టీ హబ్
ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్ లకు ఇంక్యుబేటర్ గా తీర్చిదిద్దనున్న టీ-హబ్ నవంబర్ 5 న హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా ప్రారంభం అయింది.. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీలతో పాటు మరి కొన్ని కంపెనీల సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు టీ హబ్. దేశవ్యాప్తంగా స్టార్టప్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు వేదిక ఇది టీ హబ్‌లో జీ+5 ఫ్లోర్‌లలో దాదాపు 100 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.[1]
స్థాపన | 2015 |
---|---|
కేంద్రీకరణ | స్టార్టప్ ఇంక్యుబేటర్ |
కార్యస్థానం | |
Origin | హైదరాబాద్, తెలంగాణ |
జాలగూడు | టీ హబ్ వెబ్సైట్ |
కాటలిస్ట్ భవనం
మార్చుప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ-హబ్ భవనాన్ని నిర్మించారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణంకోసం రూ.[2]10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 1జీబీ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వైఫై సదుపాయం, అత్యున్నత సదుపాయాలతో జీ+5 విధానంలో టీ హబ్ భవంతిని నిర్మించింది. ఈ భవనానికి కాటలిస్ట్ పేరును ఖరారు చేసి, గ్రీన్‌బిల్డింగ్‌గా, ఎనర్జీని ఎఫిషియెంట్‌గా తీర్చిదిద్దింది. కేవలం మౌలిక వసతులతో భవనం నిర్మించి వదిలేయకుండా.. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు అత్యున్నత సంస్థలనూ భాగస్వామ్యం చేసింది.
బిజినెస్ ప్లాన్ ఎలా రాయాలి? స్టార్టప్‌లను వ్యాపారపరంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి? ఈ క్రమంలో పాటించాల్సిన విధివిధానాలేంటి? అనే విషయంలో ఐఎస్‌బీ మెంటార్లు సూచనలిస్తారు. స్టార్టప్‌లు పరిగణనలోకి తీసుకోవాల్సిన టెక్నికల్ అంశాలను ఐఐఐటీ మెంటార్లు సూచిస్తారు. పేటెంట్లు, ఇంటలెక్చువల్ రైట్స్, లీగల్ అంశాల్లో నల్సార్ నిపుణులు మార్గదర్శకం చేస్తారు.
వారి వారి అవసరాలను బట్టి క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ కేటాయిస్తారు. కెఫ్టేరియా, ఉత్సాహపరిచే రీతిలో ఇంటిరీయర్ డిజైనింగ్, స్ఫూర్తి కలిగించేలా మహామహాహుల సూక్తులు, ఆసక్తికరమైన చిత్రాలు.. తదితర ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో ఈ భవంతిలో ఉన్నాయి.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబైల్, డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి అనేక రంగాల్లో వినూత్న ఉత్పత్తుల అభవృద్దికి కృషి చేస్తున్న స్టూడెంట్స్, ఔత్సాహికులకు టీ హబ్ వేదిక అవుతుంది. టీ హబ్ లో కార్యకలాపాలు చేపట్టడానికి దాదాపు 500 స్టార్టప్ లు అప్లై చేసుకున్నాయి.[3]
టెక్నాలజీ ఇంక్యూబేషన్ సెంటర్ (టీ-హబ్) డైరెక్టర్లు
మార్చు- జమేష్ రంజన్ (కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ)
- డా. పి.జె. నారాయణన్ (ఐఐటీ డైరెక్టర్)
- అజిత్ రంగ్నేకర్ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్)
- ఫైజాన్ ముస్తఫా
- శశి రెడ్డి
- సి.పి. గుర్నాణి
- బి.వి.ఆర్. మోహన్ రెడ్డి
టీ హబ్ కోసం ప్రత్యేక వెబ్ సైట్ డిజైన్ చేశారు.[4] దీని ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా కార్యాలయానికి నేరుగా వచ్చి ఆసక్తిని తెలియజేయవచ్చు. వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందం అర్హులను ఎంపిక చేస్తుంది. అత్యుత్తమ ఆలోచన కలిగి ఉండి, వ్యాపారపరంగా విజయవంతమయ్యే అవకాశం ఉంటే..విద్యార్హతతో సంబంధం లేకుండానే స్టార్టప్‌లకు చోటు కల్పిస్తారు. వారి వారి అవసరాలకు తగినట్లు క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ ఇస్తారు. దీనికి టీ హబ్ నిర్దేశించిన చార్జీలుంటాయి. స్టార్టప్‌లు టీ హబ్‌లో తమ కార్యకలాపాలకు కేటాయించిన సమయం వృథా పోకుండా ఐఎస్‌బీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అందజేయనున్నారు.
