టాక్సీ డ్రైవర్

టాక్సీ డ్రైవర్ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్పి చిట్టిబాబు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం కన్నడంలో సూపర్ హిట్టైన ఆటో రాజా (1980) కు రీమేక్.

టాక్సీ డ్రైవర్
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్పీ. చిట్టిబాబు
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద ,
మోహన్ బాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ విశ్వ చిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

కథసవరించు

రాజా (కృష్ణం రాజు) ఒక టాక్సీ డ్రైవరు. రాణి (జయప్రద) అతడికి కస్టమరు. వారిద్దరూ స్నేహితులవుతారు. ఒక రోజు రాణి రాజాపై తనకున్న ప్రేమను వెల్లడిస్తుంది. రాజా ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. తన కుమారుడు మోహన్ బాబు, రాణిని వివాహం చేసుకోవాలని అల్లు రామలింగయ్య ఆశ. రాజా తన సోదరి స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి వెళ్ళినపుడు, అక్కడ రాణిని చూసి షాక్ అవుతాడు. తాను పేద అమ్మాయి అని చెప్పి మోసం చేసినందుకు రాణిని రాజా తిడతాడు. కాని తరువాత దానికి కారణం వివరిస్తాడు. రాణి తల్లి మానసిక ఆసుపత్రి నుండి తప్పించుకొని తన కుమార్తెను కలుస్తుంది, రావు గోపాలరావు చేసిన నేరాల గురించి చెబుతుంది. తరువాత, అల్లు రామలింగయ్య వచ్చి ఆమెను రాణి దగ్గరి నుండి తీసుకెళ్తాడు. మోహన్ బాబు రాజా, రాణిల ప్రేమ సంగతి తెలుసుకుని అతనిని చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈలోగా అల్లు రామలింగయ్య వచ్చి అతన్ని ఆపుతాడు. రావు గోపాలరావు రాజాను తన ఇంటికి ఆహ్వానించి హెచ్చరిస్తాడు. తన ప్రేమను మరచిపొమ్మని రాజాకు డబ్బు ఇస్తాడు. రాజా రాణిని, ఆమె తల్లినీ నిందితుల నుండి ఎలా రక్షిస్తాడు అనే దాని చుట్టూ మిగిలిన కథ తిరుగుతుంది.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

కథ: ఎం.డి. సుందర్

ఛాయాగ్రాహకుడు: విలియమ్స్

సంగీతం: సత్యం

కూర్పు: డి.వెంకటరత్నం

దర్శకుడు: ఎస్.పి. చిట్టిబాబు

పాటలుసవరించు

సత్యం స్వరపరచిన పాటల జాబితా ఇది [2]:

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "హాటు హాటు అందగాడా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
2. "నా ప్రేయసి ఊహలో ఊర్వశి"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం  
3. "నీ నినా తెలుసా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
4. "మనని చూసి నవ్వేవోళ్ళే"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం  
5. "చలిజ్వరం జ్వరం"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
6. "ఎదలో ఎన్ని కథలో"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  

మూలాలుసవరించు

  1. "Taxi Driver (1981)". ఐ ఎం డి బి. Retrieved 2020-08-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Taxi Driver 1981 Telugu Movie Songs, Taxi Driver Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-05.