టి. మీనాకుమారి ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.[1]

ఈమె 1951 ఆగస్టు 3 తేదీన జన్మించింది. వీరి తల్లిదండ్రులు జానపరెడ్డి రామకృష్ణ నాయుడు మరియు రాజమణి. ఈమె స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి. ఈమె భర్త తూమ్ భీమ్‌సేన్, తండ్రి రామకృష్ణ నాయుడు కూడా న్యాయవాదులే. మీనాకుమారి సుప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనుమరాలు [2] బి.యస్.సి. పూర్తిచేసిన తర్వాత ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించి 1976 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, హైకోర్టు జడ్జి అయిన పి.శివశంకర్ వద్ద జూనియర్ లాయరుగా పనిచేశారు.[3] 1981 నుంచి 1984 వరకు అసిస్టెంట్‌ ప్రభుత్వ ప్లీడరుగా, 1988-89 మధ్యకాలంలో ఆదాయపన్నుల శాఖ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 1990లో హైకోర్టు ప్రభుత్వ ప్లీడరుగా మీనాకుమారి నియమితులయ్యారు. 1994 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. విద్య, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ, విద్యుత్‌ వంటి విభాగాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.


ఈమె 1990 నుండి 1994 వరకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహించారు. 1998 ఫిబ్రవరి 23 తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మద్రాసు హైకోర్టుకు బదిలీపై వెళ్ళారు. 1999లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతిని పొందారు. 2001 సెప్టెంబరు 5 తేదీన ఆంధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. స్వల్పకాలం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అనంతరం పాట్నా హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు.

మీనాకుమారి 2013 మార్చి 23న కొత్తగా ఏర్పాటు చేయబడిన మేఘాలయా రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు.

మూలాలుసవరించు

  1. మేఘాలయ చీఫ్ జస్టిస్ గా మీనాకుమారి ప్రమాణం, ఈనాడు వ్యాసం, 24 మార్చి, 2013
  2. Hon'ble Ms. Justice T. Meena Kumari
  3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-01-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-04-29. Cite web requires |website= (help)