సిరియా
సిరియా ఒక పశ్చిమాసియా దేశము. 2013 లో జరిగిన రసాయన దాడిలో ఈ దేశం ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది.
الجمهورية العربية السورية Al-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah Syrian Arab Republic |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Homat el Diyar Guardians of the Land |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | డమాస్కస్ 33°30′N 36°18′E / 33.500°N 36.300°E | |||||
అధికార భాషలు | అరబిక్ | |||||
ప్రభుత్వం | అధ్యక్ష గణతంత్ర రాజ్యం | |||||
- | అధ్యక్షుడు | బషర్ అల్-అస్సాద్ | ||||
- | ప్రధాన మంత్రి | ముహమ్మద్ నాజీ Etri | ||||
స్వాతంత్ర్యము | ఫ్రాన్స్ నుండి | |||||
- | మొదటి ప్రకటన | September 19361 | ||||
- | రెండవ ప్రకటన | January 1 1944 | ||||
- | గుర్తింపు | April 17 1946 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 185,180 కి.మీ² (88th) చ.మై |
||||
- | జలాలు (%) | 0.06 | ||||
జనాభా | ||||||
- | July 2007 అంచనా | 20,314,747 (55th) | ||||
- | జన సాంద్రత | 103 /కి.మీ² (96th) /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $71.74 బిలియన్ (65వ స్థానం) | ||||
- | తలసరి | $5,348 (101వ స్థానం) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | మూస:Medium 0.716 (medium) (107th) | |||||
కరెన్సీ | Syrian pound (SYP ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
- | వేసవి (DST) | EEST (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .sy | |||||
కాలింగ్ కోడ్ | +963 | |||||
1 | The Franco-Syrian Treaty of Independence (1936), not ratified by France. |
నైసర్గిక స్వరూపము
మార్చు- పూర్వ నామం :సిరియన్ అరబ్ రిపబ్లిక్ (అల్ జుమురియా అల్ అరబియ అస్ సుర్రియా)
- ఖండం: ఆసియా
- దేశస్తులు:సిరియన్లు
- వైశాల్యం: 1,85,180 చదరపు కిలోమీటర్లు
- జనాభా: 2,20,87,048 (తాజా అంచనాలు 2004 ప్రకారం)
- రాజధాని: డమాస్కస్
- ప్రభుత్వం: యూనిటరీ సింగిల్ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
- కరెన్సీ: సిరియన్ పౌండ్
- అధికారిక భాష: అరబిక్
- మతం: 90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు,1 శాతం మిగిలిన ఇతర మతాలు .
- వాతావరణం: జనవరిలో 0 నుండి 12 డిగ్రీలు, ఆగస్టులో 18 నుండి 37 డిగ్రీలు ఉంటుంది.
- పంటలు: పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు.
- పరిశ్రమలు: చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు.
- సరిహద్దులు: ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, మధ్యధరా సముద్రం.
- స్వాతంత్ర్య దినోత్సవం: 1944 ఏప్రిల్ 17
చరిత్ర
మార్చుసామాన్య శకం 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజల ఉన్న దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలతో నిత్యమూ పోరాటాలు, చిన్నపాటి యుద్ధాలు నేడు చోటు చేసుకుంటున్నాయి. సామాన్య శఖం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, ఎడారి ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఒకప్పుడు సిరియా దేశం వివిధ దేశాల రాజులకు యుద్ధభూమిగా ఉండేది. 'సిరియన్లు '’ ఎక్కువగా వ్యాపారరంగంలో ఉన్నాయి. సమీప దేశాలతో వీరి వ్యాపార బంధాలుగా చైనా, భారతదేశం, అరబ్బు దేశాలలో ఉన్నాయి. దేశాన్ని ఫోనేషియన్ల తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్ రాజుల పరిపాలించారు. సామాన్య శకం 632లో ముస్లిం మత నమ్మకం కలిగిన ప్రాఫెట్ మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలపాటు కలీఫాలు పరిపాలించారు. సా.శ. 1095లో యూరోపు నుండి క్రైస్తవులు క్రమంగా వచ్చి ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సా.శ. 1114లో సుల్తాన్ నూరుద్ధీన్ అనే రాజు క్రమంగా సిరియాదేశాన్ని ఆక్రమించి క్రిస్టియన్లను తరిమివేశాడు. 15వ శతాబ్దంలో ఒట్టోమాన్ రాజులు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1944తో సిరియా దేశం స్వాతంత్ర్యం పొందింది.
పరిపాలన
మార్చుసిరియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 14 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని గవర్నోరేట్ అని అంటారు. ఇవి తిరిగి 61 జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి. జనాభా ఎక్కువగా రాజధాని డమాస్కస్ చుట్టూ అలాగే యూఫ్రటీస్ నదీ తీరం వెంబడి ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.దేశంలోని పది పెద్ద నగరాలు...
- డమాస్కస్
- అలెప్పొ
- హోమ్స్ లటా కియా
- హమా
- అల్ రక్కఫ్
- డీర్ ఎజ్జోర్
- అల్‌హసకా
- క్వామిష్లీ
- సయ్యిదా జన్సబ్
ప్రజలు - సంస్కృతి
మార్చుదేశంలో 74 శాతం మంది ప్రజలు ముస్లిములు. వీరు చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు. లెవన్‌టైన్, ఖుర్దు, టుర్కుమెన్, సిర్కాసియన్, గ్రీకులు, జ్యూలు, ఆర్మేనియన్‌లు... ఇలా ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. అరబ్బీ, కుర్దెష్ భాషలు మాట్లాడుతారు.
వేషధారణ
మార్చువివిధ తెగల వాళ్ళు వారివారి సాంప్రదాయరీతులలో వస్త్రధారణ చేస్తారు. ఇది ప్రాంతాలవారీగా ఉంటుంది. సాధారణంగా పురుషులు పొడవాటి గౌన్‌లను ధరిస్తారు. దీనిని కఫ్తాన్ అంటారు. స్త్రీలు పొడవాటి రోబ్‌లను ధరిస్తారు. కేవలం చేతులు, పాదాలు మాత్రమే బయటికి కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు తలలకు పాగాలు ధరిస్తారు. యువతీయువకులు మాత్రం ప్యాంటు, షర్టు, జీన్స్ ధరిస్తారు. అలంకరణ సామగ్రిని ఉపయోగిస్తారు. ధనిక కుటుంబాల మహిళలు మాత్రం కురచ దుస్తులు ధరిస్తారు. సాధారణంగా మహిళలు ఇంటి వ్యవహారాలు చూసుకుంటారు. గ్రామాలలో మహిళలు ఇంటిపనులతో పాటు పొలం పనులకు కూడా వెళతారు.
