టి. కృష్ణన్ ఉన్ని

కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్

టి. కృష్ణన్ ఉన్ని కేరళ రాష్ట్రానికి చెందిన సినిమా సౌండ్ డిజైనర్.[1] ఇతడు అనేక జాతీయ చలనచిత్ర అవార్డులు, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. అదూర్ గోపాలకృష్ణన్, జి. అరవిందన్, షాజీ ఎన్. కరుణ్‌లతోసహా కేరళకు చెందిన అందరు ప్రముఖ సినీ దర్శకుల సినిమాలకు పనిచేశాడు.

టి. కృష్ణన్ ఉన్ని
జననం (1960-06-12) 1960 జూన్ 12 (వయసు 64)
ఒట్టపాలెం, కేరళ
వృత్తిసినిమా సౌండ్ డిజైనర్

కృష్ణన్ ఉన్ని 1960, జూన్ 12న కేరళ రాష్ట్రంలోని ఒట్టపాలెంలో జన్మించాడు. కేరళ విశ్వవిద్యాలయం పరిధిలోని దేవగిరిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల (కోజికోడ్) నుండి భౌతికశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.

సినిమారంగం

మార్చు

సౌండ్ రికార్డింగ్ & సౌండ్ ఇంజినీరింగ్ కోర్సు కోసం పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరి, 1976లో ఉత్తీర్ణులయ్యాడు. 1977లో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో వారి ఖేడ్డా కమ్యూనికేషన్స్ ప్రాజెక్ట్‌లో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరాడు. 1980లో అహ్మదాబాద్‌ నుండి వచ్చేసి, త్రివేండ్రంలోని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని చిత్రాంజలి స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరాడు.

చిత్రాంజలి స్టూడియోలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేసి, 2008 జూన్ లో చీఫ్ సౌండ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం సౌండ్ డిజైనింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో ఫ్రీలాన్సింగ్ శిక్షకుడిగా ఉన్నాడు. చిత్రాంజలి స్టూడియోలో ఉన్న సమయంలో శ్రీ అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన అనంతరం, శ్రీ షాజీ ఎన్.కరుణ్ దర్శకత్వం వహించిన పిరవి, శ్రీ జయరాజ్ దర్శకత్వం వహించిన దేశదానం సినిమాలకు ఆడియోగ్రఫీకి మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నాడు.[2] కేరళ ప్రభుత్వం నుండి ఆడియోగ్రఫీకి తొమ్మిది అవార్డులు కూడా అందుకున్నారు. 2005లో కేరళ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కోసం కేకేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించిన వైద్యరత్నం పిఎస్ వారియర్ జీవిత చరిత్ర డాక్యుమెంటరీకి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్రపతి అవార్డును అందుకున్నాడు. షాజీ ఎన్ కరుణ్ తీసిన "కుట్టిస్రాంక్", టివి చంద్రన్ తీసిన "భూమియుతే అవకాశాలు" వంటి చిత్రాలకు సౌండ్ డిజైన్ చేసాడు. ఇటీవలే షాజి ఎన్ కరుణ్ దర్శకత్వం వహించిన "స్వపనం", సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వం వహించిన "ఓరల్‌పొక్కం" చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేశారు.[3]

దర్శకుడిగా

మార్చు

కేరళ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖకు అనేక డాక్యుమెంటరీలు, కేరళ ప్రభుత్వం పురావస్తు శాఖ కోసం ఒక డాక్యుమెంటరీ, కొట్టక్కల్ ఆర్య వైద్య సాలా, కొట్టక్కల్, మలాపురం కోసం అనేక డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించాడు.

రచయితగా

మార్చు

2010 డిసెంబరులో "సౌండ్ ఇన్ మూవింగ్ పిక్చర్స్" (కేరళలోని కోజికోడ్‌లోని మాతృభూమి పబ్లికేషన్స్) అనే పుస్తకాన్ని రచించాడు.[4]

అవార్డులు, ప్రశంసలు

మార్చు

ఉత్తమ ఆడియోగ్రఫీలకు జాతీయ చలనచిత్ర అవార్డు :

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు :

  • 1987 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం - పురుషరామ్ 
  • 1989 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
  • 1994 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - స్వామ్
  • 1995 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం - కజకం, ఓర్మకలుండయిరిక్కనం
  • 1996 - కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సౌండ్ రికార్డిస్ట్ - దేశదానం
  • 1997 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - జన్మదినం
  • 1998 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం - అగ్నిసాక్షి
  • 2007 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం - ఒట్టక్కయ్యన్
  • 2008 - ఉత్తమ సౌండ్ రికార్డిస్ట్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - ఒరు పెన్నుమ్ రాందానుమ్

మూలాలు

మార్చు
  1. "The art and craft of sound in cinema". The Hindu. 22 March 2011.
  2. "Look back in anger". India Today. 15 May 1989.
  3. "ന്യൂ ജനറേഷന്‍ ശബ്ദം". Deshabhimani. 15 May 1989.
  4. "Chalachitrathile Sabdam". Indulekha.com.

బయటి లింకులు

మార్చు