బైబిల్

(క్రొత్త నిబంధన నుండి దారిమార్పు చెందింది)

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చదివే గ్రంథం బైబిలు. దీనిని పరిశుద్ధ గ్రంథమని కూడా అంటారు. బైబిల్ అనగా గ్రీకు భాషలో వైదిక గ్రంథాల సంహిత. బైబిలు గ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటూ వ్రాయబడింది. బైబిల్ లో మూడు రకములు ఉన్నవి - హెబ్రియ బైబిలు, గ్రీకు బైబిలు, క్రిస్టియన్ బైబిలు.

గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్

భాగం వ్యాసాల క్రమం


 
యేసు
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్

 · క్రీస్తు తెలియని సంవత్సరాలు

మూలాలు
చర్చి · కొత్త కాన్వెంట్
అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక
బైబిల్
పాత నిబంధన · కొత్త నిబంధన
గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా
క్రైస్తవ ధర్మం
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ)
చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్
చరిత్ర, సాంప్రదాయాలు
ప్రథమ · సంఘాలు · వర్గాలు · మిషనరీలు
తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు
తెగలు
క్రైస్తవ మత విషయాలు
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం
ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు
సంగీతం · లిటర్జీ · కేలండరు
చిహ్నాలు · కళలు · విమర్శ
క్రైస్తవ పోర్టల్

హెబ్రియ బైబిలు (Tanak) :

హెబ్రియ బైబిలులో 24 పుస్తకాలు తోరా (ధర్మ శాస్త్రం), నివిం (ప్రవక్తలు), కెటువిం (రచనలు) అను 3 భాగాలుగా విభజింపబడినవి. హెబ్రియ బైబిలును యూదులు (Jews) చదువుతారు. ఈ బైబిలులో దేవుడి పేరు యెహోవా, తండ్రిగా పేర్కొనబడటం జరిగింది. హెబ్రియ బైబిలు యూదుల మతం (Judaism) యొక్క పవిత్ర గ్రంథం.

హెబ్రియ బైబిలు ఆర్యుల వేద కాలానికి చెందినది, అనగా సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో వ్రాయబడింది. గ్రాంధిక హీబ్రూ (Old Hebrew) భాషలో వ్రాయబడిన పాత నిబంధనలో యూదుల ఆచారాలు, యూదులకు తమ దేవుడైన యెహోవా చెప్పిన నియమ నిబంధనలు ఉంటాయి. హెబ్రియ బైబిలులో మొదటి 5 పుస్తకాలు మోషే (Moses) ప్రవక్తచే వ్రాయబడినవి. మొదటి మానవులైన అదాము (Adam) అవ్వ (Eve) ల జీవితం, నోవాహు (Noah) అను దైవ భక్తుడి కాలంలో జల ప్రళయం (Great Flood), దేవుడి శక్తితో మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దారి ఏర్పరచడం, దేవుడి పది ఆజ్ఞలు మొదలైనవి పాత నిబంధనకు చెందినవి. వేద కాలములో వలే ఇందులో కూడా జంతు బలులు పేర్కొనబడ్డాయి.

గ్రీకు బైబిలు (Septuagint) :

4 వ శతాబ్దంలో టొలెమీ II (Ptolemy II) ఆజ్ఞ ప్రకారం యూదుల కులానికి చెందిన కొంతమంది రచయితలు తమ హెబ్రియ బైబిల్ ను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ బైబిల్ లో హెబ్రీయ బైబిల్ లో లేని పుస్తకాలు కూడా ఉన్నాయి. తొబితు, జుడితు, సలోమాను జ్ఞానము, సిరాచు కుమారుడైన యేసు జ్ఞానము, బరూచు, యిర్మియా పత్రిక, అజారియా ప్రార్థన, ముగ్గురు చిన్నారుల పాట, సుసన్నా, బెల్, డ్రాగన్, ఎస్తేరు, 1 మక్కాబీయులు, 2 మక్కాబీయులు, 3 మక్కాబీయులు, 4 మక్కాబీయులు, 1 ఎస్ద్రాసు, ఒదెసు, మనాషె ప్రార్థన, సలోమాను కీర్తనలు, 151 వ కీర్తన అధనంగా ఉన్నాయి. ఇవి హెబ్రియ బైబిల్ లో లేవు. ఈ బైబిల్ లో చాలా పుస్తకాలను రోమన్ కేథలిక్కులు, సనాతన తూర్పు సంఘం వారు అంగీకరిస్తారు.

