from the original on 26 August 2017. Retrieved 29 August 2017.
- ↑ "Root, Bairstow give England the edge in historic chase". Cricbuzz. Retrieved 25 November 2022.
- ↑ "England Men name squads for white-ball matches against South Africa". England and Wales Cricket Board. Retrieved 25 November 2022.
- ↑ "England v South Africa: Ollie Robinson recalled for first two Tests". BBC Sport. Retrieved 25 November 2022.
- ↑ "Root named England Test captain". ESPNcricinfo. Archived from the original on 13 February 2017. Retrieved 13 February 2017.
- ↑ "Joe Root's stunning captaincy debut". ESPNcricinfo. Archived from the original on 6 July 2017. Retrieved 7 July 2017.
- ↑ "Joe Root". ESPNcricinfo. Archived from the original on 3 February 2019. Retrieved 17 December 2018.
- ↑ "ICC Men's Test Cricketer of the Year 2021 | ICC". www.icc-cricket.com. Archived from the original on 26 September 2022. Retrieved 4 April 2022.
- ↑ Waters, Chris (2014). "Wisden Cricketers of the Year 2014 – Joe Root". Wisden Cricketers' Almanack. Archived from the original on 18 June 2018. Retrieved 1 January 2018 – via ESPNcricinfo.
- ↑ "India, England dominate ICC ODI Team of the Year". Icc-cricket.com. Archived from the original on 26 January 2019. Retrieved 26 January 2019.
- ↑ 43.0 43.1 Berry, Scyld (16 May 2016). "Joe Root wins England hat-trick of awards but warns 'brutal game' can bite him at any time". The Telegraph. Archived from the original on 21 April 2018. Retrieved 4 April 2018.
- ↑ You must specify issue= when using {{London Gazette}}.
- ↑ Arora, Sumit (15 September 2021). "Joe Root, Eimear Richardson named ICC Players of the Month for August". Currentaffairs.adda247.com. Retrieved 12 January 2022.
- ↑ "Joe Root & Eve Jones win PCA player of the year awards". BBC Sport. 29 September 2021. Retrieved 29 September 2021.
- ↑ "Rohit Sharma, Jasprit Bumrah Among Wisden's 5 Cricketers Of The Year". NDTV Sports. 21 April 2022. Retrieved 21 April 2022.