నంద్ కుమార్ సింగ్ చౌహాన్

నంద్ కుమార్ సింగ్ చౌహాన్ (8 సెప్టెంబర్ 1952 - 2 మార్చి 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖాండ్వా నియోజకవర్గం నుండి ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నంద్ కుమార్ సింగ్ చౌహాన్
నంద్ కుమార్ సింగ్ చౌహాన్


పదవీ కాలం
2014 – 2021
ముందు అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్
తరువాత జ్ఞానేశ్వర్ పాటిల్
నియోజకవర్గం ఖాండ్వా
పదవీ కాలం
1996 – 2009
ముందు ఠాకూర్ మహేంద్ర కుమార్ నవల్ సింగ్
తరువాత అరుణ్ సుభాశ్చంద్ర యాదవ్
నియోజకవర్గం ఖాండ్వా

భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు
పదవీ కాలం
16 ఆగస్టు 2014 – 18 ఏప్రిల్ 2018
ముందు నరేంద్ర సింగ్ తోమార్
తరువాత రాకేష్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-09-08)1952 సెప్టెంబరు 8
బుర్హాన్‌పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం
మరణం 2021 మార్చి 2(2021-03-02) (వయసు 68)
గుర్గావ్ , హర్యానా , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దుర్గశ్రీ
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం షాపూర్, బుర్హాన్‌పూర్

రాజకీయ జీవితం

మార్చు

నందకుమార్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1978లో షాపూర్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఆ తరువాత 1985 నుండి 1996 వరకు వరుసగా రెండుసార్లు బుర్హాన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1996 లోక్‌సభ ఎన్నికలలో ఖాండ్వా నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. నందకుమార్ సింగ్ చౌహాన్ 1998 ఎన్నికల్లో ఖాండ్వా నుండి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నందకుమార్ సింగ్ చౌహాన్ 1999, 2004 లోక్‌సభ ఎన్నికలలో ఖాండ్వా నియోజకవర్గం వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2009 ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నంద్ కుమార్ సింగ్ చౌహాన్ జనవరి 11 న కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ భోపాల్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించి గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టుపై ఉండి మార్చి 2న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

మార్చు
  1. Zee News (2 March 2021). "खंडवा के BJP सांसद Nand Kumar Chauhan का दिल्ली में निधन, 11 जनवरी को कोविड-19 से हुए थे संक्रमित". Retrieved 14 October 2024.
  2. The Hindu (2 March 2021). "BJP MP Nand Kumar Singh Chauhan passes away" (in Indian English). Retrieved 14 October 2024.