క్రైస్తవ బైబిలు (Christian Bible) :

క్రైస్తవ బైబిలును క్రైస్తవులు, అనగా ఏసుక్రీస్తును అరాధించేవారు మాత్రమే చదువుతారు. క్రైస్తవ బైబిలులో మొదటి భాగం హెబ్రియ బైబిలు. దీన్ని క్రైస్తవులు పాత నిబంధన అని కూడా అంటారు. హెబ్రియ బైబిలుకు చెందిన 24 పుస్తకాలు క్రైస్తవ బైబిలులో 39 పుస్తకాలుగా విభజింపబడినవి. దీనిని బట్టి యూదుల మతం క్రైస్తవ మతంలో ఒక భాగమని చెప్పవచ్చు. పాత నిబంధనకు చెందిన యెషయా గ్రంథం 7:14 లో క్రీస్తు రాక గురించి ముందే ప్రసావించడం విశేషం.

ఇక రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు - 4 వైదిక సువార్తలు, అపోస్తలుల కార్యాలు, 21 పత్రికలు, ప్రకటన గ్రంథము ఉంటాయి. క్రొత్త నిబంధన సుమారు 34 A.D లో ఏసు క్రీస్తు నిర్యాణం చెందిన కొద్ది కాలం తర్వాత గ్రీకు భాషలో వ్రాయబడింది. ఇందులో యూదుడైన ఏసుక్రీస్తు వంశావళి, బాల్యం, మహిమలు, శిలువయాగం, తిరిగి లేవడం, సువార్త ప్రకటన వంటివి ఉంటాయి.

ఇతర విషయాలు

మార్చు

బైబిలు గ్రంథంలో ఏ భాగమూ లిఖితం కాక మునుపు వృత్తాంతాలను ప్రజలు కథలుగా చెప్పుకొనేవారు. యూదుల లేఖనాల్లో చాలా భాగాలు ఈ వృత్తాంతాలే. పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుక చేసుకున్న అనంతరం (1800 B.C) వారు వృత్తాంతాలను, ప్రవచనాలను లిఖించడం ఆరంభించారు. పాత నిబంధన యూదులకు ధర్మశాస్త్రము (రాజ్యాంగము) గా వ్యవహరించబడింది. యేసు క్రీస్తు కాలంలో అది సవరణలు చేయబడి క్రొత్త నిబంధనగా చేయబడింది.

పాత నిబంధన భాగం హెబ్రీయ భాషలో వ్రాయబడగా, క్రొత్త నిబంధన భాగం క్రీస్తు శకంలో గ్రీకు భాషలో వ్రాయబడింది. బైబిలులోని ప్రతి వాక్యానికి అదే అధ్యాయానికి లేదా వేరే అధ్యాయానికి లేదా వేరే పుస్తకానికి చెందిన మరో వాక్యంతో సంబంధం ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో బైబిలు మొదటిది అని చెప్పడంలో సందేహం లేదు. అత్యధిక విమర్శకులు కలిగిన పుస్తకం కూడా బైబిలే. క్రైస్తవుల నమ్మకం ప్రకారం బైబిలు పదునైన రెండంచుల ఖడ్గం. బైబిలు చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందని, రక్షణగా ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా లేదా విజయం సిద్ధిస్తుందని క్రైస్తవులు నమ్ముతారు. బైబిలులోని పాత నిబంధన గ్రంథములోని వృత్తాంతాలు చరిత్ర సంఘటనలు కాకపోయినా సామాజిక పరిస్థితులు చూపిస్తాయి. ఏసు క్రీస్తు జీవితము చరిత్రయే అయినా క్రొత్త నిబంధన లిఖించబడినది ఏసు క్రీస్తు మరణించిన తర్వాత కాలంలోనే. హిందూ వేదాలవలే బైబిలు కూడా త్రైత సిద్ధాంతమునకు చెందినది.

మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల ఇంగ్లండు చర్చివారు ప్రొటస్టెంట్లు, కేథలిక్కులు, తూర్పుసనాతన సంఘం, పెంతికోస్తు, బాప్టిస్టు వంటి ఎన్నో సంఘాలుగా చీలిపోయారు. ప్రొటస్టెంట్లు ఏసుక్రీస్తు బోధనలు, మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. కేథలిక్కులు బాల్యంలో యేసు చేసిన మహిమలు, తల్లి మేరీ చేసిన మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. నేడు ప్రపంచంలో సుమారు అన్ని భాషల్లోను బైబిలు అచ్చువేయబడుచున్నది.

కేథలిక్కు బైబిల్ అధనపు అధ్యాయాలు

మార్చు

మొదటి ఎస్డ్రాసు, రెండవ ఎస్డ్రాసు, తోబితు, యూదితు, సిరాకు పుత్రుడైన యేసు జ్ఞానం, బారూకు, ముగ్గురు పరిశుద్ధ పిల్లల పాటలు, సూసన్న చరిత్ర, బేలు, డ్రాగనుల చరిత్ర, మనస్సేప్రార్థన, మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు

ప్రొటస్టెంట్ బైబిలులో ఇవి ఉండవు.

