టి.ఎన్.స్వామినాథ పిళ్ళై
టి.ఎన్.స్వామినాథ పిళ్ళై (1899-1961) ఒక కర్ణాటక సంగీత వాద్య విద్వాంసుడు.
టి.ఎన్.స్వామినాథ పిళ్ళై | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | తిరుప్పంపరం నటరాజసుందరం స్వామినాథపిళ్ళై |
జననం | తిరుప్పంపరం,తంజావూరు, తమిళనాడు, భారతదేశం | 1931 మే 30
మరణం | 1961 ఫిబ్రవరి 8 | (వయసు 61)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వాయిద్యాలు | వేణువు |
విశేషాలు
మార్చుఇతడు 1899 సెప్టెంబరు 12న తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరుప్పంపరం గ్రామంలో సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు[1]. ఇతడు చిన్నతనం నుండే వేణుగానం పట్ల ఆసక్తి కనబరచి తన తండ్రి టి.ఎస్.నటరాజసుందరం పిళ్ళై శిక్షణలో వేణుగానంలో ప్రావీణ్యం సంపాదించాడు. రాగభావం, లయభావం సమపాళ్ళలో సరితూగే విధంగా ఇతని గానం మధురంగా, ఉత్తమంగా ఉండేది. ఇతడు వేణువులో పలికించే కృతులు నిక్కమైన శాస్త్రీయ సంప్రదాయాన్ని కలిగి ఉంటాయి.ఇతడు 1942 నుండి1947 వరకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, తరువాత సంగీత విభాగానికి అధిపతిగా ఉన్నాడు.[2] 1949 నుండి 1961 వరకు మద్రాసులోని కేంద్ర కర్ణాటక సంగీత కళాశాలలో పనిచేశాడు. ఇతడు కర్ణాటక సంగీతంపై ఐదు గ్రంథాలు రచించాడు. సంగీతరంగంలో ఇతడు చేసిన కృషికి మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారంతో సత్కరించింది. ఇతని మరణానంతరం కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక సంగీతం - వాద్య విభాగంలో అవార్డును ప్రకటించింది. ఇతని శిష్యులలో ఎస్.ఆర్.జానకిరామన్, టి.విశ్వనాథన్, ఎస్.నరసింహులు మొదలైనవారున్నారు.
ఇతడు 1961, ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ web master. "T. N. Swaminatha Pillai". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 3 March 2021.[permanent dead link]
- ↑ Sriram Venkatakrishnan (24 February 2011). "Encore: Brilliant flautist, teacher and composer". The Hindu. Retrieved 3 March 2021.