డి.వి.సదానంద గౌడ

భారత రాజకీయ నాయకుడు

డీవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన డి.వి.సదానంద గౌడ మార్చి 18, 1953న[1] కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మండెకోలులో[2] జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 1988 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందినారు. 1994లో తొలిసారి పుత్తూరు నుంచి విజయం సాధించి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో రెండో సారి కూడా అదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా వ్యవహరించారు. 2003లో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. 2004లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నుకయ్యారు. 2009లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి రెండవసారి లోకసభకు ఎన్నికైనారు.[3] బి.ఎస్.యడ్యూరప్పను లోకాయుక్త తప్పుపట్టడంతో పార్టీలో వివాదరహితుడైన[4] సదానందగౌడకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ఆగష్టు 4, 2011న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2014లో 16వ లోకసభకు ఎన్నికై 2014 మే 26 నుండి నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్ర రైల్వే, న్యాయశాఖ మంత్రిగా నిర్వహించాడు.. ఆయన 14 నవంబర్ 2018న రెండవసారి మోడీ ప్రభుత్వంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5]ఆయన 7 జులై 2021 న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[6]

డి.వి.సదానంద గౌడ
డి.వి.సదానంద గౌడ


కేంద్రమంత్రి
పదవీ కాలం
2014, మే 26 - 7 జులై 2021
నియోజకవర్గం ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-18) 1953 మార్చి 18 (వయసు 71)
మండెకోలు, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి దత్తి
సంతానం ఒక కుమారుడు
వెబ్‌సైటు sadanandagowda.com
మే 26, 2014నాటికి

మూలాలు మార్చు

  1. http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=3979
  2. http://sadanandagowda.com/
  3. సాక్షి దినపత్రిక, తేది 04-08-2011
  4. ఈనాడు దినపత్రిక, తేది 04-08-2011
  5. Sakshi (13 May 2021). "టీకా కొరత.. మేం ఉరేసుకోవాలా ఏంటి: కేంద్ర మంత్రి". Sakshi. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  6. Namasthe Telangana (7 July 2021). "కేంద్ర మంత్రులు రవి శంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవదేకర్ రాజీనామా". Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.


మూలాలు మార్చు