టెడ్డీ 2021లో విడుదలైన తెలుగు సినిమా. స్టూడియోగ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమాకు శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహించాడు. ఆర్య, సాయేషా సైగల్‌, సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను 2019 డిసెంబర్ 11న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి సినిమాను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్స్‌ ఓటీటీలో మార్చి 12న విడుదల చేశారు.[2]

టెడ్డీ
దర్శకత్వంశక్తి సౌందర్‌ రాజన్‌
రచనశక్తి సౌందర్‌ రాజన్‌
నిర్మాతజ్ఞానవేల్‌ రాజా
తారాగణంఆర్య
సాయేషా సైగల్‌
సతీష్
ఛాయాగ్రహణంఎస్.యువ
కూర్పుటి. శివానందీశ్వరన్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
స్టూడియోగ్రీన్‌
పంపిణీదార్లుడిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్స్‌
విడుదల తేదీ
2021 మార్చి 12 (2021-03-12)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

శ్రీ విద్య (సాయేషా) కాలేజీ స్టూడెంట్ ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చేరుతుంది. హాస్పిటల్‌లో వైద్యులు ప్రమాదకరమైన డ్రగ్స్ ఇచ్చి ఆమెను కోమాలోకి వెళ్లేలా చేస్తారు. కోమాలోకి వెళ్లడంతో శ్రీ విద్య ఆత్మ ఓ టెడ్డీ బేర్‌లో చేరుతుంది. ఎవరికైనా ఆపద వస్తే తన ఇంటెలిజెన్స్‌తో సహాయ పడే శివ (ఆర్య)ను టెడ్డీ బేర్ కలిసి సహాయం కోరుతుంది. శ్రీ విద్యకు వైద్యులు ఎందుకు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి కోమాలోకి పంపారు? శ్రీ విద్యను శివ కాపాడాడ ?? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • ఆర్య
  • సయేషా
  • నిమ్మి హర్షన్ (గాత్రం) & EB గోకులన్ (మోషన్ క్యాప్చర్) టెడ్డీగా
  • సాక్షి అగర్వాల్ ( అతిథి పాత్ర )
  • తిరుమేని
  • సతీష్
  • కరుణాకరన్
  • షబీర్ కల్లరక్కల్
  • రాజా రుద్రకోడి
  • మాసూమ్ శంకర్
  • ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌
  • మోనా బేద్రే
  • ప్రవీణ
  • అబ్దుల్ లీ
  • ప్రదీప్ కె విజయన్
  • రాబిడ్స్‌గా యోయాన్ పెరివర్

మూలాలు మార్చు

  1. 10TV (11 December 2019). "ఆర్య 'టెడ్డీ' - ఫస్ట్ లుక్" (in telugu). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "'టెడ్డీ' చేసే సాహసాలు చూశారా?". 23 February 2021. Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. The Indian Express (12 March 2021). "Arya, Sayyeshaa and the teddy bear are let down by Shakti Soundar Rajan" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=టెడ్డీ&oldid=4087001" నుండి వెలికితీశారు