ఆహార అలవాట్లు
మార్చుమాంసం, రొట్టెలు వీరి ప్రధాన ఆహారం. గోధుమ, మైదా పిండితో బన్, రొట్టె, బ్రెడ్డు లాంటి పదార్థాలు తయారుచేస్తారు. వీటితో పాటు సూప్‌లు, కూరలు ఉంటాయి. అన్నం, మాంసం కలిపి ముద్దలు చేస్తారు. వీటిని బ్రెడ్డుతో లేదా రొట్టెతో కలిపి తింటారు.
దర్శనీయ ప్రదేశాలు
మార్చుడమాస్కస్
మార్చుదేశ రాజధాని డమాస్కస్ నగరం కిక్కిరిసిన జనాభాతో నిండిన నగరం. నగరం నలుదిశలా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. బైజాంటైన్ ఆర్కేడ్ అనేది జూపిటర్ దేవుని ఆలయం. దీనిని రోమన్ పరిపాలకులు నిర్మించారు. ఈ ఆర్కేడ్ సమీపంలోనే ఉమ్మాయ్యద్ మసీదు ఉంది. దీనినే గ్రాండ్ మాస్క్ అంటారు. దీనిని పూర్వం ఒకటవ కాన్‌స్టాంట్‌నోపుల్ అనే రోమన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ మసీదుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మసీదు లోపలి భాగంలో శిఖరం లోపలి భాగంలో ఇప్పటికీ సెయింట్ జాన్ తల భాగం నిలిచి ఉంది. మరో విశేషం 2001లో పోప్ జాన్ పాల్-2 ఈ మసీదును సందర్శించాడు.
ఇక డమాస్కస్ పాత నగరంలో పురాతన కట్టడాలు, ఇళ్ళు, ఇతర నిర్మాణాలు ఎన్నో దర్శనమిస్తాయి. అప్పటికాలంలో రోమన్‌లు, ముస్లింలు, క్యాథలిక్కులు, జ్యూలు నిర్మించిన కట్టడాలు నేటికీ నిలిచి ఉన్నాయి. నగరంలోని హేజాజ్ రైల్వేస్టేషన్ భవనాన్ని చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఒట్టోమాన్ రాజుల కాలంలో నిర్మించిన ఈ భవనం నేటికీ రైల్వేస్టేషన్ భవనంగా ఉపయోగపడుతోంది.
అలెప్పో నగరం
మార్చుకనుచూపు మేర వరకు విస్తరించిన నగరం అలెప్పో. ఈ నగరం అన్ని రకాలుగానూ ఎంతో ధనవంతమైన నగరంగా కనబడుతుంది. కిక్కిరిసిన ఇళ్ళు, చారిత్రక కట్టడాలు, ప్రజల సంస్కృతులు... ఇలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనిపిస్తుంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం అలెప్పో. నగరంలోని పురాతన కట్టడాలను ప్రభుత్వం సంరక్షిస్తుంది. సెయింట్ సిమియన్ ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ ఒకే ప్రదేశంలో నాలుగు చర్చి భవనాలు కలిసి ఒక శిలువ ఆకారంలో ఉంటాయి. మధ్యభాగంలో స్పైలైట్ స్తంభం ఉంది. ఆ కాలంలో ఆ స్తంభం మీద నిలబడి సెయింట్ జార్జ్ ప్రజలతో మాట్లాడేవారు. ఈ స్తంభం 25 మీటర్ల ఎత్తు ఉంది. నగరంలో మరో కట్టడం సిటాడెల్. ఇది యునెస్కో సంరక్షిత భవనంగా ఉంది. నగరంలో క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించిన ఆల్ కికన్ మాస్క్ నేటికీ అద్భుతంగా నిలిచి ఉంది.
సిటాడెల్ 165 అడుగుల ఎత్తు, 1476 అడుగుల పొడవు, 1066 అడుగుల వెడల్పుతో ఉంటుంది. శతాబ్దాలుగా ఎందరో రాజులను, చక్రవర్తులను చూసిన ఈ కట్టడం నేడు మౌనసాక్షిగా నిలబడి ఉంది.
హమాలో నీటి చక్రాలు
మార్చుహమా ఒక పురాతన నగరం. ఇది ఓరోంటిస్ నదీతీరంలో ఉంది. మధ్యయుగం నాటి నుండి ఈ నగరం ఉందన్న చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం, పరిశ్రమలు అధికం. బైజాంటియన్ రాజులు ఇక్కడ నీటి చక్రాలను మొట్టమొదట ఏర్పరిచారు. ఆ కాలంలో నదిలోని నీటిని తోడడానికి ఈ విశాలమైన నీటి చక్రాలను నిర్మించారు. చక్రాలను తిప్పుతూ ఉంటే నదిలోని నీళ్ళు చక్రాల చివరలలో ఉన్న డబ్బాలలో నిండి బయటికి వస్తాయి. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో ఏర్పరచిన ఈ నీటిచక్రాలు నేటికీ పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం కేవలం 17 నీటిచక్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కొక్క చక్రం వ్యాసార్థం 66 ఫీట్లు ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ నీటి చక్రాలు ఆ కాలంనాటి నీటిపారుదుల తీరుకు అద్దం పడుతుంది.
బోస్రా
మార్చుసిరియా దేశంలో ఉన్నన్ని చారిత్రక ప్రదేశాలు మరే దేశంలోనూ కనబడవు. అందుకే విదేశీయులు సిరియా దేశాన్ని అధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. బోస్రా ఒక పురాతన నగరం. రోమన్ చక్రవర్తులు నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. సందర్శకులను అది మంత్ర ముగ్ధులను చేస్తుంది. దీనిని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆనాటి కట్టడం నేటికీ ఏమాత్రం శిథిలం కాకుండా ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బోస్రా నగరం రాజధాని డమాస్కస్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ నగరం ఆకాలంలో నభాషియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత గ్రీకులు, రోమన్‌లు, బైజాంటైన్‌లు, అరబ్ ముస్లిం రాజులు దీనిని పాలించారు. రోమన్‌లు నిర్మించిన ఆంఫిథియేటర్‌లో దాదాపు 18 వేల మంది కూర్చోగలిగే వీలు ఉంది. స్టేజి పొడవు 148 అడుగుల పొడవు, 26 అడుగుల లోతులో ఉంటుంది.
