రాయదుర్గం, హైదరాబాదు
రాయదుర్గం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ భాగమైన ఈ రాయదుర్గం, ఐటి హబ్‌కు దగ్గరగా ఉంది.[1][2][3]
రాయదుర్గం | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500062 |
లోక్‌సభ నియోజకవర్గం | శంషాబాదు |
శాసనసభ నియోజకవర్గం | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సి | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుదీనికి చుట్టుపక్కల షేక్‌పేట, హైటెక్ సిటీ, మణికొండ, జూబ్లీ హిల్స్, పుప్పలగూడ, టింబర్ లేక్ కాలనీ, చిత్రపురి కాలనీలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి రాయదుర్గానికి సిటీ బస్సు సర్వీసులు ( షేక్‌పేట్ దర్గా బస్టాప్, మధుర నగర్ కాలనీ, హెచ్.ఎస్. దర్గా, ఓ.యు. కాలనీ బస్టాప్ మీదుగా 217ఎ, 102ఆర్, 49ఇ, 102హెచ్, 102వా, 203, 102ఎన్, 116, 222, 28, 102ఎఫ్, 142ఎస్, 65ఎస్ మొదలైన నంబర్లు కలవి) నడుపబడుతున్నాయి. ఇక్కడ రాయదుర్గం మెట్రో స్టేషను కూడా ఉంది.[4][5] ఇక్కడికి 6 కి.మీ.ల దూరంలో బోరబండ రైల్వే స్టేషను, 24 కి.మీ.ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
వాణిజ్యకేంద్రం
మార్చురాయదుర్గం పరిధిలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో టీ హబ్ 2, టీ వర్క్స్, ఇమేజ్ టవర్ సంస్థలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Rs 88,000 per yard at Raidurg in Hyderabad
- ↑ Land prices zoom 20 per cent across Telangana
- ↑ HMDA to invest in metro rail to Rajiv Gandhi International Airport- The New Indian Express
- ↑ Metro: Metro Red Line to get green signal by July-end, says KT Rama Rao | Hyderabad News - Times of India
- ↑ raidurg: SPV formed to extend Metro from Raidurg to Hyderabad airport | Hyderabad News - Times of India