టోంక్ (రాజస్థాన్)

టోంక్, భారత రాజస్థాన్ లోని ఒక పట్టణం.ఈ పట్టణం జైపూర్ నుండి దక్షిణాన 95 కి.మీ. (60 మైళ్లు) దూరంలో బనాస్ నది కుడి ఒడ్డుకు సమీపంలో ఉంది.ఈ నగరం టోంక్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. టోంక్ 1817 నుండి 1947 వరకు బ్రిటిష్ ఇండియా పరిపాలనకాలంలో పేరులేని రాచరిక రాజ్యానికి రాజధానిగా ఉంది.

టోంక్
Nickname: 
నవాబీ నగరి
టోంక్ is located in Rajasthan
టోంక్
టోంక్
టోంక్ is located in India
టోంక్
టోంక్
Coordinates: 26°10′N 75°47′E / 26.17°N 75.78°E / 26.17; 75.78
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాటోంక్
Government
 • Bodyనగరపాలక సంస్థ
Elevation
289 మీ (948 అ.)
జనాభా
 (2011)
 • Total1,65,294
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
ISO 3166 codeRJ-IN
Vehicle registrationRJ-26

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం టోంక్ పట్టణ జనాభా మొత్తం 165,294 మంది కాగా అందులో 48% మంది స్త్రీలు ఉన్నారు. జనాభా మొత్తంలో ఆరు, అంతకన్నా తక్కువ వయస్సు గలవారు 14% మంది ఉన్నారు.టోంక్ సగటు అక్షరాస్యత 68.62%గా ఉంది.పురుషుల అక్షరాస్యత రేటు 77.68% కాగా స్త్రీల అక్షరాస్యత 59.18%గా ఉంది.[1]

చరిత్ర

మార్చు

రాష్ట్ర స్థాపకుడు దాని మొదటి పాలకుడు నవాబ్ ముహమ్మద్ అమీర్ ఖాన్ (1769-1834), ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన పష్తున్ సంతతికి చెందిన సాహసికుడు,సైనిక నాయకుడు. అమీర్ ఖాన్ సేనాధిపతి‌గా ఎదిగాడు. 1806 లో, ఖాన్ యశ్వంత్ రావు హోల్కర్ నుండి తీసుకొని ఈ ప్రాంతాన్ని జయించాడు. బ్రిటిష్ ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంది. తిరిగి ఖాన్ ఆతరువాత టోంక్ రాచరిక రాష్ట్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుండి తిరిగి పొందాడు.[2] 1817 లో, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధం తరువాత, అమీర్ ఖాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించి, నవాబ్ బిరుదును స్వీకరించేటప్పుడు తన భూభాగమైన టోంక్‌ను బ్రిటీష్ పాలన కింద ఉంచాడు.[3] ఇండోర్ పాలకుడు ఖాన్ కు భూమి మంజూరు చేసిన ఒక సంవత్సరం తరువాత టోంక్ స్థాపించబడింది.

మూలాలు

మార్చు
  1. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Retrieved 2021-01-01.
  2. Lethbridge, Sir Roper (2005). The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled or Decorated of the Indian Empire. ISBN 9788187879541.
  3. Princely States of India

బాహ్య లింకులు

మార్చు