పాల్మీరా
మార్చుపాల్మీరా కట్టడాలు ఒకటవ శతాబ్దానికి చెందినవి. ప్రజలు ఈ కట్టడాలను రెండు పేర్లతో పిలుస్తారు
1. ఎడారి పెళ్ళికూతురు- ఎందుకంటే ఈ ప్రదేశం ఎడారిలో ఉంది. ఇక్కడ ఒక ఒయాసిస్సు ఉంది. బాటసారులు ఆకలి, దప్పిక తీర్చుకోవడానికి పాల్మీరా దగ్గర విడిది చేసేవారు.
2. తాడ్‌మోర్- ఆధిపత్యానికి ప్రతీక. ఏ రాజులు దీనిని ఆక్రమించినా వెంటనే దానిని వదిలేసి వెళ్ళిపోయేవారు. అది మళ్ళీ ఒంటరిగా నిలిచి ఉండేది. ఎడారి కావడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇక్కడే టెంపుల్ ఆఫ్ బాల్ నిర్మాణం ఉంది. పూర్వకాలంలో ప్రజలు ఈ దేవాలయాన్ని తమ కోర్కెలు తీరినపుడు జంతువులను బలి ఇవ్వడానికి ఎంచుకున్నారు. బైజాంటైన్ రాజులకాలంలో ఈ దేవాలయం మార్పు చెంది చివరికి ఒక మసీదుగా, ఆ తర్వాత రాజుల సైనికులకు విడిది ప్రదేశంగా మారిపోయింది. టూంబుల లోయ కూడా ఇక్కడే ఉంది. ఈ లోయలోని టూంబులు దాదాపు ఈజిప్టులోని పిరమిడ్ల మాదిరిగా కనిపిస్తాయి. ఈ టూంబులలో ఆకాలపు రాజుల వారి కుటుంబ సభ్యుల మృత దేహలను భద్రపరిచే సమాధులు. నేటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడే మ్యూజియం, అరబ్ క్యాజిల్‌లు చూడదగిన కట్టడాలు.
వార్తలలో సిరియా
మార్చు2013 రసాయనదాడి
మార్చుఅంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో 2013 ఆగస్టు 21, బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. మృతుల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. వందల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. ఈమేరకు ప్రధాన విపక్ష కూటమి ‘నేషనల్ కొయిలిషన్’ వెల్లడించింది. ఆ ఆరోపణను ప్రభుత్వం ఖండించింది. అయితే మీడియాలో వచ్చిన ఫోటోలు, వీడియో దృశ్యాలు దాడికి నిదర్శనంగా నిలిచాయి. కొందరు నురగలు కక్కుతూ చనిపోతున్నట్లు, కొందరు ఎగశ్వాస తీసుకుంటున్నట్లు వాటిలో కనిపించారు. మృదేహాలపై ఎలాంటి గాయాలూ కనిపించకపోవడం రసాయన దాడి జరిగిందనడానికి సాక్షాధారమైనది.
దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది. రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది.
ఆర్ధికరంగం
మార్చు2015 గణాంకాలను అనుసరించి సిరియన్ ఆర్థికరంగం క్షీణిస్తున్న కస్టంస్ (దిగుమతి), ఆదాయం పన్ను, ఇరాన్ నుండి అందుతున్న సహాయం మీద ఆధారపడి ఉంది.[1] సిరియా అంతర్యుద్ధం సమయంలో ఇరాన్ 6-20 బిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయం చేస్తూ ఉంది.[2] యుద్ధం కారణంగా సిరియన్ ఆర్థికరగం 60%, సిరియన్ పౌండ్ విలువలో 80% క్షీణించింది.[3] అంతర్యుద్ధం కారణంగా సిరియాను వరల్డ్ బ్యాంక్ " లోవర్ మిడిల్ ఇంకం కంట్రీ "గా వర్గీకరించింది.[4] 2010లో ఆర్థికరంగం సిరియా ఆయిల్, వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంది. [5] ఆయిల్ రంగం నుండి 40% ఎగుమతుల ఆదాయం లభిస్తుంది.[5] సిరియా, సైప్రస్ మద్య ఉన్న మధ్యధరా సీ ఫ్లోర్ ఆయిల్ పెద్ద మొత్తంలో లభిస్తుంది.[6] వ్యవసాయరంగం జి.డి.పి.లో 20% భాగస్వామ్యం వహిస్తుంది, ఉపాధి 20% భాగస్వామ్యం వహిస్తుంది.రాబోయే కలంలో ఆయిల్ నిలువలు క్షీణించి సిరియా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఒకటిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.[5] అంతర్యుద్ధం తరువాత సిరియా ఆర్థికరంగం 35% క్షీణించింది.[7] సిరియా ప్రభుత్వం ఇరాన్,రష్యా, చైనా దేశాల నుండి లభిస్తున్న ఆదాయం మీద ఆధారపడుతుంది.[7] ఆర్థికరంగాన్ని పూర్తిగా ప్రభుత్వం నియంత్రిస్తూ ఉంది. ప్రభుత్వం రాయితీలను అధికరించడం, వాణిజ్య నియంత్రణ నిబంధనలను క్రమబద్ధీకరించడం విదేశీధనం నిల్వలను సరక్షించడం మొదలైన బాధ్యతలను నిర్వర్తిస్తుంది.[8] విదేశీ వాణిజ్యం, క్షీణిస్తున్న ఆయిల్ ఉత్పత్తి, నిరుద్యోగసమస్య, బడ్జెట్ లోటు అధికరించడం, వ్యవసాయ రంగం అయధికంగా ఉపయోగిస్తున్న కారణంగా నీటిసరఫరా మీద పడుతున్న వత్తిడి, వేగవంతంగా అధికరిస్తున్న జనసంఖ్య, పారిశ్రామిక విస్తరణ, నీటి కాలుష్యం[8] సిరియా ప్రజల పేదరికానికి కారణం ఔతున్నాయి. యు.ఎన్.డి.పి. 2005లో సిరియన్ ప్రజలలో 35% బీదరికంలో మగ్గుతున్నట్లు, 11.4% దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారని ప్రకటించింది.[9] 2001 నుండి సిరియా ఎగుమతులు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి.[10] 2000-2008 తలసరి జి.డి.పి. 2.5% మాత్రమే.[10] నిరుద్యోగం 10%. దారిద్యం 2004 11% ఉండగా 2007 నాటికి 12.3% నికి చేరుకుంది.[10]
ఎగుమతులు
