టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (హైదరాబాద్)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక పరిశోధన సంస్థ

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక పరిశోధన సంస్థ.[1]

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
రకంపరిశోధన సంస్థ
స్థాపితం1945 అక్టోబరు
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ, 206 acres (83.4 ha)

చరిత్ర మార్చు

1945లో నార్సింగిలోని తాత్కాలిక క్యాంపస్ నుండి కార్యకలాపాలు ప్రారంభించడ్డాయి. 2010, అక్టోబరు 19న అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సంస్థ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశాడు.[2] 2017 అక్టోబరులో హైదరాబాదు విశ్వవిద్యాలయంసమీపంలోని 209 ఎకరాల (85 హెక్టార్లు) క్యాంపస్‌కి మార్చబడింది.

సిబ్బంది, విద్యార్థులు మార్చు

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ మొదటి కేంద్రం. అధ్యాపకులు సహజ శాస్త్రాలు, ఇంజనీరింగ్ వంటి మూడు ప్రధాన శాఖల నుండి తీసుకోబడ్డారు. దాదాపు వందమంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పోస్ట్‌డాక్టోరల్ సభ్యులు, సైంటిఫిక్ సిబ్బంది ఇప్పటికే లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెటీరియల్ సైన్సెస్ నుండి పరిశోధన అంశాలపై ఇక్కడ పని చేస్తున్నారు. న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్, లేజర్ సైన్సెస్, కండెన్స్డ్ మేటర్ ఫిజిక్స్, సింథటిక్, బయోలాజికల్ కెమిస్ట్రీ, సెల్, డెవలప్‌మెంటల్ బయాలజీ సాధనాలను ఉపయోగించి గణనీయమైన ప్రయోగాత్మక ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్‌లో డిపార్ట్‌మెంట్-లెస్ స్ట్రక్చర్ ఉంది.

పరిశోధనా అంశాలు మార్చు

  • బయోలాజికల్ ఫిజిక్స్, మెకనోబయాలజీ
  • బయోఫిజికల్ కెమిస్ట్రీ, మాలిక్యులర్ బయోఫిజిక్స్
  • కణం, క్యాన్సర్ జీవశాస్త్రం
  • కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్
  • ఫ్లూయిడ్ డైనమిక్స్
  • ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోస్కోపీ, మైక్రోస్కోపీ
  • లేజర్ ఫిజిక్స్
  • మెటీరియల్స్ సైన్స్
  • మాలిక్యులర్ జెనెటిక్స్
  • మాలిక్యులర్ ఇమ్యునాలజీ, సెల్ సిగ్నలింగ్
  • న్యూక్లియర్ మాగ్నటిక్ రెసోనాన్స్ స్పెక్ట్రోస్కోపీ
  • సాఫ్ట్ మేటర్
  • సింథటిక్ కెమిస్ట్రీ
  • థియరిటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్

మూలాలు మార్చు

  1. "PM to lay foundation stone of Tata research institute in Hyderabad". Archived from the original on 2010-10-22.
  2. "PM wants India to lead in intellectual property". Rediff.com Business.

బయటి లింకులు మార్చు