డెబ్బీ హాక్లీ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

డెబోరా ఆన్ హాక్లీ (జననం 1962, నవంబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. న్యూజీలాండ్ క్రికెట్ ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళ హాక్లీగా నిలిచింది.[1]

డెబ్బీ హాక్లీ
హాక్లీ (2021)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డెబోరా ఆన్ హాక్లీ
పుట్టిన తేదీ (1962-11-07) 1962 నవంబరు 7 (వయసు 62)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 74)1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1996 జూలై 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 27)1982 జనవరి 10 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1977/78–1984/85కాంటర్బరీ మెజీషియన్స్
1985/86–1989/90North Shore
1990/91–1999/00కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 19 118 89 214
చేసిన పరుగులు 1,301 4,066 5,105 8,225
బ్యాటింగు సగటు 52.04 41.91 51.05 49.54
100లు/50లు 4/7 4/34 12/23 11/66
అత్యుత్తమ స్కోరు 126* 117 164* 141
వేసిన బంతులు 492 1,521 1,596 3,497
వికెట్లు 5 20 29 94
బౌలింగు సగటు 29.20 42.65 21.75 19.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/9 3/49 4/26 5/18
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 41/– 54/– 75/–
మూలం: CricketArchive, 2021 ఆగస్టు 3

దేశీయ క్రికెట్

మార్చు

హాక్లీ కాంటర్‌బరీ, నార్త్ షోర్ కోసం దేశీయ క్రికెట్ ఆడిది.[2]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

హాక్లీ న్యూజీలాండ్ తరపున 19 టెస్టు మ్యాచ్‌లలో ఆడింది. 126 నాటౌట్ అత్యధిక పరుగులతో 52.04 సగటుతో బ్యాటింగ్ చేసింది. హాక్లీ ఆరు టెస్టుల్లో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి అన్నింటినీ డ్రాగా ముగించింది. న్యూజిలాండ్ కోసం 118 వన్డే ఇంటర్నేషనల్స్‌లో సగటు 41.89 బ్యాటింగ్ తో ఆడింది. 27 మ్యాచ్ లకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అందులో 12 గెలిచింది, 15 ఓడిపోయింది. 1997లో భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (1501),[3] ఐదు ప్రపంచ కప్‌లలో ఆడిన ఏ మహిళగానూ అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉంది.[4]

4000 వన్డే పరుగులు, 100 వన్డేలు ఆడిన మొదటి మహిళగా నిలిచింది.[5] న్యూజీలాండ్ తరఫున వన్డేల్లో 1,000 పరుగులు చేసిన తొలి మహిళగా నిలిచింది.[6] ఆఅంతర్జాతీయ కెరీర్ 1979 నుండి 2000 వరకు కొనసాగింది.[2]

మూలాలు

మార్చు
  1. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
  2. 2.0 2.1 "Player Profile: Debbie Hockley". CricketArchive. Retrieved 3 August 2021.
  3. "Cricket Records | Records | Women's World Cup | Most runs | ESPN Cricinfo". Cricinfo. Archived from the original on 24 November 2015. Retrieved 2017-07-06.
  4. Egan, Brendon (August 9, 2016). "Debbie Hockley poised to be named New Zealand Cricket's first female president". Stuff. Archived from the original on 14 December 2017. Retrieved December 14, 2017.
  5. "డెబ్బీ హాక్లీ". ESPNcricinfo. Retrieved December 14, 2017.
  6. "Pathmakers – First to 1000 ODI runs from each country". Women's CricZone. Retrieved 29 May 2020.

బాహ్య లింకులు

మార్చు