మార్చు2007లో సిరియన్ ప్రధాన క్రూడాయిల్, రిఫైండ్ ప్రొడక్టులు, ముడి పత్తి, వస్త్రాలు, పండ్లు, ధాన్యాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి. సిరియా పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయ ఉపకరణాలు, భారీ యంత్రాలకు అవసరమైన ముడిసరుకును ఎగుమతి చేస్తూ ఉంది.[9]
సమస్యలు
మార్చురాజకీయ అస్థిరత ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది.[11] హింసాత్మక చర్యలు, ప్రభుత్వ అంక్షలు, ఆర్థికరంగ మంజూరు, అంతర్జాతీయంగా ఏకాంతం విదేశీపెట్టుబడులు దూరం కావడానికి కారణం అయింది. కేద్రీకృత ప్రభుత్వ అధికారం, ఆయిల్ ఉత్పత్తి క్షీణత, దేశఆర్ధిక ప్రణాళిక లోటు అధికరించడం, ద్రవ్యోల్భణం సిరియా ఆర్థికరంగం కుంటుబడడానికి కారణంగా మారింది.[11]2011లో అంతర్యుద్ధానికి ముందుగా ప్రభుత్వం పర్యాటకరంగం, నేచురల్ గ్యాస్, సేవారంగం నుండి ఆదాయం పొదడానికి కృషిచేసింది. అలాగే ఆర్థికరంగ ఆదాయాన్ని వేరు రంగాల అభివృద్ధి ద్వారా సేకరించి ఆయిల్, వ్యవసాయం మీద ఆధారపడడం తగ్గించడానికి ప్రయత్నించింది.పలు మార్కెటులను స్వేచ్ఛయుతం చేసి ఆర్థికరంగ సంస్కరణకు తెరతీసింది. అయినప్పటికీ కలహం ఆరంభమైన కారణంగా సంస్కరణల వేగం తగ్గుముఖం పట్టాయి.[12]
అంతర్యుద్ధప్రభావం
మార్చు2012లో సిరియాలో ప్రారంభం అయిన అతర్యుద్ధం కారణంగా సిరియన్ ఎగుమతులు అన్నీ మూడింట రెండువంతులు పతనావస్థకు చేరుకున్నాయి. 2010లో ఎగుమతులు 12 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉండగా 2012 నాటికి అవి 4 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.[13] 2011 నాటికి జి.డి.పి. 3% నికి క్షీణించింది. [14] 2012 నాటికి జి.డి.పి. అదనంగా 20%క్షీణిస్తుందని అంచనా వేసారు. [15] 2012 నాటికి సిరియా ఆయిల్, పర్యాటకం పూర్తిగా క్షీణించింది. అంతర్యుద్ధం కారణంగా దాదాపు 5 బిలియన్ల అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లింది.[13]
అతర్యుద్ధం తరువాత పునరుద్ధరణ కార్యక్రమాలుగా చురుకుగా చేయవలసిన అవసరం ఏర్పడింది.పునరుద్ధరణకు 10 బిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరమని అంచనావేయబడింది.[13] ప్రభుత్వం ఆర్థికపరిస్థితి కారణంగా నిధులను మంజూరు చేయడం సాధ్యపడలేదు. 2012లో అంతర్యుద్ధం కారణంగా యు.ఎస్., యురేపియన్ యూనియన్ ఆయిల్ దిగుమతులపై (మాసానికి 400 బిలియన్ల అమెరికన్ డాలర్లు) నిషేధం విధించింది. [16] పర్యాటకం నుండి లభించే ఆదాయం క్షీణించింది. హోటెల్ ఆకుపెంసీ యుద్ధానికి ముందుకంటే 90% పతనం అయింది.[17] పర్యాటకరంగంలో 40% మంది వారి ఉద్యోగాలను కోల్పోయారు.[17]2015 మే మాసంలో ఐ.ఎస్.ఐ.ఎస్. సిరియా ఫాస్ఫేట్ గనులను స్వాధీనం చేసుకుంది. అస్సద్ పాలన ప్రధాన వనరుల ఆదాయం కోల్పోయింది. [18] తరువాత మాసం ఐ.ఎస్.ఐ.ఎస్. డమాస్కస్ గ్యాస్ పైప్ లైనును (ఈ పైప్ లైను డమాస్కస్‌కు హీటింగ్, ఎలెక్ట్రిక్ సౌకర్యం కలిగిస్తుంది) తగలపెట్టింది. [19] హయన్, జిహార్, ఎబ్లా ప్రాంతాలలో గ్యాస్ ఫీల్డును ఐ.ఎస్.ఐ.ఎస్. మూసివేసింది.[20]
పెట్రోలియం పరిశ్రమ
మార్చుసిరియా పెట్రోలియం పరిశ్రమ పతనావస్థకు చేరుకుంది. 2014 సెప్టెంబరులో ప్రభుత్వం కంటే ఐ.ఎస్.ఐ.ఎస్. అధికంగా ఆయిల్ ఉత్పత్తి చేసింది.ఐ.ఎస్.ఐ.ఎస్. అదనంగా ఆయిల్ ఫీల్డును స్వాధీనం చేసుకున్న తరువాత ఆయిల్ ఉత్పత్తి మరింత దిగజారింది.[1] సిరియన్ అంతర్యుద్ధం మూడవ సంవత్సరంలో డెఫ్యూటీ ఎకమమిక్ మినిస్టర్ సల్మాన్ హయన్ సిరియా రెండు ప్రధాన రిఫైనరీలు కెపాసిటీ కంటే 10% తక్కువగా ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నాడు.[21] 1960 నుండి సిరియా ఈశాన్యప్రాంతంలో ఉన్న ఆయిల్ ఫీల్డ్ నుండి హెవీ- గ్రేడ్ ఆయిల్‌ను ఉతపత్తి చేస్తూ ఉండేది. 1980లో సిరియా తూర్పు ప్రాంతం లోని డియర్ ఎజ్-జర్ ప్రాంతంలో లో- గ్రేడ్ ఆయిల్, లో- సల్ఫర్ ఆయిల్ నిల్వలు కనుగొనబడింది. 1995 నుండి 2012నాటికి సిరియా ఆయిల్ ఉత్పత్తి అత్యధికంగా పతనం అయింది. [22] 2012 నుండి 2014 నాటికి ఉత్పత్తి మరింత దిగజారింది.తిరుగుబాటుకు ముందు సిరియా ఆయిల్ ఉత్పత్తిలో 90% ఇ.యుకు ఎగుమతి చేయబడింది. మిగిలినది టర్కికి ఎగుమతి చేయబడింది.[17] 2012లో ఆయిల్, గ్యాస్ ఆదాయం జి.డి.పిలో 20% ఉండేది.[17]
రవాణాసౌకర్యాలు
మార్చుసిరియాలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు (డమాస్కస్, అలెప్పో, లట్టకియా, కమిష్లీ) ఉన్నాయి. ఇవి సిరియన్ ఎయిర్ సర్వీసులకు సేవలు అందిస్తూ విదేశీరవాణాకు సేవలు అందిస్తాయి.
