జ్ఞానేశ్వర్ పాటిల్

జ్ఞానేశ్వర్ పాటిల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖాండ్వా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

జ్ఞానేశ్వర్ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 నవంబర్ 2021
ముందు నంద్ కుమార్ సింగ్ చౌహాన్
నియోజకవర్గం ఖాండ్వా

వ్యక్తిగత వివరాలు

జననం 27 జనవరి 1969
బుర్హాన్‌పూర్, మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నత్తు పాటిల్, శాంతా దేవి
జీవిత భాగస్వామి జైశ్రీ పాటిల్
సంతానం 2 కుమారులు, 1 కూతురు
నివాసం ఖాండ్వా , మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

జ్ఞానేశ్వర్ పాటిల్ విద్యార్థి దశలోనే 1987లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో చేరి కళాశాలల్లో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఆ తరువాత భారతీయ జనతా యువమోర్చాలో చేరాడు. ఆయన 1995 నుండి 1998 వరకు బీజేవైఎం ఖాండ్వా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1998 నుండి 2001 వరకు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, 2001లో బిజెపి పంచాయతీరాజ్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2012 నుండి 2014 వరకు రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పని చేశాడు.

జ్ఞానేశ్వర్ పాటిల్‌కు 2021లో ఖాండ్వా లోక్‌సభ సభ్యుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్ మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కడంతో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 82,000 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2022 నుండి జూన్ 2024 వరకు శక్తిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

జ్ఞానేశ్వర్ పాటిల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖాండ్వా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర పటేల్‌ను 2,69,971 ఓట్ల ఓడించి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 26 సెప్టెంబర్ 2024 నుండి పర్సనల్, పబ్లిక్, గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Hindustan Times (2 November 2021). "Madhya Pradesh bypolls highlights: BJP wins Khandwa LS, 2 assembly seats; Congress retains Raigaon" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Madhya Pradesh State". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  3. TimelineDaily (6 June 2024). "Know All About BJP's Gyaneshwar Patil And His Khandwa Win" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
  4. TV9 Bharatvarsh (6 June 2024). "खंडवा लोकसभा सीट से जीतने वाले BJP के ज्ञानेश्वर पाटिल कौन हैं? जानिए अपने सांसद को". Retrieved 17 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)