డా. టి. కల్పనాదేవి 8వ లోక్‌సభ సభ్యురాలు. ఈమె వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున 1984లో 8వ లోకసభకు ఎన్నికయ్యారు. ఈమె చలసాని వీర రాఘవయ్య కుమార్తె. ఈమె కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు గ్రామంలో జూలై 13, 1941 తేదీన జన్మించింది. ఈమె వరంగల్లు లోని కాకతీయ వైద్య కళాశాల నుండి వైద్యవిద్యలో పట్టా పొందారు. ఈమె డా. టి. నరసింహ రెడ్డిని జూలై 10, 1961 తేదీన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.

టి. కల్పనాదేవి
టి. కల్పనాదేవి


లోకసభ సభ్యురాలు
పదవీ కాలం
1984 - 1989
నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1941-07-13) 1941 జూలై 13 (వయసు 82)
భట్లపెనుమర్రు, కృష్ణా జిల్లా, India
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి డా. టి. నరసింహ రెడ్డి
సంతానం 2 కుమారులు

మూలాలు సవరించు

వెలుపలి లంకెలు సవరించు