టార్గెట్
టార్గెట్ శ్రీ సాయి సూర్య పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ రాజా దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 2009, మే 22 న విడుదలయ్యింది. 1992లో వచ్చిన బేసిక్ ఇన్‌స్టింక్ట్ అనే హాలీవుడ్ సినిమాకు ఇది అనుసరణ.
టార్గెట్ | |
---|---|
దర్శకత్వం | రమేష్ రాజా |
స్క్రీన్ ప్లే | రమేష్ రాజా |
దీనిపై ఆధారితం | బేసిక్ ఇన్‌స్టింక్ట్ by పాల్ వర్హోవెన్ |
నిర్మాత | సంగిశెట్టి దశరథ, బి.రామకృష్ణ |
తారాగణం | శ్రద్ధా దాస్ ముమైత్ ఖాన్ గీతా సింగ్ వల్లభనేని జనార్ధన్ |
ఛాయాగ్రహణం | వి.సురేష్ కుమార్ |
కూర్పు | కొల్లూరి రమేష్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి సూర్య పిక్చర్స్ |
విడుదల తేదీ | 22 మే 2009 |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శ్రద్ధా దాస్
- శివ బాలాజీ
- ముమైత్ ఖాన్ - నందిని
- గీతా సింగ్
- వల్లభనేని జనార్ధన్
- వేణుమాధవ్
- మల్లాది రాఘవ
- గౌతంరాజు
- రఘునాథ రెడ్డి
- సైరాబాను
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ రాజా
- కూర్పు: కొల్లూరి రమేష్
- సంగీతం: కోటి
- ఛాయాగ్రహణం: వి.సురేష్ కుమార్
కథ
మార్చునందిని నవలా రచయిత్రి. తన సోదరి మందాకిని పేరుతో రచనలు చేస్తూ ఉంటుంది. ఆమె వ్రాసిన ఎర్రగులాబీలు నవల ద్వారా ఆమెకు మంచి పేరు వస్తుంది. ఆ నవలలో వర్ణించిన విధంగానే ఒక బాక్సర్ హత్య చేయబడతాడు. పోలీసులు ఆ హత్యలో మందాకినిని అనుమానిస్తారు. ఆ నవలలో మర్మకళ అనే పురాతన విద్యను వర్ణిస్తుంది. ఆ హత్య కూడా అదే విధంగా చేయబడి ఉంటుంది. ఈ కేసును పరిశోధించడానికి బోస్ అనే ఆఫీసర్‌ను నియమిస్తారు. బోస్ కూడా మందాకినిని హంతకురాలిగా అనుమానిస్తాడు కానీ తన పరిశోధనలో నిరూపించలేకపోతాడు. లై డిటెక్టర్ పరీక్ష రిజల్టు కూడా ఆమె హత్యచేయలేదనే వస్తుంది. అయినా మందాకినినే బోస్ నేరస్తురాలిగా భావిస్తాడు. అసలు ఈ మందాకిని ఎవరు? ఆమె హంతకురాలా? కాక పోతే అసలు నేరస్థులు ఎవరు? అనేదే మిగిలిన కథ.