ఝాన్సీ (2022 వెబ్‌సిరీస్)
ఝాన్సీ 2022లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్. ట్రైబల్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు తిరు దర్శకత్వం వహించాడు. అంజలి, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్తా హొర్నాడ్, చాందిని చౌదరి, వేణు పొల్సాని ప్రధాన పాత్రల్లో ఆరు ఎపిసోడ్స్ తో నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 27న విడుదలైంది.[2]
ఝాన్సీ | |
---|---|
దర్శకత్వం | తిరు |
రచన | గణేష్ కార్తీక్ |
నిర్మాత | కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల |
తారాగణం | అంజలి ఆదర్శ్ బాలకృష్ణ సంయుక్తా హొర్నాడ్ చాందిని చౌదరి |
నిర్మాణ సంస్థ | ట్రైబల్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | అక్టోబరు 27, 2022(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఆరేళ్ల క్రితం గతం మర్చిపోయిన ఝాన్సీ (అంజలి), గతంలో భార్యతో విడిపోయిన సంకేత్ (ఆదర్శ్ బాలకృష్ణ) తన కూతురు మేహతో కలిసి ఇద్దరూ సహజీవం చేస్తుంటారు. ఝూన్సీ కూడా అతడి కుమార్తేను ఎంతో ప్రేమగా చూసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని గడుుపుతూ ఉంటోంది. అయితే ఈ క్రమంలో ఝాన్సీపై మోడార్ (రుద్ర ప్రతాప్) దాడి చేస్తాడు? ఝాన్సీ గతం మర్చిపోవడానికి కారణమేంటి? అసలు మోడార్ ఎవరు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- ఝాన్సీ/మహితగా అంజలి
- బార్బిగా చాందిని చౌదరి
- సబ్ ఇన్ స్పెక్టర్ సాక్షీగా సంయుక్త హోర్నాడ్, తను సంకేత్ మాజీ భార్య, ఝాన్సీ కేసు దర్యాప్తు అధికారిణి.
- సంకేత్ గా ఆదర్శ్ బాలకృష్ణ
- వేణు పొల్సాని
- రాజ్ అర్జున్
- రామేశ్వరి తాళ్లూరి
- ముమైత్ ఖాన్
- ప్రదీప్ రుద్ర
- శరణ్య రామచంద్రన్
- కళ్యాణ్
- అభిరాం వర్మ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ట్రైబల్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
- మాటలు: రామ్ వంశీకృష్ణ
- ఎడిటర్: ఆంథోనీ
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: ఆర్వీ
మూలాలు
మార్చు- ↑ "అంజలి ఝాన్సీ వెబ్ సిరీస్ విడుదల తేదీ ఫిక్స్.. వివరాలివే". 13 October 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ Sakshi (28 October 2022). "హాట్‌స్టార్‌లో అంజలి 'ఝాన్సీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ "రివ్యూ: ఝాన్సీ.. అంజలి నటించిన సిరీస్ ఎలా ఉందంటే?". 28 October 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.