టి.ఎం.త్యాగరాజన్

కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు, సంగీతజ్ఞుడు

టి.ఎం.త్యాగరాజన్ (తమిళం: டி. எம். தியாகராஜன்) (28 మే 1923 – 27 జూన్ 2007) తమిళనాడుకు చెందిన ఒక కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు, సంగీతజ్ఞుడు.

టి.ఎం.త్యాగరాజన్
జననం
తంజావూరు మహాలింగం త్యాగరాజన్

(1923-05-28)1923 మే 28
మరణం2007 జూన్ 27(2007-06-27) (వయసు 84)
వృత్తికర్ణాటక సంగీతవిద్వంసుడు
తల్లిదండ్రులుమహాలింగం పిళ్ళై, సీతాలక్ష్మి అమ్మాళ్

కుటుంబ నేపథ్యం

మార్చు

ఇతడు సంగీత నృత్య కళలలో ఆరితేరిన తంజావూరు కుటుంబం నుండి వచ్చాడు. ఇతని తాత, ముత్తాతలు బరోడా సంస్థానంలో ఆస్థాన విద్వాంసులు. ఇప్పటికీ ఇతని కుటుంబీకులు వదోదరలో తంజావూర్‌కర్ అనే ఇంటిపేరుతో వ్యవహారంలో ఉన్నారు.

ఇతని తండ్రి మహాలింగం పిళ్ళై మృదంగ విద్వాంసుడు.[1]

సంగీత శిక్షణ

మార్చు

ఇతడు తొలుత తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద శిష్యరికం చేశాడు.[1]

సంగీత ప్రదర్శనలు

మార్చు

ఇతడు తన మొట్టమొదటి ప్రదర్శన తిరువయ్యారులో తన 8యేళ్ళ వయసులో ఇచ్చాడు. ఆ కచేరీలో మృదంగ సహకారాన్ని అందించిన సీనియర్ కళాకారుడు పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్ళై ఇతని ప్రజ్ఞకు ఆనంద భరితుడై ప్రదర్శన అనంతరం ఇతడిని ఎత్తుకుని ఆశీర్వదించాడు.[1]

ఇతడు ఆకాశవాణిలో, వివిధ టెలివిజన్ ఛానళ్ళలో, వేదికల మీద అనేక సంగీత కచేరీలు చేశాడు. తొలి రోజులలో ఇతని కచేరీలలో ఇతని తండ్రి మహాలింగం పిళ్ళై కాని, సోదరుడు తంబుస్వామి కాని మృదంగ సహకారం అందించేవారు. మరొక సోదరుడు బాలసుబ్రమణియన్ వయోలిన్ వాద్య సహకారం అందించేవాడు.[1]

సంగీతజ్ఞుడిగా

మార్చు

త్యాగరాజన్ కేవలం గాయకుడే కాక, గీతరచయిత, స్వరకర్త, గురువు, చక్కని వ్యవహర్త.[2]

ఇతడు చెన్నైలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రధానాధ్యాపకునిగా పనిచేశాడు. 1981లో ఆ పదవి నుండి విరమణ పొందిన తర్వాత మద్రాసు సంగీత అకాడమీ నిర్వహిస్తున్న సంగీతాధ్యాపకుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాడు.[1]

ఇతడు చెంగల్వరాయ శాస్తి, రామస్వామి శివన్, అన్నయ్య, పెరియసామి తూరన్ వంటి అంతగా తెలియని వాగ్గేయకారుల అపురూప కృతులకు స్వరకల్పన చేశాడు. ఇంకా ఇతడు ఆండాళ్ తిరుప్పావై, మణైకవసాగర్ తిరువెంబావైలకు సంగీతాన్ని సమకూర్చి వాటి స్వరాలను ప్రచురించాడు.[2]

శిష్యులు

మార్చు

ఇతని శిష్యులలో పి.ఎస్.నారాయణస్వామి, రాజలక్ష్మీ శేఖర్, తిరుచ్చి సిస్టర్స్, మంగళం శంకర్, ఎస్.ప్రేమ, ఎస్.జయ, ఒ.ఎస్.త్యాగరాజన్, శ్రీధర్ నీలకంఠన్, గౌరీ గోకుల్, లక్ష్మీ రంగరాజన్, కుళిక్కరై విశ్వలింగం, ఎస్.సీతారామన్, ఇ.గాయత్రి, ఎం.నర్మద, రాజి గోపాలకృష్ణన్, నిర్మల సుందరరాజన్, సుభాషిణి పార్థసారథి మొదలైనవారు ఉన్నారు.[2]

పురస్కారాలు, సన్మానాలు

మార్చు

ఇతడు 2007, జూన్ 27న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 T. M. Thiagarajan
  2. 2.0 2.1 2.2 Sulochana Pattabhiraman (30 May 2003). "Many strings to his artistic bow". The Hindu. Archived from the original on 14 మార్చి 2014. Retrieved 14 March 2014.
  3. "Recipients of Sangita Kalanidhi". The Music Academy. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 17 ఫిబ్రవరి 2021.
  4. SNA Awardees Archived 2015-05-30 at the Wayback Machine
  5. Sangeetha Choodamani Awardees Gallery Archived 2012-08-16 at the Wayback Machine