వల్లభనేని జనార్ధన్
వల్లభనేని జనార్ధన్ (1959 సెప్టెంబర్ 25 - 2022 డిసెంబరు 29) తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. అతను 120కి పైగా సినిమాల్లో నటించాడు.[1]
వల్లభనేని జనార్ధన్ | |
---|---|
![]() | |
జననం | 1959 సెప్టెంబర్ 25 ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 2022 డిసెంబరు 29 హైదరాబాదు | (వయసు 63)
విద్యాసంస్థ | శాతవాహన కళాశాల, విజయవాడ |
జీవిత భాగస్వామి | వి. లలిని చౌదరి (విజయబాపినీడు మూడో కుమార్తె) |
పిల్లలు | అభినయ, అవినాష్ |
తల్లిదండ్రులు |
|
బంధువులు | విజయబాపినీడు (మామ) |
వ్యక్తిగత జీవితంసవరించు
అతను విజయవాడలో 1959లో రాఘవేంద్ర రావు, శేష చంద్రావతి దంపతులకు జన్మించాడు. లయోలా పబ్లిక్ స్కూలులో, శాతవాహన కళాశాలలో చదువుకున్నాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే నాటకాల్లో నటించేవాడు. కళాశాల విద్య అనంతరం "కళామాధురి" పేరుతో నాటక సంస్థను ప్రారంభించాడు. నాటకాలలో నటునిగా దర్శకునిగా నాటకాభిమానుల ప్రశంసలు పొందాడు. తరువాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. అతనికి నిర్మాత కుమార్జీ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో అతన్ని కలిసాడు.
సినిమా జీవితంసవరించు
ఆయన మొదటి సినిమా 1980లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గజదొంగ.[2] [1] ఆ తరువాత తిరుగులేని మనిషి, కృష్ణం రాజు నటించిన రగిలే జ్వాల చిత్రాలలో పనిచేసాడు. కొండవీటి సింహం సినిమాకి కూడా పనిచేసాడు కానీ మధ్యలో వచ్చేసాడు. రాగానే "అర్జున్ ఆర్ట్స్" అనే స్వంత నిర్మాణ సంస్థను స్థాపించాడు. స్వంత అనుభవంతో మామ్మ గారి మనవలు సినిమాను నిర్మించాడు. ఆ సినిమాలో చంద్రమోహన్, సుధాకర్, సుమలత, ముచ్చెర్ల అరుణ, నిర్మలమ్మ, నాగభూషణం ముఖ్య తారాగణం. తొలి సినిమా కనుక కమర్షియల్ అండాలతో ఉండాలని గుండమ్మ కథ సినిమాని రివర్స్ చేసి ఆ సినిమా కథను తయారుచేసాడు. 70 శాతం పూర్తయిన తరువాత సినిమా ఆగిపోయింది. కొత్త నిర్మాత, దర్శకుడు కావడంతో పంపిణీదారులు ఆ సినిమాను తీసుకోవడానికి ముందుకు రాలేనందన అతని వద్ద ఉన్న డబ్బంతా పెట్టి సినిమా ప్రారంభించాడు. డబ్బు అయిపోయిన తరువాత సినిమా ఆగిపోయింది. ఆ సమయంలో నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతని మామ విజయబాపినీడు, లక్ష్మీ ఫిలింస్ అధినేత లింగమూర్తిలు అతని సినిమాను చూసి కొత్తగా దర్శకత్వం వహిస్తున్నప్పుడు పవర్‌ఫుల్ సబ్జెక్టు ఉండాలని సూచించారు. అందువలన ఆ సినిమాను పక్కన పెట్టి కర్నాటకలో ఘన విజయం సాధించిన "మానససరోవర్" సినిమాని తెలుగులో తీయడానికి నిర్ణయించాడు. అది తెలుగుకో అమాయక చక్రవర్తి పేరుతో విడుదలైంది. అది విజయం సాధించింది.
హిందీ సినిమా "బసేరా" ను తెలుగులో తోడు నీడ పేరుతో రీమేక్ చేసాడు. అది ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు.
