బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు, రాజకీయ నాయకుడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 16వ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి గెలుపొందాడు.[1] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడుగా గెలుపొందాడు.[2] ఈ గెలుపు అనంతరం తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.

బాల్క సుమన్
బాల్క సుమన్

సుమన్ (2018)


తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
డిసెంబరు 2018– డిసెంబరు 2023
ముందు నల్లాల ఓదేలు
నియోజకవర్గం చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

పార్లమెంట్ సభ్యుడు
పదవీ కాలం
2014 – డిసెంబరు 2018
ముందు జి. వివేకానంద్
తరువాత బోర్లకుంట వెంకటేష్ నేత
నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1983-10-18) 1983 అక్టోబరు 18 (వయసు 40)
రేగుంట, మెట్‌పల్లి మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రాణి అలేఖ్య
సంతానం 2
నివాసం చెన్నూర్
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

జననం మార్చు

బాల్క సుమన్ 1983, అక్టోబరు 18న సురేష్ - ముత్తమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలంలోని రేగుంటలో జన్మించాడు.[3] సుమన్ తండ్రి బాల్క సురేష్ మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుండి కార్యకర్తగా చురుకైన పాత్ర పోషించాడు. సుమన్ కు ఒక తమ్ముడు, ఒక సోదరి ఉన్నారు.

విద్యాభ్యాసం మార్చు

సుమన్ ప్రాథమిక విద్యను 1 నుండి 4 వ తరగతి వరకు మెట్‌పల్లిలో పూర్తి చేశాడు. తరువాత కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్యను, జూనియర్ కళాశాలలో మాధ్యమిక విద్యను చదివాడు. కోరుట్లలో తన గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేసి, 2003లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 2008లో ఆంగ్ల సాహిత్యంలో పిహెచ్.డి.లో చేరాడు.[4]

వివాహం - పిల్లలు మార్చు

సుమన్ కి టీవీ జర్నలిస్ట్‌ రాణి అలేఖ్యతో 2013లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (సుహాన్, సుషన్)

రాజకీయ జీవితం మార్చు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం (టి.ఆర్.ఎస్.వి)కు 2007లో అధ్యక్షులుగా పనిచేశాడు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం (టి.ఆర్.ఎస్.వి)కు 2010లో రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేశాడు. 2009, 2014 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.[5]

2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి. వివేకానంద్ పై 2,91,158 ఓట్ల ఓట్ల మెజారిటీతో 16వ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటిచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతపై 28,132 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] బాల్క సుమన్ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7]

మూలాలు మార్చు

  1. "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.
  2. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  3. "Telangana MP Balka Suman Profile Detailed Review". 19 May 2016.
  4. "Balka Suman | MLA | Chennur | Mancherial | Telangana | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-15. Archived from the original on 2020-12-20. Retrieved 2021-10-15. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2020-12-16 suggested (help)
  5. "Balka Suman: Age, Biography, Education, Wife, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-14. Retrieved 2021-10-14.
  6. "Balka Suman(TRS):Constituency- CHENNUR SC)(MANCHERIAL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-10-14.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.