టి సాట్

తెలంగాణ ప్రభుత్వ విభాగం

టి సాట్ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సాంకేతికత పరిజ్ఞానంతో, నాణ్యమైన ప్రమాణాలతో వారికవసరమైన సమాచారాన్ని లక్ష్యంతో ఈ టి సాట్ ను ప్రారంభించడం జరిగింది.[1]

టి సాట్
సంస్థ వివరాలు
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం హైదరాబాద్, తెలంగాణ
సంబంధిత మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ ఐటి శాఖ
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

ప్రారంభం మార్చు

మన టీవీ స్థానంలో టీ శాట్‌ పేరుతో కొత్త నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 2017 జూలై 26న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. విద్య, నిపుణ పేరుతో రెండు ఛానళ్ళను, టీ-శాట్‌ లోగోను, యాప్‌ను ఆవిష్కరించాడు.[2]

లక్ష్యాలు[3] మార్చు

 • తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాంకేతిక, ఉపగ్రహ సమాచార ఉపయోగించి, వారికి తగిన విజ్ఞానాన్ని అందించి విద్యావంతులను చేయడం
 • ప్రతి తరగతి ఉత్తమ అధ్యాపకులను ఎంచుకొని వారి ద్వారా మానసిక స్థైర్యం, సులభ పద్ధతులు, సమకాలీన ప్రపంచ పోకడల గురించి చెప్పడం
 • విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వాలు అందించి వృత్తిలో ఎదిగేలా చేయడం
 • పోటీ పరీక్షలలో, వృత్తి శిక్షణలో, నైపుణ్య అభివృద్ధి శిక్షణలో, ఉపాధి అవకాశాల గురించి చెప్పడం
 • ప్రభుత్వ శాఖలు సిబ్బందికి వారివారి పనులలో శిక్షణ ఇచ్చి, ఆ పనులలో పరిపూర్ణతను తేవడం
 • అవినీతి, పనుల నిర్వాహణలో జాప్య విముక్తికై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయడం
 • ఆరోగ్య, పరిశుభ్రత, వస్త్రాల గురించి తెలంగాణ ప్రజలకు బోధించి ఆరోగ్య పరిరక్షణను మెరుగు పరచడం
 • శాంతి భద్రతల, నేరాల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత తెలంగాణ నిర్మించడం
 • పాఠశాల, కళాశాల, సాంకేతిక, వృత్తి నైపుణ్య విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలు ప్రసారం చేయడం

ఇతర కార్యక్రమాలు మార్చు

 • టి సాట్ ద్వారా గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ప్రసారం[4][5]
 • మనటీవీలో ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ శిక్షణ[6]
 • గ్రూప్-1 ఉద్యోగార్థుల కోసం ఇప్పటికే తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో టి సాట్ ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి, సుమారు 60 గంటల నిడివిగ‌ల క్లాసుల‌ను ప్రసారం చేసింది. దాంతోపాటు ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమంలో పాఠ్యాంశ నిపుణులు లైవ్ లో పాల్గొని అవగాహన కల్పించారు. ఎకనామి, జాగ్రఫి, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలపై నిపుణులచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.[7]
 • ఆరవ వార్షికోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలను ప్రసారం చేసేందుకు 2023 జూలై 28న రాష్ట్రంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం (మీడియా ప్రొడక్షన్ సెంటర్, ఎస్.డి.ఎల్.సి.ఇ)లతో టిసాట్ ఒప్పందం చేసుకుంది. ఈ పాఠ్యాంశ వీడియోలు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు విద్య, నిపుణలో ప్రసారం చేయబడుతాయి. 2023-24 విద్యా సంవత్సరం నుండి కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని 473 అనుబంధ కళాశాలకు చెందిన సుమారు 1,00,835 అండర్ గ్రాడ్యుయేట్, 16,190 పి.జి కోర్స్ విద్యార్థులకు... ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 720 అనుంబంధ కళాశాలకు చెందిన సుమారు 4,00,000 మంది స్వదేశీ, విదేశీ విద్యార్థులకు పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయని టిసాట్ ప్రతినిధులు తెలిపారు.

మూలాలు మార్చు

 1. సాఫ్ట్‌నెట్ (మనటీవీ). "ABOUT US". softnet.telangana.gov.in. Archived from the original on 1 ఏప్రిల్ 2017. Retrieved 26 March 2017.
 2. telugu, NT News (2022-10-11). "సమర్థపాలన... సంక్షేమ పథకాలు". Namasthe Telangana. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-14.
 3. సాఫ్ట్‌నెట్ (మనటీవీ). "Vision". softnet.telangana.gov.in. Archived from the original on 30 మార్చి 2017. Retrieved 26 March 2017.
 4. సాక్షి. "6 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు". Retrieved 26 March 2017.
 5. కెసిఆర్ అభిమాన సంఘం. "గ్రామీణ నిరుద్యోగులకు 'మనటీవీ' శిక్షణ". /kcrabhimanasangham.com. Retrieved 26 March 2017.[permanent dead link]
 6. kabconsultants. "మనటీవీలో ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ శిక్షణ". kabconsultants.com. Retrieved 26 March 2017.
 7. telugu, NT News (2022-06-30). "టీ శాట్‌.. ఇంగ్లీష్ మీడియంలోనూ గ్రూప్-1 క్లాసులు". Namasthe Telangana. Archived from the original on 2022-06-30. Retrieved 2022-06-30.
"https://te.wikipedia.org/w/index.php?title=టి_సాట్&oldid=3942414" నుండి వెలికితీశారు