డేగ రెక్కల చప్పుడు (నవల)

యండమూరి వీరేంద్రనాథ్
జననంయండమూరి వీరేంద్రనాథ్
(1948-11-14) 1948 నవంబరు 14 (వయస్సు: 71  సంవత్సరాలు)[1]
భారత దేశంరాజోలు , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా
ఇతర పేర్లుయండమూరి
వృత్తిచార్టర్డ్ అకౌంటెంట్
రచయిత
సినిమా, టి.వి దర్శకుడు
వ్యక్తిత్వ వికాస నిపుణుడు
మతంహిందూ
భార్య / భర్తఅనుగీత[2]
పిల్లలుప్రణీత్ [2]
తండ్రియండమూరి చక్రపాణి
తల్లినరసమాంబ
వెబ్‌సైటు
yandamoori.com

నవల కథ సారాంశంసవరించు

ఈ కథ విషయానికి వస్తే రామకృష్ణ శాస్త్రి భారత సైన్యంలో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తిని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రిని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పనిచేసాడు, అతని అసలు mission ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపథ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది.

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్ఛ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.

మూలాలుసవరించు

  1. "జీవిత సంగ్రహం". yandamoori.com. 2008-07-12. Retrieved 12 జులై, 2008. Check date values in: |accessdate=, |date= (help)
  2. 2.0 2.1 "యండమూరి జీవిత సంగ్రహం". yandamoori.com. 2008-07-12. Retrieved జులై,12, 2008. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate=, |date= (help)