టి. రాఘవాచారి (1916 - 1996) ప్రముఖ రంగస్థల నటుడు, హార్మోనిస్టు.[1]

టి. రాఘవాచారి
జననం1916
మరణం1996
జాతీయతభారతీయుడు
వృత్తి రంగస్థల నటుడు, హార్మోనిస్టు.

రాఘవాచారి 1916 లో రాజమండ్రి జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

పౌరాణిక నాటకాల్లోని అనేక పాత్రలను పోషించాడు. తన సుదీర్ఘ నటజీవితంలో బండారు రామారావు, చెంచు రామారావు, సి.హెచ్. జగన్నాథరావు, షణ్ముఖి ఆంజనేయ రాజు, ఎ.వి.సుబ్బారావు, డి.వి.సుబ్బారావు, రేబాల రమణ, అబ్బూరి రామకృష్ణారావు వంటి వారి పక్కన విభిన్నపాత్రలు ధరించాడు. సి.హెచ్. జగన్నాథరావు, ఎన్.వి. సుబ్బారావు, చాపల సూర్యనారాయణ వంటి నటులకు శిక్షణ ఇచ్చాడు. బండారు రామారావు, చెంచు రామారావుల సమాజాలతోపాటు ఇతర సమాజాలకు కూడా హార్మోనిస్టుగా పనిచేసాడు.

నటించిన పాత్రలు:

  1. భీముడు
  2. హైదర్జంగ్
  3. విశ్వామిత్రుడు
  4. ధర్మరాజు

ఆరు దశాబ్దాలకుపైగా రంగస్థలానికి సేవలందించిన రాఘవాచారి 1996లో 80వ ఏట రాజమండ్రి లో మరణించాడు

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.497.