రైలు
మార్చుసిరియన్ సరుకురవాణా అత్యధికంగా " చెమింస్ డీ ఫర్ సిరియన్ " (సొరియన్ రైల్వే కంపెనీ), ఇది ట్ర్కిష్ రైల్వేతో (టర్కిష్ కౌంటర్‌పార్ట్) అనుసంధానించబడింది. అభివృద్ధి చెందని దేశం అయిన సిరియా రైల్వేశాఖను మాత్రం సమర్ధవంతంగా నడుపుతూ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, ఆధునిక రైలు సర్వీసులు అందిస్తుంది.[23]
రహదారి
మార్చుసిరియా రహదారి మార్గం మొత్తం పొడవు 69,873 కి.మీ. ఇందులో ఎక్స్‌ప్రెస్ వే పొడవు 1,103 కి.మీ.
జలమార్గం
మార్చుదేశంలో 900 కి.మీ. ప్రయాణానికి అనువైన జలమార్గాలు ఉన్నప్పటికీ వీటిలో ఆర్థికపరమైన రవాణాజరగడం లేదు.[24]
నీటి సరఫరా
మార్చుసిరియా జలవనరులు అరుదుగా ఉన్న సెమీ అరిడ్ దేశంగా వర్గీకరించబడింది. సిరియాలో అత్యధికంగా నీటిని వాడుకుంటున్న రంగం వ్యవసాయం. ప్రజావసరాలకు 9% నీరు మాత్రమే వాడబడుతూ ఉంది.[25] జనసంఖ్యాభివృద్ధి, నగరప్రాంతాలు, పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం సిరియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్ళలో ఒకటి. 2006లో సిరియా జనసంఖ్య 19.4 మిలియన్లు. అభివృద్ధి శాతం 2.7%.[26]
గణాంకాలు
మార్చుHistorical populations (in thousands) | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1960 | 45,65,000 | — |
1970 | 63,05,000 | +3.28% |
1981 | 90,46,000 | +3.34% |
1994 | 1,37,82,000 | +3.29% |
2004 | 1,79,21,000 | +2.66% |
2014 | 1,79,52,000 | +0.02% |
Source: Central Bureau of Statistics of the Syrian Arab Republic, 2011[27] |
అత్యధికంగా ప్రజలు సముద్రతీర మైదానం, యుఫ్రేట్స్ నదీలోయప్రాంతం, నివసిస్తున్నారు. సిరియా జనసాంధ్రత 99 చ.కి.మీ " 2008 వరల్డ్ రెఫ్యూజీ సర్వే " ఆధారంగా సిరియాలో ఆశ్రయం కోరినవారి సంఖ్య 18,52,300. వీరిలో అత్యధికులు ఇరాక్ ప్రజలు (13,00,000) ఉన్నారు. అదనంగా పాలస్తీనాకు చెందినవారు 5,43,400, సోమాలియాకు చెందిన వారు 5,200 మంది ఉన్నారు.[28] ఐక్యరాజ్య సమితి " ది దిగ్గెస్ట్ హ్యూమనిటేరియన్ ఎమర్గెంసీ ఆఫ్ అవర్ ఎరా " అని సిరియాను అభివర్ణించింది.[29] 9.5 మిలియన్ల సిరియన్లు 2011 మార్చిలో ఆరంభమైన అంతర్యుద్ధ సమయంలో దాదాపు సగం మంది సిరియన్ ప్రజలు తమతమ నివాసాలను వదిలి వేరు ప్రదేశాలకు తరలించబడ్డారు.[30] 4 మిలియన్ల సిరియన్లు శరణార్ధులుగా దేశం వెలుపల నివసిస్తున్నారు. [31]
సంప్రదాయ సమూహాలు
మార్చుసిరియన్లు అత్యధికంగా లెవంత్ స్థానికిసంతతికి చెందినవారై ఉన్నారు. వీరు లెబనీయులు, పాలస్తీనీయులు, ఇరాకీయులు, జోరాడానీయులు, మాల్టెసె ప్రజలకు సన్నిహిత సంబంధం కలిగినవారై ఉన్నారు.[32][33] సిరియా జనసంఖ్య 1,70,64,854. [34] పాలస్తీనియన్ అరేబియన్లతో చేర్చి సిరియన్ అరేబియన్ల సంఖ్య 6,00,000. వీరు దేశ సంఖ్యలో 74% నికి భాగస్వామ్యం వహిస్తున్నారు. [8] స్థానిక క్రైస్తవులు (వెస్టర్ అరామిక్ ప్రజలు), అస్సిరియన్లు 4,00,000,[35] వెస్ట్రన్ అరామిక్ ప్రజలు దేశంతటా విస్తరించి ఉన్నారు. వీరు ప్రత్యేకంగా ప్రధాన నగరప్తాంతాలలో విస్తరించి ఉన్నారు. అస్సిరియన్లు అధికంగా ఉత్తర, ఈశాన్యప్రాంతలో (హోమోలు, అలెప్పో, క్వామిషీ, హసకాహ్ ప్రాంతాలలో ) నివసిస్తున్నారు. పలు అస్సిరియన్ సమూహాలు ఇప్పటికీ నియో- అరామిక్ భాషలను మాట్లడడానికి, వ్రాయడానికి వాడుతుంటారు.మాలౌలా, జుబ్బాదిన్, అల్-సర్ఖా మొదలైన గ్రామీణ ప్రాంతాలలో వెస్టర్న్ అరామిక్ ఇప్పటికీ వాడుకలో ఉంది.[36] సిరియాలో సంఖ్యాపరంగా ద్వితీయ స్థానంలో ఉన్న వారు కుర్దీలు. వీరి శాతం 9%-10%. [37][38] వీరి సంఖ్య దాదాపు 1.6 మిలియన్లు (యజదీలు 40,000లతో చేర్చి).[38]). కుర్దీలు అధికంగా ఈశాన్య సిరియాలో నివసిస్తుంటారు. వీరికి అధికంగా కుర్దిష్ భాషాకుటుంబానికి చెందిన కుర్మంజీ భాష వాడుకభాషగా ఉంది. [37] మూడవ స్థానంలో టర్కీ ప్రజలు (సిరియన్ టర్కీ) ఉన్నారు.సంఖ్యాపరంగా వీరి శాతం 4-5%.[38] అరబిజెద్ టర్కీ ప్రజలను చేర్చి వీరి శాతం గణనీయంగా ఉంది.[38] వీరి సంఖ్య గురించి విశ్వసించతగిన ఆధారాలు లేనప్పటికీ వీరి సంఖ్య 3.