డార్లింగ్ కృష్ణ
నాగప్ప సునీల్ కుమార్ (జననం 1985 జూన్ 12), ఆయన ప్రధానంగా కన్నడ చిత్రసీమకు చెందిన భారతీయ నటుడు. ఆయన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్‌లతో సహా అనేక ప్రశంసలను అందుకున్నాడు. ఆయనను వృత్తిపరంగా డార్లింగ్ కృష్ణ అని పిలుస్తారు.[1][2]
డార్లింగ్ కృష్ణ | |
---|---|
జననం | నాగప్ప సునీల్ కుమార్ 1985 జూన్ 12 |
ఇతర పేర్లు | కృష్ణ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
జాకీ (2010)తో డార్లింగ్ కృష్ణ తన సినీ రంగ ప్రవేశం చేశాడు. 2013 చిత్రం మదరంగిలో అతని నటనకు, ఆయన ఉత్తమ పురుష తొలి నటుడిగా సైమా (SIIMA) అవార్డు - కన్నడ నామినేషన్ ను అందుకున్నాడు. తన అరంగేట్రం తర్వాత, ఆయన కన్నడ సోప్ ఒపెరా కృష్ణ రుక్మిణిలో నటించాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం లవ్ మాక్‌టైల్ (2020), దాని సీక్వెల్ లవ్ మాక్‌టైల్ 2 (2022)లతోనూ తన కెరీర్ ఒక మలుపు తిరిగింది.[3]
ఆయన ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ – కన్నడ, సైమా అవార్డు ఉత్తమ చిత్రం – కన్నడలను గెలుచుకున్నాడు. లక్కీ మ్యాన్ (2022), కౌసల్య సుప్రజా రామ (2023)లతో ఆయన మరింత విజయం సాధించాడు.
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుడార్లింగ్ కృష్ణ 1985 జూన్ 12న కర్ణాటకలోని మైసూర్‌లో సునీల్ కుమార్ నాగప్పగా జన్మించాడు.[4][5] అతని తండ్రి నాగప్ప రిటైర్డ్ పోలీసు అధికారి. బెంగళూరులో డార్లింగ్ కృష్ణ ఎంబీఏ పూర్తి చేశాడు.[6]
వ్యక్తిగత జీవితం
మార్చునాగప్ప సునీల్ కుమార్ తన మొదటి కన్నడ సీరియల్ కృష్ణ రుక్మిణి (2011) విజయవంతమైన తర్వాత తన పేరును కృష్ణగా మార్చుకున్నాడు.[7]
డార్లింగ్ కృష్ణ 2013 చిత్రం నామ్ దునియా నామ్ స్టైల్ సెట్స్‌లో నటి మిలానా నాగరాజ్‌ను కలిసాడు.[8] డార్లింగ్ కృష్ణ, తన సహనటి అయిన మిలనా నాగరాజ్‌ను బెంగుళూరు శివార్లలో ఒక ప్రైవేట్ సాంప్రదాయ వేడుకలో 2021 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నాడు.[9][10][11]
మీడియా
మార్చు- కన్నడ చిత్రసీమలో అత్యంత ప్రామిసింగ్ నటుల్లో నాగప్ప సునీల్ కుమార్ ఒకడు. కాగా, అతను కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం మదరంగి అతనికి "డార్లింగ్ కృష్ణ" అనే బిరుదును తెచ్చిపెట్టింది.
- 2020లో బెంగళూరు టైమ్స్ 30 మంది మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో ఆయన 12వ స్థానంలో నిలిచాడు.
- డార్లింగ్ కృష్ణ 2020లో తన సొంత ప్రొడక్షన్ హౌస్ "కృష్ణా టాకీస్"ని ప్రారంభించాడు. లవ్ మాక్‌టైల్ (2020), లవ్ మాక్‌టైల్ 2 (2022) చిత్రాలకు సహ-నిర్మాతగా వ్యవహరించాడు.
మూలాలు
మార్చు- ↑ "Kannada stars take on their character names". Times of India. Retrieved 12 September 2015.
- ↑ "Krishna new hero arrives!". Archived from the original on 11 November 2014. Retrieved 29 September 2014.
- ↑ "Krishna wears multiple hats for love mocktail – The New Indian Express". The New Indian Express. 21 October 2019. Retrieved 7 January 2020.
- ↑ "Darling Krishna Birthday: Darling Krishna's Birthday Celebration, Special Gift from Dil Pasand Film Team". News18 Kannada. Retrieved 12 June 2022.
- ↑ "Happy Birthday Darling Krishna: From 'Madarangi' to 'Love Mocktail', a look at the best movies in the actor's career". Times of India. Retrieved 12 June 2022.
- ↑ DNHS, Vivek M.V. "Darling Krishna is here to stay!". Deccan Herald. Retrieved 30 December 2022.
- ↑ "How actor Sunil Kumar, who debuted with Krishna Rukmini, became Darling Krishna". The Times Of India. Retrieved 15 June 2021.
- ↑ "Real life couple Krishna and Milana open up on working together for 'Love Mocktail'". The News Minute. Archived from the original on 5 ఏప్రిల్ 2020. Retrieved 14 September 2020.
- ↑ "Exclusive: Meet 5 Actors Who Have Promising Futures In Kannada Cinema". The Times of India. Retrieved 13 February 2023.
- ↑ Padmashree Bhat. "ವೈವಾಹಿಕ ಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟ ನಟ ಡಾರ್ಲಿಂಗ್ ಕೃಷ್ಣ, ಮಿಲನಾ ನಾಗರಾಜ್!". Vijay Karnataka. Retrieved 15 February 2021.
- ↑ "KrissMi Wedding: Kannada stars Darling Krishna and Milana Nagaraj tie the knot!". The Times Of India. Retrieved 14 February 2021.