జ్యేష్టదేవుడు
జ్యేష్టదేవుడు (మలయాళం: ജ്യേഷ്ഠദേവന്) (c. 1500 – c. 1610) [1] సంగమగ్రామ మాధవ (c.1350 – c.1425) స్థాపించిన "కేరళ గణిత, ఖగోళ శాస్త్ర పాఠశాల"లో ఖగోళ, గణిత శాస్త్రవేత్త. ఈయన ఉత్తమ గ్రంథం అయిన యుక్తిభాస యొక్క రచయిత. ఈ గ్రంథం నీలకంఠ సోమయాజి (1444-1544) రచించిన "తరణ సంగ్రహం"యొక్క మలయాళంలో ఒక వ్యాఖ్యానం. ఆ సమయంలో సంప్రదాయ భారతీయ గణిత శాస్త్రజ్ఞులుకు ఒక అసాధారణమైన గ్రంథం. గణిత శాస్త్రంలో యుక్తిభాస పై విషయ విశ్లేషణను కొంతమంది పరిశోధకులు "కలన గణితం యొక్క మొదటి పాఠ్యపుస్తకం"గా ప్రోత్సహించారు[2]. జ్యేష్టదేవుడు ఖగోళ శాస్త్ర పరిశీలనా గ్రంథం Drk-karanaను రచించాడు.[3]
జ్యేష్టదేవుడు | |
---|---|
జననం | జ్యేష్టదేవుడు c.1500 CE |
మరణం | c.1610 CE |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ఖగోళ శాస్త్రవేత్త - గణిత శాస్త్రవేత్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | యుక్తిభాస గ్రంథ రచయిత. |
గుర్తించదగిన సేవలు | యుక్తిభాస, Drkkarana |
బంధువులు | పారన్గొట్టు కుటుంబం |
జ్యేష్టదేవ యొక్క జీవిత కాలం
మార్చుఅనేక పురాతన రాత ప్రతులలో జ్యేష్ట దేవుని గూర్చి అనేక మూలాలు లభిస్తున్నాయి[1]. ఈ రాత ప్రతుల నుండి, అతని జీవితం గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవచ్చు.అతను మలయాళ బ్రాహ్మణ శాఖయైన నంబూద్రికి చెండినవాడు. సా.శ. 1500 లో పరంగ్న్‌గొట్టు కుటుంబంలో జన్మించాడు. అతను దామోదరకు శిష్యుడు. అతను నీలకంఠ సోమయాజికి సమకాలికుడు. జ్యేష్టదేవుని శిష్యుడు అచ్యుత పీషరటి. 1592లో అత్యుత పీషరటి పూర్తిచేసిన ఉపరగక్రియకర్మ గ్రంథం చివరి శ్లోకాలలో తన గురువు జ్యేష్ట దేవుడు అని ఉటంకించాడు. జ్యేష్టదేవుడు రాసినదిగా భావించబడుతున్న దృక్కరణ అనే గ్రంథ మూలం ఆధారంగా అతను సా.శ. 1610 వరకు జీవించి ఉన్నట్లు తెలియుచున్నది.
గణిత వంశం
మార్చుసంగమగ్రామ మాధవకు ముందు కేరళలో గణిత సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. వటసేరి పరమేశ్వడుడు, మాధవుని ప్రత్యక్ష శిష్యుడు. దామోదర పరమేశ్వర కుమారుడు. నీలకంఠ సోమయాజీ, జ్యేష్ఠదేవ దామోదర విద్యార్థులు. జ్యేష్టదేవుని శిష్యుడు అచ్యుత పీషరటి. మెల్పాతుర్ నారాయణ భట్టతిరి అచ్యుత పిషరటికి శిష్యుడు.
రచనలు
మార్చుఅతను యుక్తిభాస, దృక్కరణ అనే గ్రంథాలను రచించాడు. అందులో మొదటిది నీలకంఠ సోమయాజి రాసిన తంత్రసంగ్రహం రచనకు హేతువులతో వ్యాఖ్యానం. రెండవది ఖగోళ గణనలపై ఒక గ్రంథం.
భారత ఉపఖండంలో గణిత్ శాస్త్ర అభివృద్ధికి యుక్తి భాస అనే గ్రంథం ఎంతో దోహదపడడానికి మూడు కారణాలున్నాయి.