మిలియన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. [39][40][41] జనంఖ్యా పరంగా సిరియన్ అస్సిరియన్లు 4వ స్థానంలో ఉన్నారు. వీరి శాతం 4-4%.[38] 5వ స్థానంలో సిర్కాసియన్లు ఉన్నారు. వీరి శాతం 1.5%. [38], ఆర్మేనియన్లు 6 వ స్థానంలో ఉన్నారు. వీరి శాతం 1%.[38] వీరిలో అనేకమంది శరణార్ధుల సంతతికి చెందినవారు. ఆర్మేనియన్ జాతిహత్యల సమయంలో శరణార్ధులు అధికంగా సిరియా చేరుకున్నారు.సిరియాలో ఆర్మేనియన్ ఉపాధిదారులు అత్యధిక సంఖ్యలో (ప్రపంచంలో 7వ స్థానం) పనిచేస్తున్నారు. వీరు అధికంగా అలెప్పో, క్వామిష్లి, డమాస్కస్, కెసాబ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.
అల్పసంఖ్యాకులు
మార్చుసిరియాలో అల్బేనియన్లు, బోస్నియన్లు, జార్జియన్లు, గ్రీకులు, పర్షియన్లు, పాష్తన్లు, రష్యన్లు అల్పసంఖ్యలో నివసిస్తున్నారు. [38] వీరిలో ముస్లిం మతవిశ్వాసం కలిగిన ప్రజలు అరేయన్లుగా వ్యవహరించబడుతున్నారు.[38] సిరియాలో ఒకప్పుడు గణనీయమైన సంఖ్యలో యూదులు నివసిస్తున్నారు. వీరు పెద్ద సమూహాలుగా అలెప్పో, డమాస్కస్, క్వామిషి ప్రాంతాలలో నివసించేవారు.సిరియాలో హింసాత్మక చర్యలు అధికరించడం, ఇతర ఉపాధి అవకాశాల కొరకు వీరు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. 19వ శతాబ్దంలో యూదులు అధికంగా గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయిల్ దేశాలకు వలసపోయారు. 1948లో ఇజ్రాయిల్ స్థాపించిన తరువా వలసప్రక్రియ ముగింపుకు వచ్చింది.అరబుకు వెలుపల నివసిస్తున్న సిరియన్లు అధికంగా బ్రెజిల్లో కేంద్రీకృతమై ఉన్నారు. ఇక్కడ మిలియన్ల మంది అరేనియన్లు, ఈస్టర్న్ పూర్వీకత కలిగిన ప్రజలు ఉన్నారు.[42] అమెరికా ఖండాలలో సిరియన్ శరణార్ధులకు ఆశ్రయమిస్తున్న దేశాలలో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంది.[43] అరబ్ అర్జెంటీనియన్లు అధికంగా సిరియా, లెబనాన్ పూర్వీకత కలిగి ఉన్నారు.[44]
మతం
మార్చుసిరియా ప్రజలలో సున్నీ ముస్లిములు 74% [45] వీరిలో సున్ని అరేబియన్లు 59-60%, కుర్దీలు 8.5% ఉన్నారు.[46], టర్కీలు 3% ఉన్నారు.[46] 13% సిరియన్లు షియా ముస్లిం మతానికి చెందినవారై (అలావైట్, త్వెల్వర్లు, ఇస్మాయిల్స్, అరేబియన్లు, కుర్దీలు, టర్కోమన్లు) ఉన్నారు. క్రైస్తవులు 10% ఉన్నారు.[45] వీరిలో అధికంగా అనియోచియన్ ఆర్ధడాక్స్ మిగిలినవారిలో గ్రీక్ కాథలిక్, అస్సిరియన్ చర్చి ఆఫ్ ది ఈస్ట్, ఆర్మేనియన్ ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్లు, ఇతరులు ఉన్నారు. డ్రూజులు 3% ఉన్నారు.[45] డ్రూజులు 5,00,000 మంది ఉన్నారు. వీరు అధికంగా దక్షిణప్రాంతంలోని జబల్ అల్- డ్రూజ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. [47] అధ్యక్షుడు అల్-అస్సద్ కుటుంబం అలావైట్‌కు చెందినవారై ఉన్నారు. అలావైట్లు సిరియాలో ఆధిక్యత కలిగి ఉన్నారు. వీరు సైన్యంలో కీలకపదవులు వహిస్తున్నారు.[48] 2013 మే మాసంలో " సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ " నివేదిక ఆధారంగా సిరియన్ అంతర్యుద్ధంలో 94,000 మంది మరణించారని భావిస్తున్నారు. వీరిలో 41,000 మంది అలావైట్లు ఉన్నారు.[49]
క్రైస్తవులు
మార్చుసిరియాలో ఉన్న 2.5 మిలియన్ల క్రైస్తవులలో పాలస్తీనాకు చెందిన శరణార్ధులు అధికంగా ఉన్నారు. వీరు పలు బృందాలుగా విడిపోయారు. వీరిలో చల్సిడోనియన్, అంటియోచియన్ ఆర్ధడాక్స్ 47% ఉన్నారు. కాథలిక్కులలో మెల్కిటే, చల్డీన్, లాటిన్ ప్రజలు 16.2% ఉన్నారు. అమెరికన్ అపొస్టోలిక్ చర్చి 10.9%, సిరియాక్ ఆర్ధడాక్స్ 22.4%, మిగిలిన వారు అస్సిరియన్, ఇతరులు ఉన్నారు.సిరియన్ క్రైస్తవులు ఆర్థికంగా, సాంఘికంగా ఉన్నతవర్గానికి చెందిన వారై ఉన్నారు.[50]
భాషలు
