టామ్ బర్ట్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు

థామస్ బ్రౌనింగ్ బర్ట్ (1915, జనవరి 22 - 1988, మే 24) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. 1947 నుండి 1953 వరకు పది టెస్టుల్లో ఆడాడు.

టామ్ బర్ట్
దస్త్రం:1947 NZ Test team.jpg
1947 మార్చి క్రైస్ట్‌చర్చ్ లో ఆడిన న్యూజీలాండ్ టెస్ట్ జట్టు (టామ్ బర్ట్ పై వరుసలో కుడివైపు ఉన్నాడు)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
థామస్ బ్రౌనింగ్ బర్ట్
పుట్టిన తేదీ(1915-01-22)1915 జనవరి 22
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
మరణించిన తేదీ1988 మే 28(1988-05-28) (వయసు 73)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 40)1947 21 March - England తో
చివరి టెస్టు1953 6 March - South Africa తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 10 84
చేసిన పరుగులు 252 1,644
బ్యాటింగు సగటు 21.00 17.30
100లు/50లు 0/0 0/4
అత్యధిక స్కోరు 42 68*
వేసిన బంతులు 2,593 23,423
వికెట్లు 33 408
బౌలింగు సగటు 35.45 22.19
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 29
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 5
అత్యుత్తమ బౌలింగు 6/162 8/35
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 53/–
మూలం: Cricinfo, 2017 1 April

దేశీయ క్రికెట్

మార్చు

చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో, 1954-55లో ఎంసిసికి వ్యతిరేకంగా కాంటర్‌బరీ కోసం, జానీ వార్డెల్ వేసిన ఒక ఓవర్‌లో 24 పరుగులు చేశాడు.[1]

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో, 1943 - 1955 మధ్యకాలంలో ఎక్కువగా కాంటర్‌బరీ తరపున 84 మ్యాచ్ లు ఆడాడు, 22.19 సగటుతో 408 వికెట్లు తీసుకున్నాడు. ఇతని సోదరుడు నోయెల్ కూడా కాంటర్బరీ తరపున ఆడాడు, అతని మేనల్లుడు వేన్ బర్ట్ కూడా ఆడాడు.

1937, 1938లో హాకీలో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[2]

ఇతర వివరాలు

మార్చు

1949 ఇంగ్లాండ్ పర్యటనలో న్యూజీలాండ్ తరపున 128 వికెట్లు తీయడమనేది రికార్డుగా ఉంది.[2]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1952-53లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత డ్రాప్ అయ్యేంత వరకు ఆరు సంవత్సరాలపాటు వరుసగా పది టెస్టులు ఆడాడు. లాంగ్ స్పెల్స్ బౌలింగ్ లో రాణించాడు, వికెట్లు తీశాడు, పరుగులు చేశాడు.[3]

మూలాలు

మార్చు
  1. R.T. Brittenden, New Zealand Cricketers, A.H. & A.W. Reed, Wellington, 1961, p. 38.
  2. 2.0 2.1 "Player Profile: Tom Burtt". CricInfo. Retrieved 2009-09-28. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "cricpro" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Richard Boock, The Last Everyday Hero, Longacre, Auckland, 2010, p. 100.

బాహ్య లింకులు

మార్చు