టి.భాస్కరరావు, భారతీయ సివిల్ సర్వీసెన్ (ఐ.సి.ఎస్) అధికారి, రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త.

భాస్కరరావు, 1896 మే 10న మద్రాసులో జన్మించాడు. ఈయన తండ్రి టి.కృష్ణస్వామి నాయుడు. ఈయన విద్యాభ్యాసం ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సెయింట్ కాథరిన్స్ కళాశాల్లో సాగింది. ఈయన 1927, మార్చి 7న సతీమణి నర్సమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు.

భాస్కరరావు 1921లో భారతీయ సివిల్ సర్వీసెన్‌లో చేరాడు. 1923 నుండి 1929 వరకు తిరునల్వేలీ, షెర్మాదేవి, శ్రీకాకుళం, పెనుగొండలలో సబ్ కలెక్టరుగా పనిచేశాడు. 1930 నుండి 1944 వరకు ఉత్తర అర్కాట్, కర్నూలు, కడప, చిత్తూరు, మద్రాసులలో కలెక్టరుగా పనిచేశాడు. ఆ తర్వాత 1945-46లలో నేషనల్ సర్వీస్ లేబర్ ట్రిబ్యునల్ చైర్మన్ గానూ, మద్రాసు పునరావసం, ఉపాధికల్పన విభాగంలో ప్రాంతీయ డైరెక్టరుగానూ పనిచేశాడు. 1946 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసి వ్యాపార రంగంలో ప్రవేశించాడు. దిగుమతుల సలహా సంఘానికి భారత ప్రభుత్వంచే సభ్యుడిగా నియమించబడ్డాడు. ఆంధ్రా చేంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడికూడా ఉన్నాడు.

1952లో మద్రాసు రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] 1952 ఏప్రిల్ 3 నుండి 1960, ఏప్రిల్ 2 వరకు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు. ఈయన 1975, జూలై 21న మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. Who_is_who_1952_rajya_sabha. Rajya Sabha. pp. 149–150. Retrieved 3 September 2024.
  2. Rajyasabha Member Biographical Book (PDF). p. 401. Retrieved 3 September 2024.