షణ్ముఖి ఆంజనేయ రాజు

షణ్ముఖి ఆంజనేయ రాజు ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త.[1]

షణ్ముఖి ఆంజనేయ రాజు
Shanmukha Anjaneyaraju.JPG
షణ్ముఖి ఆంజనేయ రాజు
జననం1932
అనపర్తి, రామచంద్రపురం తాలూకా, తూర్పు గోదావరి జిల్లా
ఇతర పేర్లుషణ్ముఖి ఆంజనేయ రాజు
ప్రసిద్ధిరంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త సంగీత జ్ఞాని

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

వీరు 1932లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి గ్రామంలో జన్మించారు.

నాటక రంగంసవరించు

సంగీతం నేర్చుకున్న తర్వాత వీరు 1946లో నాటకరంగంలో ప్రవేశించి మహాశివభట్ట వెంకటరాజు గారి పర్యవేక్షణలో నటుడుగా తీర్చిదిద్దబడ్డారు.

నటునిగాసవరించు

పాండవోద్యోగం, గయోపాఖ్యానం, సతీ సక్కుబాయి నాటకాలలో శ్రీకృష్ణ పాత్రను, రామాంజనేయ యుద్ధం, పాదుకా పట్టాభిషేకంలో రాముని పాత్రను, తులాభారం, కృష్ణలీల, మైరావణలో నారద పాత్రను, హరిశ్చంద్రలో హరిశ్చంద్ర, నక్షత్రక పాత్రలను, రామదాసులో కబీరు, చింతామణిలో బిల్వమంగళుడు, భవానీశంకరుడు పాత్రలను, బొబ్బిలిలో విజయరామరాజు పాత్రను, తెలుగుతల్లిలో నాగేశ్వరరావు మొదలైన పాత్రల్లో నటించి ప్రాచుర్యం పొందారు. ప్రధానంగా పద్యనాటకాల్లో ఆయన పద్యగానం, అభినయం విపరీతమైన ప్రజాభిమానాన్ని సంతరించిపెట్టింది.
షణ్ముఖి ఆంజనేయరాజు తన నటన కెరీర్లో వైభవం అనదగ్గ స్థాయిని చవిచూశారు. ఇప్పటి సినీనటుల్లా ఓ మెటాడోర్ వ్యాన్, దానిలో పరుపులు, అసిస్టెంట్లు వగైరా ఉండేవి. ఒకరోజు రాత్రి ఒక ఊళ్ళో ఒకటో కృష్ణుడిగా నటించి మరో ఊళ్ళో రెండో కృష్ణునిగా నటించేవారు.
షణ్ముఖి ఆంజనేయరాజుకు పేరు తెచ్చిపెట్టిన పాత్రల్లో రామాంజనేయ యుద్ధం నాటకంలో రాముని పాత్ర కూడా ఒకటి. మరీ ముఖ్యంగా, రాముడి పాత్రలో షణ్ముఖి, హనుమంతుని పాత్రలో సంపత్‌నగర్ లక్ష్మణరావుల కాంబినేషన్ చాలా ప్రాచుర్యం పొందింది. వ్యక్తిగత స్పర్థ కొంతవరకూ ఉన్న వీరిద్దరూ నాటకంలో ఒకరినొకరు ఎత్తిపొడుచుకునే పద్యాలు పాడుతూండడం ఈ జోడీకి మరీ లాభించింది.[2][3]

దర్శకునిగాసవరించు

వీరు 1948లో బాలా త్రిపురసుందరీ నాట్యమండలిని స్థాపించి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. వీరు నాటక దర్శకుడిగా నందనార్, రేవతి, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, సుభద్రార్జున, శ్రీకృష్ణాభిమన్య యుద్ధం మొదలైన నాటకాలకు ప్రాణం పోసి అనేక మంది నటీనటులకు శిక్షణ ఇచ్చారు. వీరు హార్మోనియం, వాయులీనంలలో ప్రవీణులు.

సన్మానాలుసవరించు

  • ఏలూరు తెలుగు దర్భారులో కూరెళ్ల లక్ష్మణ్రావుగారి ప్రోత్సాహంతో కనకాభిషేకం.
  • ఆంధ్ర విశ్వకళాపరిషత్ నందు ఘనమైన సన్మానం 1990 సం. లో

మూలాలుసవరించు

  • నటకులమ్, ఆగస్టు 2016, పుట నెం. 6
  1. "Andhra Natakam Artists". Archived from the original on 2009-10-26. Retrieved 2009-09-21.
  2. పెద్ది, రామారావు (డిసెంబరు 2015). "రామబంటు లక్ష్మణుడు". యవనిక (1 ed.). హైదరాబాద్: ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ. pp. 30–33. ISBN 978-93-5104-551-9.
  3. పెద్ది రామారావు బ్లాగ్. "రామబంటు లక్ష్మణుడు". ramaraopeddi.blogspot.in. Archived from the original on 17 మార్చి 2018. Retrieved 5 April 2017.