మార్చుసిరియాలో ఆధునిక స్థాయి అరబిక్ అధికారభాషగా ఉంది. పలు ఆధునిక అరబిక్ భాషాకుటుంబానికి చెందిన భాషలు ప్రజల దైనిందిక జీవితంలో వాడుకలో ఉన్నాయి. పశ్చిమప్రాంతంలో లెవంతినె అరబిక్, ఈశాన్యప్రాంతంలో మెసపటోనియన్ అరబిక్ భాషలు వాడుకలో ఉన్నాయి. సిరియాలోని కుర్దిష్ ప్రాంతంలో కుర్దిష్ భాష (కుర్మంజీ రూపం) వాడుకలో ఉంది. సిరియన్ ఆర్మేనియన్, టర్కీ ప్రజలలో ఆర్మేనియన్, టర్కిష్ (సౌత్ అజ్రీ మాండలికం) వాడుకలో ఉన్నాయి.క్లాసికల్ అరబిక్ రూపొందడానికి ముందు అరామిక్ భాష ఈ ప్రాంతంలో వాడుకలో ఉండేది. అస్సిరియన్, సిరియాక్ ప్రజలు ఇది ఇప్పటికీ వ్యవహార భాషగా ఉంది. మలౌలా, పొరుగు గ్రామాలలో వెస్టర్న్ నియో- అరామిక్ భాష వాడుకలో ఉంది.ఇంగ్లీష్, ఫ్రెంచ్ దేశమంతటా ద్వితీయ భాషగా ఉంది. అయితే అధికంగా ఇంగ్లీష్ భాష వాడుకలో ఉంది.
సినిమారంగం
మార్చు- సుజాన్ నజమ్ ఆల్డిన్: సిరియా చలనచిత్ర నటి.
- సులాఫ్ ఫవాకేర్జీ: సిరియా చలనచిత్ర, టెలివిజన్ నటి.
- హలా షాకత్: సిరియా నటి.
ఇవి కూడా చూడండి
మార్చువెలుపలి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Syria regime revenues shrink as losses mount". The Daily Star. AFP. 30 May 2015. Retrieved 31 May 2015.
- ↑ "Iran spends billions to prop up Assad". TDA. Bloomberg. 11 June 2015. Retrieved 11 June 2015.
- ↑ "Syria's economy cut in half by conflict". BBC News. 23 June 2015. Retrieved 24 June 2015.
- ↑ "Country and Lending Groups". World Bank. Retrieved 26 July 2012.
- ↑ 5.0 5.1 5.2 "Syria Country Brief, September 2010" (PDF). World Bank.
- ↑ Transactions of the American Institute of Mining and Metallurgical Engineers. The Institute of Mining and Metallurgical Engineers. 1921. Retrieved 24 July 2014.
- ↑ 7.0 7.1 "Syria Weighs Its Tactics as Pillars of Its Economy Continue to Crumble". The New York Times. 13 July 2013. Retrieved 13 July 2013.
- ↑ 8.0 8.1 8.2 "Syria". The World Factbook. 2007. Archived from the original on 2018-12-25. Retrieved 2016-11-26.
- ↑ 9.0 9.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;USDoS
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 10.0 10.1 10.2 "Economic Challenges and Reform Options for Syria: A Growth Diagnostics Report" (PDF). World Bank. 21 February 2011. p. 10.
- ↑ 11.0 11.1 "Syria". Index of Economic Freedom.
- ↑ "Syria reverts to socialist economic policies to ease tension". Reuters. 4 July 2012. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 27 October 2012.
- ↑ 13.0 13.1 13.2 "Syria's battling economy may hold on with help from friends". Agence France-Presse. Archived from the original on 23 August 2012. Retrieved 28 August 2012.
- ↑ "Syria's ailing economy hits citizens and regime". Financial Times. 6 February 2012. Retrieved 24 August 2012.
- ↑ "Syrian Economy To Shrink By 20 Percent in 2012 As Country Struggles With War". Huffington Post. 12 October 2012.
- ↑ "Syrians struggle with shortages as economy buckles". Associated Press. 22 January 2013. Archived from the original on 13 May 2013.
- ↑ 17.0 17.1 17.2 17.3 "The Syrian Economy: Hanging by a Thread". Carnegie Endowment for International Peace. 20 June 2012.
- ↑ Sherlock, Ruth (27 May 2015). "Isil seizes Syrian regime's lucrative phosphate mines". The Telegraph. Retrieved 11 June 2015.
- ↑ "IS blows up Syria gas pipeline serving capital: monitor". Yahoo News. AFP. 10 June 2015. Retrieved 11 June 2015.
- ↑ Shaheen, Kareem (11 June 2015). "String of losses in Syria leaves Assad regime increasingly precarious". The Guardian. Retrieved 11 June 2015.
- ↑ Al-Khalidi, Suleiman (27 January 2015). "Syria raises fuel prices to snuff out black market, soothe unrest". Reuters. Archived from the original on 27 జనవరి 2015. Retrieved 28 January 2015.
- ↑ "Syria's oil production on Index Mundi". Retrieved 15 October 2016.
