డోన్ పురపాలక సంఘం

నంద్యాల జిల్లా లోని పురపాలక సంఘం

డోన్ పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ఒక పట్టణ స్వపరిపాలన సంస్థ.ఈ పురపాలకసంఘం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం లోని, డోన్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

డోన్ పురపాలక సంఘం
డోన్
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చరిత్ర

మార్చు

ఈ పురపాలక సంఘం 32 వార్డులలో ఏర్పాటు చేశారు.దీని కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.[1] ఈ పురపాలక సంఘంలో798 పబ్లిక్ కుళాయిలు, 186 బోర్-బావులు, 1551 వీధి దీపాలు, ఒక పార్క్, పబ్లిక్ మార్కెట్, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.[2][3]

భౌగోళికం

మార్చు

డోన్ పురపాలక సంఘం 15°23′46″N 77°52′19″E / 15.396°N 77.872°E / 15.396; 77.872 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఈ పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉంది. ఈ పట్టణం గుండా హైదరాబాదు, బెంగళూరు మధ్యగల జాతీయ రహదారి-7 పోతుంది. డోన్ నుండి హైదరాబాదు 270 కి.మీ. బెంగళూరు 340 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ పట్టణం గుండా పోయే రైలు మార్గాన్ని బ్రిటిష్ వారు 1870లో నిర్మించారు.

జనాభా గణాంకాలు

మార్చు

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం డోన్ మొత్తం జనాభా 59,272. ఇందులో పురుషులు 29,470 కాగా మహిళలు 29,802 మంది ఉన్నారు. మొత్తం 12,827 కుటుంబాలు నివసిస్తున్నాయి. డోన్ సగటు సెక్స్ నిష్పత్తి 966.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7118, ఇది మొత్తం జనాభాలో ఇందులో 4739 మగ పిల్లలు 4739 ఆడ పిల్లలు 4430 మంది ఉన్నారు. డోన్ అక్షరాస్యత 67.2%. ఇందులో పురుషుల అక్షరాస్యత 72.33 %, స్త్రీ అక్షరాస్యత 62.96% కలిగి ఉన్నారు.[4]

పౌర పరిపాలన

మార్చు

ఈ పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 26 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు.

మూలాలు

మార్చు
  1. "DHONE NAGARA PANCHAYATH | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-10-14.
  2. "Basic Information of Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 6 జూలై 2012. Retrieved 14 అక్టోబరు 2021.
  3. "Public services/amenities". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 7 జూలై 2012. Retrieved 14 అక్టోబరు 2021.
  4. "Dhone Nagar Panchayat City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-14.

వెలుపలి లంకెలు

మార్చు