టీ వాలెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా డిజిటల్ చెల్లింపులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అధికారిక డిజిటల్ వాలెట్. వివిధ సంస్థల సేవలను పొందడానికి ప్రభుత్వ, ప్రైవేట్ లావాదేవీల చెల్లింపులు చేయడానికి రాష్ట్ర ప్రజలు ఈ టీ వాలెట్‌ను ఉపయోగించవచ్చు.[1] ఆంగ్లంతోపాటు తెలుగు, ఉర్దూ భాషలలో కూడా ఇది అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ వెబ్ బ్రౌజర్, స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్, మీ సేవా కేంద్రాలలో టీ వాలెట్ ఖాతాను ఓపన్ చేయవచ్చు. భారతదేశంలో డిజిటల్ వాలెట్ ను రూపొందించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.[2]

టీ వాలెట్
టీ వాలెట్ ను ప్రారంభిస్తున్న కేటీఆర్
ప్రాంతంతెలంగాణ
దేశంభారతదేశం
మంత్రిత్వ శాఖతెలంగాణ ఐటిశాఖ
ప్రధాన వ్యక్తులుకల్వకుంట్ల తారక రామారావు, ఐటిశాఖ మంత్రి
జయేష్ రంజన్, ఐటిశాఖ కార్యదర్శి
ప్రారంభం1 జూన్, 2017

ప్రారంభం మార్చు

2017, జూన్ 1న తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు టీ వాలెట్ ను ప్రారంభించాడు.[3] 2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో టీ వాలెటన్ రూపొందించామని కెటీఆర్ పేర్కొన్నాడు.[4] ఈ కార్యక్రమంలో ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదిరులు పాల్గొన్నారు.

ఉద్దేశ్యం మార్చు

 1. ప్రభుత్వ, ప్రైవేట్ లావాదేవీల చెల్లింపులు
 2. స్త్రీనిధి రుణాలు, ప్రభుత్వం ఆసరా పెన్షన్ల చెల్లింపులు
 3. టీ వాలెట్ ఖాతా నుండి ఏదైనా బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ
 4. వాలెట్ నుండి వాలెట్ బదిలీ

ఇతర వివరాలు మార్చు

 1. విద్యుత్, గ్యాస్, నీరు, డిటిహెచ్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి టీ వాలెట్ ఉపయోగించవచ్చు
 2. దీనిని ఉపయోగించడానికి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేదు
 3. ఫీచర్ వినియోగదారుల ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు రెండు కారకాల ప్రమాణీకరణను (ఓటిపి) టీ వాలెట్ ఉపయోగిస్తుంది
 4. షాపింగ్ చేసేటప్పుడు సురక్షితమైన లావాదేవీలకోసం ఉపయోగించే రూపే కార్డ్ సదుపాయాన్ని టీ వాలెట్ కు చేర్చడం జరిగింది. దీంతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు.[5]

స్కాలర్‌షిప్‌ల బదిలీ మార్చు

రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీ వాలెట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ బదిలీ చేయబడుతోంది. విద్యార్థులు బ్యాంక్ ఖాతా ద్వారా కాకుండా నేరుగా వాలెట్‌ని ఉపయోగించి తెలంగాణలోని వివిధ మీసేవా కేంద్రాల నుండి డబ్బు డ్రా చేసుకునేందుకు వీలుగా నగదు విత్‌డ్రాలను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ సాంకేతికతను మరో నాలుగు జిల్లాల్లో కూడా పరీక్షిస్తారు, దీనికి ముందు RBI ఆమోదం పొందిన తర్వాత అన్ని ఇతర జిల్లాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. స్కాలర్‌షిప్‌ బదిలీలలో 2019 సెప్టెంబరు నాటికి సుమారు 30,000 నగదు లావాదేవీలలో దాదాపు ₹ 25 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి, టీ వాలెట్ ప్రారంభించిన 26 నెలల్లోనే ₹ 3,000 కోట్ల మార్కును దాటింది.[6]

మూలాలు మార్చు

 1. Telugu360, Telangana (4 June 2017). "Initial Review: T-wallet looks great but pay to use it". Naveena. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. "Telangana Launches Official E-Wallet for Digital Payments". NDTV Gadgets 360 (in ఇంగ్లీష్). Retrieved 2021-08-01.
 3. Telugu360, Telangana (1 June 2017). "Telangana's digital wallet launched by KTR". Naveena. Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Bureau, Our. "Telangana launches T-Wallet for people with and without mobile phones". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2021-08-01.
 5. Baski, Sunny. "T-Wallet to incorporate RuPay card for safe and secure e-transactions". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-01.
 6. Geetanath, V. (2019-09-15). "T-Wallet for scholarship cash withdrawals". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-01.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=టీ_వాలెట్&oldid=3843150" నుండి వెలికితీశారు