డి.వి.గుండప్ప

కన్నడ రచయిత

డివిజిగా ప్రసిద్ధి చెందిన దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప ఒక కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త. ఇతని సుప్రసిద్ధమైన రచన మంకు తిమ్మన కగ్గ మధ్యయుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞుని వచనాలను పోలి ఉంటాయి.[2][3][4]

డి.వి.గుండప్ప
DVG.jpg
తపాలాబిళ్ళపై డి.వి.గుండప్ప
జననందేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప
(1887-03-17) 1887 మార్చి 17
ములబాగళ్, మైసూరు రాజ్యం, బ్రిటీష్ ఇండియా
మరణం1975 అక్టోబరు 7 (1975-10-07)(వయసు 88)
ఇతర పేర్లుడివిజి
వృత్తితాత్వికుడు, రచయిత, కవి, పాత్రికేయుడు
ప్రసిద్ధులుమంకు తిమ్మన కగ్గ, మరుళ మునియన కగ్గ
జీవిత భాగస్వామిభాగీరతమ్మ[1]

ప్రచురణలు[5]సవరించు

కవిత్వంసవరించు

 • వసంత కుసుమాంజలి (1922)
 • నివేదన (1942)
 • కవితె
 • ఉమరన ఒసగె
 • మంకుతిమ్మన కగ్గ
 • మరుళ మునియన కగ్గ[6]
 • శ్రీరామపరీక్షణం
 • అంతఃపుర గీతె
 • గీత శాకుంతల
 • కేతకీ వన (1973)

వ్యాసాలుసవరించు

 • జీవన సౌందర్య మత్తు సాహిత్య
 • సాహిత్య శక్తి
 • సంస్కృతి
 • బాళిగొందు నంబికె

నాటకాలుసవరించు

 • విద్యారణ్య విజయ
 • జాక్ కేడ్
 • మాక్బెత్
 • కనకలోక
 • తిలోత్తమె

జీవిత చరిత్రలుసవరించు

 • దివాన్ రంగాచార్లు
 • గోపాలకృష్ణ గోఖలే
 • విద్యారణ్యర సమకాలీనరు
 • జ్ఞాపక చిత్రశాలె 6 భాగాలు
 • హలవు మహనీయరు
 • మైసూరిన దివానరు
 • కళోపాసకరు

రాజనీతి శాస్త్రంసవరించు

 • రాజ్యాంగ తత్త్వగళు
 • రాజకీయ ప్రసంగగళు1 & 2
 • రాజ్య శాస్త్ర
 • వృత్త పత్రికె
 • Principles of Constitution
 • Probity in Public Life

ఆధ్యాత్మిక రచనలు[5]సవరించు

 • పురుషసూక్త
 • దేవరు
 • ఋత, సత్య మత్తు ధర్మ
 • ఈశోపనిషత్

బాలసాహిత్యంసవరించు

 • ఇంద్రవజ్ర
 • బెక్కోజి

విశేషాలుసవరించు

ఇతడు "శ్రీమద్ భగవద్గీత తాత్పర్య"[7] అనే పుస్తకాన్ని వ్రాశాడు. దీనికి "జీవన ధర్మ యోగ" అనే మరో పేరు కూడా ఉంది. ఈ పుస్తకానికి 1967లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[8]

ఇతని శతజయంతి సందర్భంగా ఇతని సమగ్ర సాహిత్యాన్ని 11 సంపుటాలలో "డివిజి కృతి శ్రేణి" పేరుతో కన్నడ సాహిత్య అకాడమీ, కర్ణాటక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రచురించింది.[8]

ఇతడు 1932లో మద్దికెరిలో నిర్వహించిన 18వ కన్నడ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు.[9]

ఇతడు గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ (GIPA) అనే సంస్థను బెంగళూరులోని బసవనగుడి, బుల్ టెంపుల్ రోడ్డులో ప్రారంభించాడు. ఈ సంస్థ భారతీయ లలితకళలను ప్రోత్సహిస్తున్నది.[9] ఈ సంస్థ మేధావులను, సామాన్య ప్రజలను, విమర్శకులను ఒక చోట చేర్చి సామాజిక సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించే అవకాశాన్ని కల్పించింది.[10]ఉదహరింపు పొరపాటు: సరైన <ref> ట్యాగు కాదు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువ

ఇతడు 1975, అక్టోబర్ 7వ తేదీన మరణించాడు..[11][12][13]

