టి.ఎస్.కృష్ణమూర్తి

తరువాయి సుబయ్య కృష్ణమూర్తి (జననం 1941) భారతదేశ 13వ ప్రధాన ఎన్నికల కమిషనరు(2004 ఫిబ్రవరి - 2005 మే) గా పనిచేసిన మాజీ భారతీయ రెవెన్యూ సర్వీస్ అధికారి. [1] సిఇసి గా 2004 లోక్‌సభ ఎన్నికలను పర్యవేక్షించాడు. అతను అంతకుముందు 2000 జనవరి నుండి భారత ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా పనిచేశాడు.[2][3]

టి.ఎస్.కృష్ణమూర్తి
13 వ భారత ప్రహ్దాన ఎన్నికల కమిషనరు
In office
2004 ఫిబ్రవరి – 2005 మే
అధ్యక్షుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
మన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుజె.ఎం.లింగ్డో
తరువాత వారుబి.బి.టాండన్
వ్యక్తిగత వివరాలు
జాతీయతభారతీయుడు
వృత్తిప్రభుత్వ అధికారి

కెరీర్ మార్చు

కృష్ణమూర్తి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. కంపెనీ వ్యవహారాల శాఖ కార్యదర్శితో సహా వివిధ స్థాయిల్లో ప్రభుత్వానికి సేవలందించాడు. అతను భారత ప్రభుత్వ కార్యదర్శి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా చేసిన మొదటి భారతీయ రెవెన్యూ సర్వీస్ అధికారి.

కంపెనీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా, కంపెనీల క్లెయిమ్ చేయని డివిడెండ్‌ల నుండి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన ఘనత ఆయనది.

కృష్ణమూర్తి 19 సంవత్సరాల వయస్సులో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (జాతీయీకరణకు ముందు) ప్రొబేషనరీ అధికారిగా తన వృత్తిని ప్రారంభించాడు. అతను 1963 బ్యాచ్‌లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో చేరాడు. ఆ తర్వాత మద్రాసులో ఆదాయపు పన్ను అధికారిగా నియమితుడయ్యాడు. షిప్పింగ్, ఫైనాన్స్‌తో సహా న్యూఢిల్లీలోని అనేక మంత్రిత్వ శాఖలకు సేవలందించిన అతను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పన్మిచేసాడు. బాంబేలో ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమీషనరు పదవి అతను నిర్వహించిన కీలక ఉద్యోగాలలో ఒకటి.

అతను ఇథియోపియా, జార్జియాలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సలహాదారుగా కూడా పనిచేశాడు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్‌గా జింబాబ్వేలో జరిగిన ఎన్నికలకు, 2004లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆయన పరిశీలకుడిగా ఉన్నాడు. 2005లో, భారత క్రికెట్ నియంత్రణ మండలిలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి భారత సుప్రీంకోర్టు కృష్ణమూర్తిని నియమించింది.

ప్రారంభ జీవితం మార్చు

కృష్ణమూర్తి స్వస్థలం తిరునల్వేలి జిల్లా తరువాయి. అతను తిరుచిరాపల్లిలో పుట్టి పెరిగాడు. బరోడాలో ఉన్నత పాఠశాల విద్య చదివాడు. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుకున్నాడు. కృష్ణమూర్తి మైసూర్ విశ్వవిద్యాలయంలో చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. అతను UK లోని యూనివర్శిటీ ఆఫ్ బాత్ నుండి ఫిస్కల్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు.

పదవీ విరమణ తర్వాత, అతను వివిధ కంపెనీలు, NGOల బోర్డులలో సభ్యుడుగా ఉన్నాడు. చెన్నై లోని భారతీయ విద్యాభవన్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. అతను 2008లో ప్రచురించబడిన మిరాకిల్స్ ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత.

కృష్ణమూర్తి చెన్నైకి చెందిన వీణ కళాకారిణి గీతా కృష్ణమూర్తిని పెళ్ళి చేసుకున్నాడు.

మూలాలు మార్చు

  1. "Previous Chief Election Commissioners". Election Commission of India. Archived from the original on 21 November 2008.
  2. "I see no end to EVM bashing: Ex-CEC T S Krishnamurthy - The Economic Times". The Economic Times.
  3. "Former CEC calls for setting up of national election fund - The Hindu". The Hindu. 26 March 2021.