నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజగుట్టలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి.

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) (నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పంజాగుట్టలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి.[1] 1961లో నిర్మించబడిన ఈ ఆసుపత్రికి స్థాపకుడైన హైదరాబాదు నిజాం పేరును పెట్టారు. దీనిని యువరాణి దుర్రేషేవర్ ప్రారంభించింది.[2]

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)
నిజాం హాస్పిటల్
రకంరాష్ట్ర శాసనసభ చట్టం
స్థాపితం1961
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ
అథ్లెటిక్ మారుపేరునిమ్స్
అనుబంధాలుయుజీసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, భారతీయ విశ్వవిద్యాలయాల అసోసియేషన్
జాలగూడుhttp://nims.edu.in/

చరిత్ర

మార్చు

నిమ్స్‌ అసలు పేరు బొక్కల దవాఖాన. నిజాం ఆర్థోపెడిక్ ఆసుపత్రిని 1964, డిసెంబరు 22న అప్పటి కేంద్ర రైల్వేమంత్రి ఎస్.కె. పాటిల్ ప్రారంభించాడు. ఆస్పత్రి తొలి సూపరింటెండెంట్‌గా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ఎం. రంగారెడ్డి, ఆర్థోపెడిక్స్ కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రి నిర్మించేలా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను ఒప్పించి, నిజాం ట్రస్ట్‌ కింద స్థలం కేటాయింపు చేయించి, దాని నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించాడు. నిజాం ఛారిటబుల్ ట్రస్ట్ ఈ అసుపత్రిని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించే వరకు డాక్టర్ రంగారెడ్డి ఆసుపత్రి నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[3][4]

నిర్వహణ

మార్చు

నిమ్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపబడి పాలక మండలి, కార్యనిర్వాహక మండలి, డైరెక్టర్, ఇతర చట్టబద్దమైన సంస్థల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. గత 20 సంవత్సరాలుగా ప్రతినెల "ది క్లినికల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" పత్రికను ప్రచురిస్తుంది.[5]

ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తోంది. 2014-15లో 185 కోట్లు, 2022లో 242 కోట్లు, 2023లో 290 కోట్లు కేటాయింపులు జరిగాయి.[6]

 
1961లో మొరార్జీ దేశాయి వేసిన శంకుస్థాన రాయి

కోర్సులు

మార్చు

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తించబడిన 40 విభాగాలలో ఎండి, ఎంఎస్, ఎం.సిహెచ్, డి.ఎం, పిహెచ్.డి కోర్సులను నిర్వహించి, ధృవపత్రాలను కూడా ఇస్తుంది. ఇవేకాకుండా పారామెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు ఇందులో ఉన్నాయి.

సదుపాయాలు

మార్చు

2014 నాటికి 900 పడకలు ఉండగా, వాటిని 1489కి పెంచారు. 2014 నాటికి 111 మంది బోధనా సిబ్బంది ఉండగా 2022 చివరినాటికి 264కు పెంచారు. గతంలో రెసిడెంట్‌ డాక్టర్లు ఏటా 82 మందిని కేటాయించగా, ప్రస్తుతం 169 మందిని కేటాయిస్తున్నారు.[6]

నిమ్స్‌ ఆస్పత్రిలో 5 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన పీడియాట్రిక్, కార్డియాలజీ యూనిట్‌తోపాటు 200 పడకల ఐసీయూ, వెంటిలేటర్లు, ఇతర సౌకర్యాలను 2022 జూన్ 23న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, రోటరీ క్లబ్‌ ఆఫ్ జూబ్లీహిల్స్ సీఎండీ వెంకట్ జాస్తి పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.[7]

డైరెక్టర్లు

మార్చు

ఆసుపత్రి నిర్వహణకు డైరెక్టర్లను నియమించారు.[8]

 1. కాకర్ల సుబ్బారావు (1985-1990)
 2. ఐ. దినకర్ (ఇన్‌ఛార్జి, 1990)
 3. డి. రాజా రెడ్డి (1990-1993)
 4. బి.వి. రామారావు (ఇన్‌ఛార్జి, 1993)
 5. ఐ. దినకర్ (1993-1996)
 6. కె. ఈశ్వర ప్రసాద్ (ఇన్‌ఛార్జి, 1996-1997)
 7. వి.ఎస్ భాస్కర్ (1997)
 8. కాకర్ల సుబ్బారావు (1997-2004)
 9. పి. రాజగోపాల్ (2004)
 10. ప్రసాద రావు (2004-2010)
 11. పివి నరసింహారావు రమేష్ (2010)
 12. ప్రశాంత మహాపాత్ర (2010–2011)
 13. ధర్మ రక్షక్ (2011–2013)
 14. అజయ్ సాహ్నీ (ఇన్‌ఛార్జి, 2013)
 15. లావు నరేంద్రనాథ్ (2013–2015)
 16. కె. మనోహర్ (2015-ప్రస్తుతం)[9]

పూర్వ విద్యార్థులు

మార్చు
 1. శ్రీ భూషణ్ రాజు[10]

రికార్డులు

మార్చు

మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌గా మారిన ఈ ఆసుపత్రిలో కిడ్నీతోపాటు కాలేయం(లివర్‌), గుండె (హార్ట్‌), ఊపిరితిత్తులు (లంగ్‌) మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించబడుతున్నాయి. అవయవ మార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు కేటాయిస్తూ పూర్తి ఉచితంగా నిర్వహించడంతోపాటు రోగుల‌కు జీవితాంతం అవసరమయ్యే మందులను ఉచితంగా అంజేస్తున్నది.

