టి. గోవిందన్ (11 జనవరి 1940 - 23 అక్టోబర్ 2011) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

టి. గోవిందన్

నియోజకవర్గం కాసరగోడ్
పదవీ కాలం
1996 – 2004
ముందు రామన్న రాయ్
తరువాత పి. కరుణాకరన్

వ్యక్తిగత వివరాలు

జననం (1940-01-11)1940 జనవరి 11
పయ్యనూర్ , మద్రాసు ప్రెసిడెన్సీ
(ప్రస్తుత పయ్యనూర్, కన్నూర్ , కేరళ )
మరణం 23 అక్టోబర్ 2011 (వయస్సు 71)
రాజకీయ పార్టీ సీపీఐ(ఎం)
జీవిత భాగస్వామి సావిత్రి
సంతానం 3
మూలం భారత పార్లమెంటు

జననం, విద్యాభాస్యం

మార్చు

టి. గోవిందన్ 1940 జనవరి 1న పయ్యన్నూరులో పూరకాలి మాస్టారు రామన్ పణిక్కర్, చెమ్మరాతి దంపతులకు జన్మించాడు. ఆయన స్థానిక-స్వయం ప్రభుత్వంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు

రాజకీయ జీవితం

మార్చు

టి. గోవిందన్ 1963లో సీపీఐ(ఎం) ద్వారా రాజకియలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఐ. రామా రాయ్ పై 74,730 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 1996 నుండి 1997 వరకు పట్టణ & గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడిగా, సభా సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

టి. గోవిందన్ 1998లో కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఖాదర్ మాంగడ్ పై 48,240 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ లోక్‌సభలో విప్‌‌గా, సభా సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యుడిగా, కమ్యూనికేషన్స్ కమిటీ & దాని సబ్-కమిటీ “C”—మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కమిటీ సభ్యుడిగా, పట్టణ వ్యవహారాలు & ఉపాధి మంత్రిత్వ శాఖ, సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

కరుణాకరన్ 1999లో కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఖాదర్ మాంగడ్ పై 31,578 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో కమ్యూనికేషన్స్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2]

టి. గోవిందన్ అనారోగ్యంతో మంగళూరులోని యెనపోయ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ గుండెపోటుతో 23 అక్టోబర్ 2011న మరణించాడు. ఆయనకు భార్య సావిత్రి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. The Hindu (23 October 2011). "T. Govindan, CPI(M) leader and ex-MP, passes away" (in Indian English). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  2. The New Indian Express (16 May 2012). "Former MP T Govindan passes away" (in ఇంగ్లీష్). Retrieved 30 July 2024.