ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) ఢిల్లీ రాష్ట్రంలో, ఢిల్లీ క్రికెట్ జట్టుకు సంబంధించి, క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించే పాలక సంస్థ. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు అనుబంధంగా ఉంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడే జట్టు పేరు ఢిల్లీ క్రికెట్ జట్టు. అసోసియేషను DDCA ప్రెసిడెంట్స్ XI పేరుతో కూడా ఆడుతుంది. విదేశాలలోను, భారతదేశం లోని ప్రధానమైన టోర్నమెంట్లలోనూ ఈ జట్టు పాల్గొంటుంది. DDCA అన్నిరకాలైన U14, U16, U19, U23, సీనియర్, మహిళల U19 జట్లను తయారుచేసి ఆయా పోటీల్లో పాల్గొంటుంది.

ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్
దస్త్రం:Delhi&DistrictCricketAssociationLogo.png
ఆటలుక్రికెట్
పరిధిఢిల్లీ
పొట్టి పేరుDDCA
స్థాపన1883 (1883)
అనుబంధంబిసిసిఐ
అనుబంధ తేదీ1928
మైదానంఅరుణ్ జైట్లీ స్టేడియం
స్థానంఢిల్లీ
అధ్యక్షుడురోహన్ జైట్లీ
కార్యదర్శిసిద్ధార్థ సాహిబ్ సింగ్
Official website
India

ప్రముఖ ఆటగాళ్ళు మార్చు

బిషన్ సింగ్ బేడి, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, మొహీందర్ అమర్‌నాథ్, విరాట్ కొహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ డిడిసిఎ నుండి వచ్చిన ప్రముఖ ఆటగాళ్ళలో ఉన్నారు.

అవినీతి ఆరోపణలు మార్చు

డిడిసిఎ లో అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు.[1][2] ఆర్జేడీ ఎంపీ, సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కూడా అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసి, కోర్టులో పోరాడాడు. హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డాడని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్ ఆరోపించాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కీర్తి ఆజాద్‌ను భాజపా నుంచి సస్పెండ్ చేశారు.[3][4] 2015 నవంబరు 17 న సంఘీ కమిటీ, డిడిసిఎ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఎత్తిచూపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. వాటిపై విచారణ జరిపేందుకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.[5] 2019 నవంబరు 16 న, DDCAలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ DDCA అధ్యక్షుడు రజత్ శర్మ రాజీనామా చేశాడు.[6]

మూలాలు మార్చు

  1. "Kirti Azad threatens to reveal more on DDCA mess". Retrieved 23 March 2016.
  2. "DDCA row: AAP poses 5 questions to Jaitley". The Times of India. Retrieved 23 March 2016.
  3. "Ram Jethmalani said he is confident about cornering Arun Jaitley: AAP". The Indian Express. 23 December 2015. Retrieved 23 March 2016.
  4. FP Staff (23 December 2015). "Former hockey chief KPS Gill alleges Arun Jaitley got daughter appointed as HI counsel". Firstpost. Retrieved 23 March 2016.
  5. PTI (24 December 2015). "DDCA corruption row: Kirti Azad suspended, wants PM Modi to intervene". News Nation. Retrieved 23 March 2016.
  6. Sports Desk (16 November 2019). "Wanted to expose real face of DDCA through this resignation: Rajat Sharma". Indian Express. Retrieved 17 November 2019.

వెలుపలి లంకెలు మార్చు