అతను కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి కావడంతో కుమార్తెకు స్టాలిన్ కుమార్తె పేరు అయిన స్వెట్లానా పేరును పెట్టాడు. అది సామాన్య జనానికి అర్థం కావడంతో అందరూ ఆమెను శ్వేత అని పిలిచేవారు. ఆమె పేరుతో "శ్వేత ఇంటర్నేషనల్ సంస్థ" ను ప్రారంభించాడు. ఈ బేనరుపై శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు చిత్రాలు తీసాడు. శ్రీమతి కావాలి లో మోహన్‌బాబు, రాధిక జంటగా నటించారు. ఆ చిత్రంలో అనుకున్న ఆర్టిస్టు సమయానికి రాకపోవడంతో ఓ సన్నివేశంలో రిటైర్డ్ మిలిటరీ అధికారి పాత్రలో తానే నటించాడు. అదే సినిమాలలో అతని తొలి వేషం.
పారిపోయిన ఖైదీలు సినిమాకు అతని చినమామ కొసరాజు రాజేంద్రబాబు నిర్మాత. సిల్క్ స్మిత కథా నాయకి. ఇర్వింగ్ వాలెస్ రాసిన "ఫ్యాన్ క్లబ్" నవల ఆధారంగా కథను తయారుచేసి శ్రీదేవిని కథానాయకిగా ఉండాలని కోరుకున్నాడు కానీ ఆమె డేట్స్ లభించకపోవడం వలన సిల్క్ స్మితను తీసుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం నిర్మాణానికి సిల్క్ స్మిత, చంద్రమోహన్ డబ్బు సహాయం చేసారు. ఈ సినిమాకి ఓవర్ పబ్లిసిటీ కావడం, ఆ స్థాయిలో విజయావకాశాలు దెబ్బతీసింది.
అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా ఇంటికి దీపం ఇల్లాలే చిత్రాన్ని ప్రారంభించాడు. సుజాత హీరోయిన్. రెండు పాటలు, కొన్ని సీన్లు చిత్రీకరించిన తరువాత ఆర్థిక కారణాల వల్ల చిత్రం ఆగిపోయింది.
అతని రెండవ కుమార్తె అభినయ. ఆమె పేరుతో "అభినయ ఆర్టిస్ట్స్ అకాడమీ" ని స్థాపించాడు. దానికి అతను అధ్యక్షుడు. ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి. వ్యాపార పరంగా ఆలోచించకుండా ఆ సంస్థను నడపడంతో తొందరలోనే అది మూసివేయబడింది.
నటునిగాసవరించు
అతను సాగర్ దర్శకత్వం వహించిన స్టూవర్టుపురం దొంగలు చిత్రంలో అతనికి వేషం లభించింది. వెంకటేష్ నటించిన సూర్య ఐ.పి.ఎస్ చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలను చూసి అతని మామ విజయబాపినీడు గ్యాంగ్ లీడర్ సినిమాలో పోలీసు పాత్రను ఇచ్చాడు. ఆ సినిమాలోని పాత్ర అతనికి గుర్తింపు తెచ్చింది. అక్కడ నుండి నటునిగా కొనసాగాడు. సినిమాలతో పాటు సీరియళ్లలో (అన్వేషిత) కూడా నటించాడు. [3]
మరణంసవరించు
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 63 సంవత్సరాల వల్లభనేని జనార్ధన్ హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే 2022 డిసెంబరు 29న తుది శ్వాస విడిచాడు.[4] ఆయనకు భార్య లళినీ చౌదరి, కూతురు అభినయ, కుమారుడు అవినాశ్ ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే మరణించింది.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "వల్లభనేని జనార్ధన్". maastars.com. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 25 January 2018.
- ↑ "Actor/Director Vallabhaneni Janardhan Exclusive Interview." ap7am.com. Archived from the original on 2020-06-30. Retrieved 2020-06-28.
- ↑ "క్యారెక్టర్ ఆర్టిస్ట్ ' వల్లభనేని జనార్ధన్'". TELUGUCINEMA CHARITRA (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-28.
- ↑ "Vallabhaneni Janardhan | సీనియర్ నటుడు వల్లభనేని జనార్దన్ మృతి". web.archive.org. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బాహ్య లంకెలుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వల్లభనేని జనార్ధన్ పేజీ
- "Actor Vallabhaneni Janardhan Rao Exclusive Interview | Real Talk with Anji | AP24x7 - Andhra/Telangana News తెలుగు వార్తలు - Video". www.aplatestnews.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-28.