దిన్షా దాదాభాయి ఇటాలియా హైదరాబాదుకు చెందిన ప్రముఖ పార్సీ వ్యాపారస్తుడు, రాజ్యసభ సభ్యుడు. దిన్షా ఇటాలియా 1882, మార్చి 10న అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోని సూరత్ జిల్లాకు చెందిన ఛిక్లీలో జన్మించాడు.[1] ఈయన తండ్రి దాదాభాయి ఇటాలియా నిజాం పరిపాలనలోని హైదరాబాదు రాజ్యంలో స్థిరపడిన వ్యాపారస్తుడు. దిన్షా ఇటాలియా విద్యాభ్యాసం నిజాం కళాశాలలో సాగింది.[1] ఈయన భార్య బాయిమాయి దేభర్. ఈయనకు ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు.[2]

దిన్షా ఇటాలియా హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1952, ఏప్రిల్ 3 నుండి 1956 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఈయన 1964, సెప్టెంబరు 7న మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Parliament of India - Rajyasabha ho's Who. New Delhi: Rajyasabha Secretariat. 1955. p. 81. Retrieved 29 December 2014.
  2. 2.0 2.1 "Rajya Sabha Members Profiles" (PDF). rajyasabha.nic.in. Retrieved 29 December 2014.