డమాస్కస్ సెయింట్ జాన్

డమాస్కస్ సెయింట్ జాన్ [1]( 675 లేదా 676 - 4 డిసెంబర్ 749) డమాస్కస్‌కు చెందిన క్రైస్తవ నాయకుడు. అతను సన్యాసి, పూజారి (క్రైస్తవ బోధకుడు). తను సిరియా రాజధాని డమాస్కస్ నగరంలో పుట్టి పెరిగాడు. పాలస్తీనాలోని జెరూసలెంలో, మార్ సబా ఆశ్రమంలో మరణించాడు.[2] ఇతను తొలితరం ఇస్లాం విమర్శకులలో ఒకడు.

సెయింట్ జాన్ ఆఫ్ డమాస్కస్
సెయింట్ జాన్ డమసెన్ (అరబిక్ చిహ్నం)
డాక్టర్ ఆఫ్ ద చర్చ్
జననంc. 675 లేదా 676 AD
డెమాస్కస్
మరణం749 డిసెంబరు 4
మార్ సబ, జెరూసెలం
గౌరవాలుఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్
రోమన్ కాథలిక్ చర్చ్
ఈస్టర్న్ కాథలిక్ చర్చెస్
లూథరన్ చర్చ్
ఆంగ్లికన్ కమ్యూనియన్
కెనానైజ్డ్ప్రి-కాంగ్రెగేషన్
విందుడిసెంబరు 4
మార్చి 27 (రోమన్ కాలెండరు 1890-1969)

డమాస్కస్ జాన్ మతాన్ని అభ్యసించాడు. అతను చట్టం, వేదాంతశాస్త్రం, తత్వశాస్త్రం, సంగీతం కూడా అభ్యసించాడు. అతను పూజారి కావడానికి ముందు డమాస్కస్ ముస్లిం ఖలీఫ్‌కు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశాడని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.[3] [4]అతను క్రైస్తవ మతం గురించి రచనలు రాశాడు. అతను ప్రపంచవ్యాప్తంగా గ్రీకు ఆర్థోడాక్స్ చర్చిలు ఇప్పటికీ ఉపయోగిస్తున్న శ్లోకాలను కంపోజ్ చేశాడు. అతను తూర్పు ఆర్థోడాక్స్ చర్చి యొక్క "ఫాదర్స్ చివరివాడు" గా పరిగణించబడ్డాడు. "ఐకాన్స్" అని పిలువబడే గ్రీకు ఆర్థోడాక్స్ సాధువుల చిత్రాలను ఉపయోగించమని ప్రజలతో వాదించడానికి అతను బాగా గుర్తింపు పొందాడు[5]. అతన్ని కాథలిక్ చర్చిలు, ప్రత్యేకంగా రోమన్ కాథలిక్ చర్చి కూడా సత్కరించాయి.

మూలాలు

మార్చు
  1. Greek: Ἰωάννης ὁ Δαμασκηνός, Iōannēs ho Damaskēnos; లాటిన్: Iohannes Damascenus; అరబ్బీ: يوحنا الدمشقي‎, Yuḥannā Al Demashqi; also called John Damascene, Chrysorrhoas (meaning "streaming with gold", that is, "the golden speaker", a very good speaker).
  2. M. Walsh, ed. Butler's Lives of the Saints(HarperCollins Publishers: New York, 1991), pp. 403
  3. Suzanne Conklin Akbari, Idols in the East: European representations of Islam and the Orient, 1100-1450, Cornell University Press, 2009 p.204
  4. David Richard Thomas, Syrian Christians under Islam: the first thousand years, Brill 2001 p.19.
  5. Aquilina 1999, pp. 222

బాహ్య లంకెలు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

St John Damascene on Holy Images (πρὸς τοὺς διαβάλλοντας τᾶς ἁγίας εἰκόνας). Followed by Three Sermons on the Assumption (κοίμησις), available at Project Gutenberg.; also available through the Internet Archive.