కోడూరు ప్రభాకర రెడ్డి

(డా. శ్రీ కోడూరు ప్రభాకర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

డా. కోడూరు ప్రభాకర రెడ్డి తెలుగు కవులు. సాహితీ కారులు. వృత్తిపరంగా వైద్యులు[1].

జీవిత విశేషాలు

మార్చు

శ్రీ కోడూరు ప్రభాకరరెడ్డి గారు కడపజిల్లా పాలగిరి గ్రామంలో ఆగస్టు 11 , 1947 న జన్మించారు వీరి తండ్రి శ్రీ కోడూరు చెన్నారెడ్డి గారు, తల్లి శ్రీమతి కోడూరు ఓబులమ్మ గారు .వీరి విద్యార్హత యం.బి.బి.యస్.-యం.డి ,వృత్తి -శిశువైద్యం ,వీరి సహధర్మ చారిణి -శ్రీమతి.పార్వతి - బి .ఎ. వీరి సంతానం కళ్యాణ చక్రవర్తి,- బి .టేక్.,హిమబిందు , బి యస్సీ.,నరేంద్ర కుమార్ రెడ్డి , బి. టేక్ .

శ్రీ ప్రభాకరరెడ్డి గారు వృత్తి రీత్యా శిశు వ్వైద్యులైనప్పటికి వీరి ప్రవ్రుత్తి మాత్రం సాహిత్యం . రేనాటి పలుకుబడులు- పేరుతో డా కోడూరు ప్రభాకర రెడ్డి రేనాటి ప్రాంతపు మూడు వేలకు పైగా పదాలను సేకరించి వాటిని ఆకారాది క్రమంలో పేర్చి, వాటి అర్ధం, సమార్ధక ఆంగ్లపదం ఇస్తూ ఆ పదాన్ని ఎలా వాడారో ఉదాహరణగా ఇచ్చారు.[2]

====

కృతులు

మార్చు
  1. రాగావిపంచి ( ఖండ కావ్యం ) రెండు ముద్రణలు ,
  2. పల్నాటి భారతం ( పద్య కావ్యం ) రెండు ముద్రణలు ,
  3. ద్రౌపది ( గద్యకృతి ) రెండు ముద్రణలు,
  4. హృదయరాగం ( ఖండకావ్యం ) ,
  5. చాటుకవిసార్వభౌమ "శ్రీనాథుని చాటువులు -రెండు ముద్రణలు ,
  6. కవికోకిల "దువ్వూరి రామిరెడ్డి కవిత్వం - వ్యక్తిత్వం ,
  7. కవితారస పానశాల ( వ్యాససంకలనం ) ,
  8. శ్రీనాథ విజయం ( రేడియో నాటికలు ) ,
  9. దేవర ( ఖండకావ్యం ),
  10. బాలగేయాలు ( సంకలనం ) ,
  11. శృంగార తిలకం ( అనుసృజనం ),
  12. అశ్రుగీతి ( అనుసృజనం )
  13. మీరా గీతామృత ధార ( అనుసృజనం )

పురస్కారాలు

మార్చు
  1. ఉండేల విజ్ఞాన పీఠం ( హైదరాబాద్ ) వారిచే "పల్నాటిభారతం " పద్య కావ్యానికి ఉత్తమ కావ్యంగా 25000 రూపాయలు బహుమతి ( 1997 )
  2. సి.పి.బ్రౌన్ ( కడప ) స్మారక పురస్కారం ( 2001 )
  3. శ్రీ నన్నయ భట్టారక పీఠం ( తణుకు ) వారిచే "రాగావిపంచి " పద్యకృతికి ఉత్తమ పద్య గ్రంథ పురస్కారం ( 2005 )
  4. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) ధర్మనిధి పురస్కారం ( 2006 )
  5. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ( హైదరాబాద్ ) సాహిత్య పురస్కారం ( 2009 ) -నాటక ప్రక్రియలో "శ్రీనాథ విజయం " గ్రంథానికి
  6. బాల శౌరి రెడ్డి సమ్మాన్ పురస్కారం ( 2010 )
  1. శ్రీ నన్నయభట్టారక పీఠం - తణుకు -డా.జి.యస్వీ.ప్రసాద్ -పురస్కారం ( 23-03-2015).

మూలాలు

మార్చు
  1. "AUTHOR'S PROFILE". Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-28.
  2. పదిమందిని ఉసిగొల్పే ప్రయత్నం[permanent dead link]

ఇతర లింకులు

మార్చు