 • 2022 డిసెంబరు నెల19న సాయంత్రం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు 24 గంట‌ల్లో నిమ్స్ లో నాలుగు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చికిత్సలు జరిగాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరపడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రతి ఆరు గంటలకు ఒక కిడ్నీ మార్పిడి చొప్పున 17 మంది వైద్యుల బృందంతో కలిసి 24 గంటల్లో మూడు కడావర్‌, ఒకటి లైవ్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. గ‌త నాలుగైదు సంవ‌త్సరాల నుంచి డ‌యాల‌సిస్ చికిత్స పొందుతున్న బాధితుల‌కు బ్రెయిన్ డెడ్ అయిన ముగ్గురు రోగుల నుంచి కిడ్నీల‌ను మార్పిడి, ఇంకోకరు బ‌తికుండ‌గానే కిడ్నీని దానం చేశారు. 10 ల‌క్ష‌ల నుంచి రూ. 15 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు ఖ‌ర్చయ్యే ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చికిత్స‌ను ఆరోగ్య శ్రీ ప‌థ‌కంలో పేద రోగుల‌కు ఉచితంగా విజ‌య‌వంతంగా నిర్వ‌హించబడ్డాయి.[11][12]
 • 2023 జనవరి నెలలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించి, దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుప‌త్రిగా జాతీయ రికార్డు సాధించింది. నిమ్స్‌ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నేతృత్వంలో డాక్టర్‌ సీహెచ్‌ రామ్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ జీ రామచంద్రయ్య, డాక్టర్‌ జీవీ చరణ్‌ కుమార్‌, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్‌ పద్మజ, డాక్టర్ జే నిర్మల నేతృత్వంలోని అనస్థీషియా విభాగం, డాక్టర్‌ టీ గంగాధర్‌, డాక్టర్ భూషణ్ రాజ్ నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం వారికి స‌హ‌క‌రించారు.[13]

'దశాబ్ధి' వైద్య భవనం

మార్చు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'దశాబ్ది వైద్య భవనం' పేరుతో 1571 కోట్ల రూపాయలతో, 2 వేల పడకలతో నిమ్స్‌లో కొత్త బ్లాక్‌ నిర్మాణం జరగనుంది. 33 ఎకరాల్లో చేపట్టనున్న నిమ్స్‌ విస్తరణలో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా మొత్తం మూడు బ్లాకులు నిర్మించనున్నారు. భవిష్యత్తుకనుగుణంగా ఏకంగా 8 అంతస్తుల్లో ఓపీ బ్లాక్‌ను, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్థులతో బ్లాక్‌ను, ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్‌ ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనంలో 30 ఆపరేషన్‌ థియేటర్లు, ఆక్సిజన్‌ సరఫరాతో 2 వేల పడకలు (1,200 ఆక్సిజన్‌ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు), ప్రత్యేక గది కావాలనుకునే రోగుల కోసం 300 పేయింగ్‌ రూమ్స్‌ వంటివి అందుబాటులోకి రానున్నాయి.[14]

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలులో భాగంగా 2023, జూన్ 14న నిమ్స్ ఆసుపత్రి వేదికగా జరిగిన తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ, ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, పశు సంవర్థక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలతోపాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.[15]

మూలాలు

మార్చు
 1. "NIZAM'S INSTITUTE OF MEDICAL SCIENCES". Nizam's Institute of Medical Sciences. Retrieved 21 April 2020.
 2. http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/103749/12/12_chapter%205.pdf
 3. "Heritage enthusiasts pay rich tributes to seventh Nizam". The Hindu. 6 April 2018.
 4. "Nizam's Institute of Medical Sciences Act, 1989" (PDF). Andhra Pradesh Gazette. 29 April 1989. Archived from the original (PDF) on 26 October 2017. Retrieved 21 April 2020.
 5. https://www.nims.edu.in/depart_details.php?tab=research&dep_id=NTI=
 6. 6.0 6.1 telugu, NT News (2023-06-14). "NIMS | పేదల కార్పొరేట్‌ నిమ్స్‌.. అత్యాధునిక వైద్యానికి కేరాఫ్‌ అడ్రస్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-14. Retrieved 2023-06-14.
 7. "నిమ్స్‌కు అనుబంధంగా మరో 2వేల పడకల ఆస్పత్రి: మంత్రి హరీశ్‌". ETV Bharat News. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.
 8. "Ex-Directors". nims.edu.in. Nizam's Institute Of Medical Sciences. Retrieved 21 April 2020.
 9. "Dr K Manohar Appointed NIMS Director - Telangana State Info". Telangana State Information. 28 August 2015. Archived from the original on 25 జనవరి 2021. Retrieved 21 April 2020.
 10. Raju, Sree Bhushan. "Academics Profile". www.drsreebhushan.com. Archived from the original on 26 June 2018. Retrieved 21 April 2020.
 11. telugu, NT News (2022-12-21). "నిమ్స్‌లో 24 గంట‌ల్లో నాలుగు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్లు". www.ntnews.com. Archived from the original on 2022-12-21. Retrieved 2022-12-27.
 12. Velugu, V6 (2022-12-22). "24 గంటల్లో నలుగురికి కిడ్నీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంట్". V6 Velugu. Archived from the original on 2022-12-22. Retrieved 2022-12-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 13. telugu, NT News (2023-03-06). "NIMS | నిమ్స్ ఆస్ప‌త్రి జాతీయ రికార్డు.. ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు". www.ntnews.com. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
 14. telugu, NT News (2023-06-14). "CM KCR | నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2023-06-14. Retrieved 2023-06-14.
 15. "CM Kcr: నిమ్స్‌లో 'దశాబ్ది' బ్లాక్‌ నిర్మాణం.. సీఎం కేసీఆర్ శంకుస్థాపన". EENADU. 2023-06-14. Archived from the original on 2023-06-14. Retrieved 2023-06-14.

ఇతర లంకెలు

మార్చు