- ↑ "How to travel by train from London to Syria | Train travel in Syria". Seat61.com. Retrieved 25 October 2008.
- ↑ "Syria". The World Factbook. CIA. Archived from the original on 2018-12-25. Retrieved 2016-11-26.
- ↑ M. Salman & W. Mulla. The Utilization of Water Resources for Agriculture in Syria: Analysis of Current Situation and Future Challenges [1]
- ↑ World Bank (2001). Syrian Arab Republic Irrigation Sector Report. Rural Development, Water and Environment Group, Middle East and North Africa Region, Report No. 22602-SYR [2]
- ↑ "Population Existed in Syria According To Censuses (1960, 1970, 1981, 1994, 2004) And Estimates of Their Number in Mid Years 2005–2011(000)". Central Bureau of Statistics. Archived from the original on 23 అక్టోబరు 2015. Retrieved 18 October 2015.
- ↑ "World Refugee Survey 2008". U.S. Committee for Refugees and Immigrants. 19 June 2008. Archived from the original on 28 December 2012.
- ↑ Politi, Daniel (30 August 2014). "U.N.: Syria Crisis Is 'Biggest Humanitarian Emergency of Our Era'". Slate. Retrieved 1 September 2014.
- ↑ Nebehay, Stephanie (29 August 2014). "Syrian refugees top 3 million, half of all Syrians displaced – U.N." Reuters. Archived from the original on 31 ఆగస్టు 2014. Retrieved 29 August 2014.
- ↑ "Demographic Data of Registered Population". UNHCR. Archived from the original on 19 ఫిబ్రవరి 2018. Retrieved 29 August 2014.
- ↑ Richards, M; Rengo, C; Cruciani, F; Gratrix, F; Wilson, JF; Scozzari, R; MacAulay, V; Torroni, A (2003). "Extensive Female-Mediated Gene Flow from Sub-Saharan Africa into Near Eastern Arab Populations". American Journal of Human Genetics. 72 (4). PMC – NCBI: 1058–1064. doi:10.1086/374384. PMC 1180338. PMID 12629598.
- ↑ "In the Wake of the Phoenicians: DNA study reveals a Phoenician-Maltese link". National Geographic Magazine. October 2004. Archived from the original on 29 ఆగస్టు 2008. Retrieved 30 January 2013.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;CIA - TWF
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Syria's Assyrians threatened by extremists - Al-Monitor: the Pulse of the Middle East". Al-Monitor. Retrieved 24 July 2014.
- ↑ "Turkey-Syria deal allows Syriacs to cross border for religious holidays". Today's Zaman. 26 April 2008. Archived from the original on 29 ఆగస్టు 2016. Retrieved 26 నవంబరు 2016.
- ↑ 37.0 37.1 "Syria – Kurds". Library of Congress Country Studies.
- ↑ 38.0 38.1 38.2 38.3 38.4 38.5 38.6 38.7 38.8 Khalifa, Mustafa (2013), The impossible partition of Syria, Arab Reform Initiative, pp. 3–5,
Arabs constitute the major ethnic group in Syria, making up between 80 and 85% of the population.
Kurds are the second largest ethnic group in Syria, making up around 10% of the Syrian population and distributed among four regions...with a Yazidi minority that numbers around 40,000...
Turkmen are the third largest ethnic group in Syria, making up around 4-5% of the population. Some estimations indicate that they are the second biggest group, outnumbering Kurds, drawing on the fact that Turkmen are divided into two groups: the rural Turkmen who make up 30% of the Turkmen in Syria and who have kept their mother tongue, and the urban Turkmen who have become Arabised and no longer speak their mother language...
Assyrians are the fourth largest ethnic group in Syria. They represent the original and oldest inhabitants of Syria, today making up around 3-4% of the Syrian population...
Circassians are the fifth largest ethnic group in Syria, making up around 1.5% of the population...
Armenians are sixth largest ethnic group in Syria, making up around 1% of the population...
There are also a small number of other ethnic groups in Syria, including Greeks, Persians, Albanians, Bosnian, Pashtuns, Russians and Georgians... - ↑ BBC (2015). "Who are the Turkmen in Syria?".
There are no reliable population figures, but they are estimated to number between about half a million and 3.5 million.
- ↑ The New York Times (2015). "Who Are the Turkmens of Syria?".
Q. How many are there? A. No reliable figures are available, and estimates on the number of Turkmens in Syria and nearby countries vary widely, from the hundreds of thousands up to 3 million or more.
- ↑ Peyrouse, Sebastien (2015), Turkmenistan: Strategies of Power, Dilemmas of Development, Routledge, p. 62, ISBN 0230115527,
There are nearly one million [Turkmen] in Syria...
- ↑ "The Arabs of Brazil". Saudi Aramco World. September–October 2005. Archived from the original on 26 నవంబర్ 2005. Retrieved 30 January 2013.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ United Nations High Commissioner for Refugees. "UN refugee agency welcomes Brazil announcement of humanitarian visas for Syrians". Unhcr.org. Retrieved 24 July 2014.
- ↑ "Inmigracion sirio-libanesa en Argentina" (in Spanish). Confederación de Entidades Argentino Árabes. Archived from the original on 20 జూన్ 2010. Retrieved 30 January 2013.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 45.0 45.1 45.2 45.3 "Syria - International Religious Freedom Report 2006". U.S. Department of State. 2006. Retrieved 28 June 2009.
- ↑ 46.0 46.1 Drysdale, Alasdair; Hinnebusch, Raymond A. (1991), Syria and the Middle East Peace Process, Council on Foreign Relations, p. 222, ISBN 0876091052
- ↑ Danna, Nissim (December 2003). The Druze in the Middle East: Their Faith, Leadership, Identity and Status. Brighton: Sussex Academic Press. p. 227. ISBN 978-1-903900-36-9.
- ↑ Pipes, Daniel (1 January 1989). "The Alawi Capture of Power in Syria". Middle Eastern Studies. 25 (4): 429–450. JSTOR 4283331.
- ↑ "Death toll in Syria likely as high as 120,000: group". Reuters. 14 May 2013. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 26 నవంబరు 2016.
- ↑ Tomader Fateh (25 October 2008). "Patriarch of Antioch: I will be judged if I do not carry the Church and each one of you in my heart". Forward Magazine. Archived from the original on 2 March 2010. Retrieved 30 January 2013.