జౌన్‌పూర్
జౌన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. జౌన్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఆగ్నేయంగా 228 కి.మీ. దూరంలో ఉంది.
జౌన్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°44′N 82°41′E / 25.73°N 82.68°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | జౌన్‌పూర్ |
స్థాపన | 1359 |
Founded by | ఫిరోజ్ షా తుగ్లక్ |
Named for | మహమ్మద్బిన్ తుగ్లక్ (జౌనా ఖాన్) |
Elevation | 82 మీ (269 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,80,362 |
• జనసాంద్రత | 1,113/కి.మీ2 (2,880/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UP-62 |
లింగ నిష్పత్తి | 924 females per 1000 males ♂/♀ |
Website | http://jaunpur.nic.in |
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జౌన్‌పూర్ జనాభా 1,80,362, ఇందులో పురుషులు 93,718, మహిళలు 86,644 మంది ఉన్నారు, అంటే లింగనిష్పత్తి 924 / 1000. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 22,710. జౌన్‌పూర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,28,050, ఇది జనాభాలో 71%, పురుష అక్షరాస్యత 75.2%, స్త్రీ అక్షరాస్యత 66.5%. జౌన్‌పూర్‌లో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 81.2%. అందులో పురుషుల అక్షరాస్యత 86.1%, స్త్రీ అక్షరాస్యత 75.9%. షెడ్యూల్డ్ కులాల జనాభా 12,703, షెడ్యూల్డ్ తెగల జనాభా 195. 2011 నాటికి పట్టణంలో 26,216 గృహాలు ఉన్నాయి.[1]
రవాణా
మార్చుజౌన్పూర్ నుండి అన్ని ప్రధాన నగరాలకూ చక్కటి రైలు సౌకర్యం ఉంది. పట్టణంలో నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి: జౌన్‌పూర్ సిటీ రైల్వే స్టేషన్ (జెఓపి), జౌన్‌పూర్ జంక్షన్ (జెఎన్‌యు), షాగంజ్ జంక్షన్ (ఎస్‌హెచ్‌జి), జంఘాయ్ జంక్షన్, కేరకట్ రైల్వే స్టేషన్ (కెసిటి).
జౌన్‌పూర్ నుండి లక్నో, గోరఖ్పూర్, వారణాసి, అలహాబాద్, ఆజంగఢ్, మిర్జాపూర్, సుల్తాన్పూర్, గాజీపూర్ మొదలైన నగరాలకు చక్కటి రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి-56, రాష్ట్ర రహదారి -36 ల ద్వారా జౌన్‌పూర్ నుండి ఇతర నగరాలకు రవాణా సౌకర్యం ఉంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Jaunpur (NPP)". www.censusindia.gov.in. Retrieved 6 September 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 5 డిసెంబరు 2020.