మర్రి కృష్ణా రెడ్డి

(డా.మర్రి కృష్ణా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)


వేద సాహిత్యాన్ని వెలికి తీసి తెలుగు వారికి తేటతెలుగులో నాలుగు వేదాలకు భాష్యాలను అందించిన వారు డా.మర్రి కృష్ణా రెడ్డి.ఈయన వేదగిరి పీఠ సంస్థాపకుడిగా,చతుర్వేద భాష్యముల పరిష్కర్తగా,సిద్ధాంతాలంకారునిగా,వేద సంపాదకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి .

బాల్యం, విద్యాబ్యాసం 

శివానీలమ్మ, బుగ్గారెడ్డి దంపతులకు ఐదవ సంతానంగా మార్గ శిర పౌర్ణమి 16 - 12 - 1967 వ సంవత్సరంలో నర్సయ్యగూడెం,పరిగి మండలం,రంగారెడ్డి జిల్లాలో జన్మించారు.తన పదకొండవ సంవత్సరానికే తండ్రి చనిపోగా,తల్లి ప్రోద్భలంతో ప్రాథమిక విద్యను అభ్యసించారు.తొమ్మిదవ తరగతిలోనే ప్రబోధ గీతంను,పదవ తరగతిలోనే సోమేశ్వర శతకాన్ని రచించారు.పండిత గోపదేవ శాస్త్రి వద్ద నాలుగు సంవత్సరాల పాటు న్యాయ,వైశేషిక,సాంఖ్య,యోగ,వేదాంత శాస్త్రములను,ఈశా,కేన,కఠోప,ముండక,మాండూక్య,ఐతరేయ,శ్వేతాశ్వతర,బృహదారణ్యకాది దశోపనిషత్తులను,మహర్షి దయానంద సరస్వతీకృత సమస్త వైదిక సాహిత్యాన్ని,బాగా అధ్యయనం చేసారు.పండిత గంగారాం వానప్రస్థి గారి వద్ద హిందీ భాషను,వేద సిద్ధతాలను అభ్యసించి,సంస్కృతంలో బి.ఏ విద్యను పూర్తి చేసారు.మనుధర్మ శాస్త్రమును తెనుగించి,పరిశోధించి ఎం.ఏ.ను పూర్తి చేసారు.మహర్షి దయానంద సరస్వతి ప్రతిపాదించిన విద్యా విధానం అనే అంశంపై రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠం,తిరుపతిలో పరిశోధనా పత్రాలను సమర్పించి 2007 లో డాక్టరేట్ పట్టాను పొందారు.

చతుర్వేద సంహిత, వేదభాష్యముల ముద్రణ 

వేద ధర్మ ప్రచార ట్రస్టును ఏర్పాటు చేసి నాలుగు వేల పుటలతో బృహత్గ్రంధంగా చతుర్వేద సంహితను ఋషి,దేవతా,ఛందస్సు,స్వరసహితంగా,మంత్రానుక్రమణికలతో,విస్తృతమైన పీఠికతో ప్రప్రథమంగా నిర్మించి ఆంధ్రలోకానికి అందించ్చారు.బ్రహ్మశ్రీ పండిత మలహిరి సిద్ధాంతాచార్యుల వారి చేత అనువధింపబడిన వేద భాష్యముల ముద్రణా కార్యం మర్రి కృష్ణారెడ్డి సంపాదకత్వంలో పూర్తి అయ్యింది.తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేపరుకు ఆర్థిక సహాయం అందించగా,యజుర్వేద,సామవేద,అధర్వణ వేద భాష్యములను ఆంధ్ర లోకానికి తెలుగు భాషలో అందించారు.ప్రస్తుతం ఋగ్వేదంను పూర్తిగా తెలుగు లోకానికి అందించే పనిలో వున్నారు .

వేదగిరి స్థాపన 

ఆంధ్ర దేశంలో వేద ధర్మ ప్రచారం  కొరకు ఒక నిర్మాణ కేంద్రం అవసరం అని ఎంచి వేదగిరిపై వేదపీఠాన్ని స్థాపించి వేదం మందిరానికి శంకుస్థాపన చేశారు.

వేదగిరిపై చేయ సంకల్పించిన కార్యములు

వేదం మందిర నిర్మాణ 

వేదం వేదాంగ విద్యాలయ స్థాపన 

బృహత్ యజ్ఞ మందిర నిర్మాణం 

వేదాను సంధాన కేంద్ర స్థాపన 

ధ్యాన యోగ కేంద్ర స్థాపన 

వాన ప్రస్త,సన్యాసం,వృద్ధ ఆశ్రమాలను నెలకొల్పుట.

వేద ధర్మ ప్రచార కేంద్ర స్థాపన 

వేదం సాహిత్య నిర్మాణం 

ఆధునిక విద్యతో పాటు గురుకుల పాఠశాల స్థాపన

గోశాల స్థాపన

ఆయుర్వేద ఔషధ నిర్మాణ కేంద్రం 

వేదగిరిని సందర్శనీయ యాత్రా స్థలంగా తీర్చిదిద్దుట.