పాత నిబంధన అధ్యాయాలు

మార్చు

బైబిల్లోని మొదటి భాగాన్ని పాత నిబంధన గ్రంథం అని అంటారు.ఇందులో ఇశ్రాయేలీయుల యూదుల యథార్థ గాథలు ఆజ్ఞలు సామెతలు కీర్తనలు, దేవుడు వాళ్లను ఎలా ఎంచుకున్నాడో తెలిపే చరిత్ర ఉంటాయి.ఇవన్నీ[హీబ్రూ]లో రాశారు. ఇవి 39 పుస్తకాలు :

ఆది పంచకము [పంచ కాండములు} ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము,. చరిత్ర గ్రంథాలు ( యెహూషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యోషయా, యిర్మియా, విలాపవాక్యములు, యెజెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ

కొత్త నిబంధన

మార్చు

రెండవ భాగాన్ని కొత్త నిబంధన[permanent dead link] గ్రంథం అంటారు. గ్రీకులో యేసుక్రీస్తు జీవితచరిత్రనే నాలుగు సువార్తలుగా నలుగురు రాశారు. అపోస్తలుడైన పౌలు వివిధ సంఘాలకు రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి.27 పుస్తకాలు ఇవి:

మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, I కొరంథీయులకు పత్రిక, కొరంథీయులకు పత్రిక, గలతీయులకు పత్రిక, ఎఫసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, కొలొస్సైయులకు పత్రిక, 1 థెస్సలొనీకైయులకు పత్రిక, 2 థెస్సలొనీకైయులకు పత్రిక, I తెమోతికి పత్రిక, II తెమోతికి పత్రిక, తీతుకు పత్రిక, ఫిలేమోనుకు పత్రిక, హెబ్రీయులకు పత్రిక, యాకోబు పత్రిక, I పేతురు పత్రిక, II పేతురు పత్రిక, I యోహాను పత్రిక, II యోహాను పత్రిక, III యోహాను పత్రిక, యూదా పత్రిక, ప్రకటన గ్రంథము

బైబిలుకు చెందని పుస్తకాలు

మార్చు

1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం ఈజిప్టులోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్కతో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు.

ఇతర గ్రంథాలతో పోలికలు

మార్చు
  • హిందూ సాహిత్యం వలే బైబిలు కూడా త్రైత సిద్ధాంతానికి చెందినది అని భావన.
  • బైబిలు ప్రకారం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిమూర్తులైతే, (కానీ Trinity బైబి ల్ బొధ కాదు) వేదాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు.
  • పాత నిబంధనలో ఉన్న జంతు బలి అర్పణలు హిందూ వేదాల్లో కూడా ఇవ్వబడినవి.
  • పాత నిబంధనలో ఆదాము ఆది మానవుడు
  • హిందూ గ్రంథాల్లో పేర్కొన్న స్వర్గలోకాన్ని బైబిలులో పరలోకంగా పిలుస్తారు.
  • బైబిలు విగ్రహారాధన ఖండిస్తుంది, హిందు మతంలో విగ్రహారాధన సాధారణం.
  • బైబిల్ ప్రకారం పాపుల్ని పాపంనుండి రక్షించాలి. హిందూ మతము లో పాపక్షమాపణ లేదు
  • పాత నిబంధన ప్రకారం నోవాహు అను దైవ భక్తుడి కాలంలో జరిగిన జల ప్రళయం మత్స్య పురాణంలోను, ఖురాన్ లోను, సుమేరియన్ల కావ్య గ్రంథమైన గిల్గమేష్ లోను, ఎన్నో ఇతర పుస్తకాల్లోను ఇవ్వబడింది.

తెలుగులో బైబిలు

మార్చు
 
సామాన్య ప్రార్థనల పుస్తకము - 1880లో ముద్రిచబడింది. [1]

1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంథము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు. 1842లో S.P.G. తెలుగు మిషను కడప జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్థనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు. 1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్థనల పుస్తకాన్ని ప్రచురించారు. కడప, ముత్యాలపాడులలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.జాన్ క్లే మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.

అంతర్జాలంలో తెలుగు బైబిల్

మార్చు

సజీవవాహిని సంస్థ తెలుగు బైబిల్ [1] అంతర్జాలంలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చూడండి

మార్చు

వనరులు

మార్చు
  1. "అంతర్జాలంలో సజీవవాహిని సంస్థ తెలుగు బైబిల్". Archived from the original on 2012-01-30. Retrieved 2012-01-27.
"https://te.wikipedia.org/w/index.php?title=బైబిల్&oldid=4281138" నుండి వెలికితీశారు