టమటం రామానుజమ్మ
టమటం రామానుజమ్మ తెలంగాణకు చెందిన వెయిట్ లిఫ్టింగ్, పరుగు పందెం క్రీడాకారిణి. 70 ఏళ్ళ వయసులో పరుగుతోపాటు యోగా, కరాటేలోనూ రాణించింది. జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెం పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ పతకం సాధించింది.[1]
టమటం రామానుజమ్మ | |
---|---|
జననం | |
వృత్తి | క్రీడాకారిణి |
జీవిత భాగస్వామి | భాషయ్య |
పిల్లలు | ఇద్దరు కుమారులు |
జీవిత విశేషాలు
మార్చుతెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణం రామానుజమ్మ స్వస్థలం. రామానుజమ్మ భర్త టమటం భాషయ్య వైద్య, ఆరోగ్యశాఖలో సూపర్ వైజర్ గా పనిచేసేవాడు. భర్త ప్రోత్సాహంతో అథ్లెట్ గా మారింది. సిరిసిల్లలోని స్టేడియంలో రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో సాధన చేసింది. రామానుజమ్మకు ఇద్దరు కుమారులు. వయోశ్రేష్ఠ సమ్మాన్ పురస్కారం కూడా అందుకున్నది.[2]
క్రీడారంగం
మార్చురాష్ట్ర స్థాయిలో 200 పతకాలు, జాతీయ స్థాయిలో 10 స్వర్ణం, 5 రజత పతకాలు, జిల్లా స్థాయిలో అనేక పతకాలు సాధించింది. హర్యానాలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని రెండు బంగారు, ఒక వెండి పతకం సాధించింది.[3]
మలేషియాలోని కౌలాలంపూర్‌లో 2023 సెప్టెంబరు 16 నుంచి 18 వరకు జరిగిన 35వ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో 100, 200, 400, 800 మీటర్ల విభాగాల్లో పాల్గొన్న రామానుజమ్మ 200 మీటర్ల పరుగు పందెంలో తృతీయస్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. 50 కిలోల విభాగంలో 55 ఏళ్ళ వయసు వారితో పోటీపడి కాంస్య పతకం సాధించింది.[2]
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2023-09-21). "రామానుజమ్మకు రజతం". www.ntnews.com. Archived from the original on 2023-09-27. Retrieved 2023-10-29.
- ↑ 2.0 2.1 "ఆమె పరుగెడితే పతకమే". EENADU. Archived from the original on 2023-10-29. Retrieved 2023-10-29.
- ↑ "మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు రామానుజమ్మ". Sakshi. 2023-09-08. Archived from the original on 2023-10-29. Retrieved 2023-10-29.