- అది స్థానిక మలయాళ భాషలో రాయబడింది. అంతకు ముందు సంస్కృతంలో రచనలు ఉండేవి.
- పద్యాలలో రాసేదానికి భిన్నంగా ఈ రచన గద్యంలో రాయబడింది. కేరళ పాఠశాల ఇతర ముఖ్యమైన రచనలన్నీ పద్యంలో ఉన్నాయి.
- మరీ ముఖ్యంగా, యుక్తిభాను ఉద్దేశపూర్వకంగా ఋజువులతో సహా రాయబడింది.
యివి కూడా చూడండి
మార్చుసూచికలు
మార్చు- ↑ 1.0 1.1 K.V. Sarma (1991). "Yuktibhāṣā of Jyeṣṭhadeva : A book of rationales in Indin mathematics and astronomy - an analytical appraisal" (PDF). Indian Journal of History of Science. 26 (2): 185–207. Archived from the original (PDF) on 2020-06-17. Retrieved 2020-07-11.
- ↑ Divakaran, P. P. (December 2007). "The First Textbook of Calculus: Yuktibhāṣā". Journal of Indian Philosophy. 35 (5–6). Springer Netherlands: 417–443. doi:10.1007/s10781-007-9029-1. ISSN 0022-1791. Retrieved 28 January 2010.
- ↑ J J O'Connor; E F Robertson (November 2000). "Jyesthadeva". School of Mathematics and Statistics University of St Andrews, Scotland. Retrieved 28 January 2010.
మరింత సూచనలు
మార్చు- Details on the English translation of Yuktibhāṣā by K. V. Sarma: Sarma, K.V.; Ramasubramanian, K.; Srinivas, M.D.; Sriram, M.S. (2008). Ganita-Yukti-Bhasa (Rationales in Mathematical Astronomy) of Jyeṣṭhadeva: Volume I: Mathematics, Volume II: Astronomy. Sources and Studies in the History of Mathematics and Physical Sciences. Springer jointly with Hindustan Book Agency, New Delhi, India. ISBN 978-1-84882-072-2. (This is a critical translation of the original Malayalam text by K.V. Sarma with explanatory notes by K. Ramasubramanian, M.D. Srinivas and M.S. Sriram.)
- For a review of the English translation of Yuktibhāṣā : Homer S. White (2009-07-17). "Ganita-Yukti-Bhāsā (Rationales in Mathematical Astronomy) of Jyesthadeva". MAA Reviews. The Mathematical Association of America. Retrieved 30 January 2010. [dead link]
- R.C. Gupta (1973). "Addition and subtraction theorems for the sine and the cosine functions in medieval india" (PDF). Indian Journal of History of Science. 9 (2): 164–177. Archived from the original (PDF) on 2014-11-29. Retrieved 2013-07-01.
- K. V. Sarma (1972). A history of the Kerala school of Hindu astronomy (in perspective). Vishveshvaranand Indological series. Vol. 55. Vishveshvaranand Institute of Sanskrit & Indological Studies, Hoshiarpur, Panjab University.
- K.V. Sarma. "Tradition of Aryabhatiya in Kerala : Revision of planetary parameters" (PDF). Indian Journal of History of Science. 12 (2): 194–199. Archived from the original (PDF) on 29 నవంబరు 2014. Retrieved 30 January 2010.
- George Gheverghese Joseph (2000). The Crest of the Peacock: The Non-European Roots of Mathematics. Princeton University Press. p. 416. ISBN 978-0-691-00659-8. Archived from the original on 2010-01-29. Retrieved 2013-07-01.
- Plofker, Kim (2009). "7 The school of Madhava in Kerala". Mathematics in India. Princeton University Press. pp. 219–254.
- For a modern explanation of Jyeṣṭhadeva's proof of the power series expansion of the arctangent function: Victor J. Katz. "12". A history of mathematics : An introduction (3 ed.). 2009: Addison Wesley. pp. 450–455. ISBN 978-0-321-38700-4. Archived from the original on 2009-03-06. Retrieved 2013-07-01.
{{cite book}}
: CS1 maint: location (link)