అవార్డులు
మార్చువివిధ సాంకేతిక రంగాలలో వినూత్నమైన, సాంకేతికతతో నడిచే విజ్ఞానం, ఇంటెన్సివ్ స్టార్టప్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించడం ద్వారా టెక్నో-ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో అత్యుత్తమ సహకారం అందింస్తూ దేశంలోనే అత్యుత్తమమైన ఇంక్యుబేటర్‌గా గుర్తింపుపొందిన టీహబ్‌కు భారత ప్రభుత్వం నుండి నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023 (టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ అవార్డు (కేటగిరీ ఇ)) వచ్చింది. 2023 మే 14న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టీహబ్ సిఇఒ శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు.[5][6]
గుర్తింపులు
మార్చు- ఐదవ స్థానం: స్టార్టప్ ఎకోసిస్టంను అభివృద్ధి చేయడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుకు దూసుకుపోతున్న టీహబ్, ప్రపంచంలోని ‘మోస్ట్ యాక్టివ్ ఇన్వెస్టర్స్-యాక్సిలరేటర్స్, ఇంక్యుబేటర్స్’లో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు వివిధ కంపెనీల నుంచి 935 స్టార్టప్‌లకు పెట్టుబడులను రాబట్టడం ద్వారా టీహబ్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నదని, హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన డార్విన్‌బాక్స్ స్టార్టప్ యూనికార్న్ కంపెనీల జాబితాలో చేరినట్టు ట్రాక్షన్ జియో తన 2022 త్రైమాసిక నివేదికలో పేర్కొన్నది.[7]
టీ హబ్ 2
మార్చురాయదుర్గంలో నిర్మించిన టీహబ్-2 నూతన భవనాన్ని 2022 జూన్ 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా ప్రారంభించబడింది.
చిత్రమాలిక
మార్చు-
టీ హబ్ ఆట్రియమ్
-
టీ హబ్ కేఫెటేరియా
-
టీ హబ్ సమావేశ మందిరం
-
టీ హబ్ ఇంటీరియర్
-
టీ హబ్ ఇంటీరియర్
-
టీ హబ్ ఇంటీరియర్
-
టీ హబ్ ఇంటీరియర్
-
టీ హబ్ ఇంటీరియర్
-
టీ హబ్ ఇంటీరియర్
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-07. Retrieved 2015-11-09.
- ↑ vishalsingh1691 (2015-11-05). "Hyderabad Gets 70K Square Feet Startup Incubator "T-Hub" To Foster Entrepreneurs In The State". Inc42 Media (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-09.
- ↑ "టిహాబ్ వెబ్సైట్". Archived from the original on 2016-03-04. Retrieved 2015-11-09.
- ↑ India, The Hans (2023-05-15). "Hyderabad: KT Rama Rao lauds T-Hub for winning National Technology Award". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-15.
- ↑ Today, Telangana (2023-05-14). "Telangana's T-Hub wins National Technology Award". Telangana Today. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
- ↑ telugu, NT News (2022-05-02). "ప్రపంచంలో టీహబ్ @ 5". Namasthe Telangana. Archived from the original on 2022-05-02. Retrieved 2022-05-02.