వేణు పొల్సాని నటుడు, దర్శకుడు, రేడియో, టివి కళాకారుడు, కెమెరామెన్.[1]

వేణు పొల్సాని
వేణు పొల్సాని చిత్రం
జననండిసెంబర్ 18, 1962
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు, దర్శకుడు, రేడియో, టివి కళాకారుడు, కెమెరామెన్
తల్లిదండ్రులు
  • మురళీధర్ రావు (తండ్రి)

జననం మార్చు

వేణు 1962, డిసెంబర్ 18న జన్మించాడు. తండ్రి పేరు మురళీధర్ రావు, తల్లి పేరు సుశీలాదేవి.

ఉద్యోగం మార్చు

  1. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో టెక్నికల్ ఇన్ ఛార్జీగా పనిచేశాడు.
  2. 2007, అక్టోబర్ 31నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

నాటకరంగంలో ఆసక్తి ఉన్న వేణు తన పదమూడవ ఏట 1975లో 'అల్లూరి సీతారామరాజు' ఏకపాత్రాభినయంతో తొలిసారిగా రంగస్థలంపై అడుగుపెట్టాడు. 1977 నుండి 1990 వరకు రంగస్థలంలో సహాయ దర్శకుడిగా, రంగస్థల నిర్వాహకుడిగా, నటుడిగా, దర్శకుడిగా కరీంనగర్ లో నాటకరంగంలో కృషి చేశాడు. అంతేకాకుండా హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో బిఎ డిగ్రీని పూర్తిచేసి, కరీంనగర్ జిల్లా నుండి రంగస్థ శాఖలో బిఎ డిగ్రీని పూర్తిచేసిన తొలి వ్యక్తిగా గుర్తింపుపొందాడు. రంగస్థల నటుడిగా 35 నాటిక, నాటకాల్లో 90 ప్రదర్శనలు, దర్శకుడిగా 8 నాటికలు 12 పదర్శనలు ఇచ్చాడు.

టీవి, సినీ ప్రస్థానం మార్చు

హైదరాబాద్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ నుండి ఫిల్మ్ టీవి డైరెక్షన్ లో డిప్లొమా, బేసిక్ ఫోటోగ్రఫీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి, 1995లో బుల్లితెరలోకి ప్రవేశించాడు.

కెమెరామెన్ గా మార్చు

వివిధ ఛానళ్ళలో ప్రసారమైన స్వరమధురిమలు, సినీ సరాగాలు, మధుర ఘట్టాలు, విజయం మనదే, విప్లవసేసాని, ఆశ మొదలైన ధారావాహికలకు కెమెరామెన్ గా పనిచేశాడు.

దర్శకుడిగా మార్చు

లఘుచిత్రాలు

  1. వడ్ల గింజలో బియ్యం గింజ
  2. కోటీశ్వరుడి కూతురు
  3. వైకుంఠ యాత్ర
  4. భక్త కవిపోతన
  5. నేత బజార్
  6. మనసు పొరల్లో
  7. మనసున మనసై[2]
  8. ఇది నా జీవితం
  9. ఊటబావి (2018 అవతరణ ఫిల్మోత్సవంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి జ్యూరీ అవార్డు) [3]

డాక్యుమెంటరీలు

  1. ఎడిటర్
  2. రెండుగదుల ఇళ్ళు
  3. బ్రైడ్స్ ఆఫ్ లార్డు శివ
  4. లాంగ్ బాటిల్

అవార్డులు మార్చు

  1. 2009లో కరీంనగర్ ఫిలిం సోసైటీవారు నిర్వహించిన3వ జాతీయ లఘుచిత్రాల పోటీలో 'ఇది నా జీవితం' డాక్యుమెంటరీకి ప్రత్యేక జ్యూరీ అవార్డు
  2. 2018 అవతరణ ఫిల్మోత్సవంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి 'ఊటబావి' లఘుచిత్రానికి జ్యూరీ అవార్డు [3]

మూలాలు మార్చు

  1. The Hindu (24 March 2007). "Short film by Warangal director selected". Archived from the original on 18 December 2018. Retrieved 18 December 2018.
  2. Short Films that Provoke Thoughts, The Hindu, Warangal, April 2, 2017
  3. 3.0 3.1 Telangana Today, Tabloid » Cinema & TV Tabloid, Cinema & TV (11 June 2018). "Utabayi: Instilling hope and courageUtabayi: Instilling hope and courage". Prakash Pecheti. Archived from the original on 18 December 2018. Retrieved 18 December 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)