పత్రికా రంగంసవరించు

డివిజి 1906-07లో పత్రికారంగంలోని అడుగు పెట్టాడు. ఇతడు "భారత్", "కర్ణాటక" అనే కన్నడ వార్తాపత్రికలను ప్రారంభించాడు.[1][9] "సుమతి" అనే వారపత్రికను నడిపాడు. "సుమతీ గ్రంథమాలె" పేరుతో ఒక ప్రచురణ సంస్థను ఆరంభించి ఎనిమిది నెలల వ్యవధిలో 12 చిన్న పుస్తకాలను వెలువరించాడు. వాటిలో దివాన్ రంగాచార్లు జీవితచరిత్ర అందరి మన్ననలను పొందింది[1]"ది కర్ణాటక" అనే ఆంగ్ల పత్రికను వారానికి రెండుసార్లు ప్రచురించేవాడు. ఈ పత్రిక తొలి సంచిక 1913, ఏప్రిల్ 2న దివాన్ విశ్వేశ్వరయ్య సహకారంతో ప్రకటించాడు. ఒక ఏడాది తరువాత ఈ పత్రికలో కన్నడ వ్యాసాలను కూడా ప్రచురించడం మొదలుపెట్టాడు. ఈ ఆంగ్లపత్రిక దేశం నలుమూలలనుండి ఇతనికి మంచి పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. సరియైన ప్రోత్సాహం లేక పోవడం వల్ల 1921లో ఈ పత్రికను మూసివేయవలసి వచ్చింది.[1]

ఇతని పత్రికలలోని సారాంశాన్ని అంతా "వృత్త పత్రికె" అనే పేరుతో ఒక గ్రంథంలో వ్రాసి 1928లో విడుదల చేశాడు.[1]

పురస్కారాలు, గుర్తింపులుసవరించు

 • 1974లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది.[14]
 • 1970లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కన్నడ సాహిత్యంలో ఇతడు చేసిన కృషికి రూ.90,000 నగదు పురస్కారంతో బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో ఘనంగా సత్కరించింది.
 • 1988లో భారత తపాలా శాఖ ఇతని స్మారక తపాలాబిళ్ళను విడుదల చేసింది.[15]
 
డి.వి.గుండప్ప విగ్రహం, బగుల్ రాక్ పార్క్, బసవనగుడి, బెంగళూరు.
 • 2003లో బెంగళూరులోన్ బసవనగుడి బగుల్ రాక్ పార్క్‌లో ఇతని విగ్రహాన్ని ప్రతిష్టించింది.[16][17]
 • బెంగళూరు, బసవనగుడిలోని ఇతని నివాసం ఉన్న వీధి పేరును మార్చి డివిజి రోడ్డు అని నామకరణం చేశారు.[12][18]

Referencesసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 జి.వెంకటసుబ్బయ్య (10 September 1995). డి.వి.గుండప్ప. సాహిత్య అకాడమీ. ISBN 81-260-1386-9.
 2. Sahitya Akademi (1988), p 1057
 3. Murthy (1992), pp. 173, 174, 178, 190
 4. Sahitya Akademi (1988), p. 1437
 5. 5.0 5.1 D. V. Gundappa (1970) [1953]. Ishopanishat. Kavyalaya Publishers, Mysuru. p. 53.
 6. "Marula muniyana kagga".
 7. "The Gita for Every Man". Yabaluri.org. Archived from the original on 1 January 2014. Retrieved 12 February 2013.
 8. 8.0 8.1 Jyotsna Kamat. "Complete works of D.V.Gundappa". kamatdotcom. Retrieved 2013-08-02.
 9. 9.0 9.1 9.2 Vikas Kamat. "D.V. Gundappa". kamatdotcom. Retrieved 2013-08-02.
 10. Sastri, S. Srikanta. "Featured: S. R. Ramaswamy". A Brief Biographical Sketch of S. R. Ramaswamy. www.srikanta-sastri.org. Retrieved 4 December 2013.
 11. "D.V.G ( Dr. D V Gundappa )". Archived from the original on 5 November 2012. Retrieved 2013-08-12.
 12. 12.0 12.1 "Retaining the old world charm". New Indian Express. Retrieved 2013-08-12.
 13. "Mulbagal is cold to installation of DVG statue near KEB Circle". Deccan Herald. Retrieved 2013-08-12.
 14. "Padma Bhushan Awardees". Archived from the original on 2014-08-09. Retrieved 2017-09-23.
 15. "Commemorative stamp of Gundappa". Indianpost.com. 17 March 1988. Retrieved 2013-02-12.
 16. "Renovated Bugle Rock Park opens". The Times of India.
 17. "A park where legends met". Archived from the original on 2016-03-05. Retrieved 2017-09-23.
 18. "The day Sir MV blackmailed DVG". Our writing in articles. Retrieved 2013-08-12.

బయటి లింకులుసవరించు