వీరేంద్ర సెహ్వాగ్

భారత క్రికెటర్

వీరేంద్ర సెహ్వాగ్ (జ.1978 అక్టోబరు 20) భారత క్రికెట్ ఆటగాడు. అతడిని వీరూ అని కూడా పిలుస్తారు. 1999 నుంచి వన్డే పోటీల్లోను, 2001 నుంచి టెస్టుల లోనూ భారత జట్టు తరపున ఆడుతున్నాడు. కుడిచేతి వాటం గల ఈ బ్యాట్స్‌మెన్, బౌలింగ్ కూడా చేయగలడు. సెహ్వాగ్, భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (319) సాధించిన బ్యాట్స్‌మన్. 2005 అక్టోబరులో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇతను ఉప సారథిగా నియమితుడయ్యాడు. 2006 డిసెంబరులో అతడిని తొలగించి వి.వి.యెస్.లక్ష్మణ్ ను నియమించారు. 2007 జనవరిలో భాతర వన్డే జట్టు నుంచి ఇతని పేరు తొలిగించారు.[1] 2007-08 ఆస్ట్రేలియా పర్యటనకై మళ్ళీ ఎంపికై అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సు‌లో శతకాన్ని నమోదుచేసాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా జట్టుపై చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మరో ట్రిపుల్ సెంచరీని సాధించి రెండు ట్రిపుల్ఈ సెంచరీలు చేసిన ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. డాన్ బ్రాడ్‌మెన్, బ్రియాన్ లారాలు మాత్రమే ఇది వరకు రెండేసి ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్
Virender Sehwag.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 103 251
పరుగులు 8586 8273
బ్యాటింగ్ సగటు 49.34 35.06
100లు/50లు 23/32 15/38
అత్యుత్తమ స్కోరు 319 219
ఓవర్లు 621 732
వికెట్లు 40 96
బౌలింగ్ సగటు 47.35 40.14
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 1 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 5/104 4/6
క్యాచ్ లు/స్టంపింగులు 59/- 82/-

As of ఏప్రిల్ 13, 2012
Source: [1]

క్రీడా జీవితంసవరించు

1999 ఏప్రిల్లో పాకిస్తాన్ పై వన్డే క్రికెట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్ తొలిరోజుల్లో ఆశించినంతగా రాణించలేదు. తొలి వన్డేలో ఒక్క పరుగుకే ఔట్ అయి, బౌలింగ్‌లో కూడా 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చేశాడు.[2] 2000 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌కు మరో అవకాశం లభించింది. కాని 2001 మార్చిలో ఆడిన తన నాలుగవ మ్యాచ్ వరకు తన ప్రతిభను చూపలేక పోయాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై బెంగుళూరులో 54 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. 3 వికెట్లకు పాట్నర్‌షిప్ పరుగులు సాధించి భారత విజయానికి దోహదపడి తొలి సారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.[3] ఆ తరువాత జరిగిన జింబాబ్వే పర్యటనలో అంతగా రాణించలేదు. 2001 ఆగస్టులో శ్రీలంక, న్యూజీలాండ్లతో జరిగిన ముక్కోణపు పోటీలలో సచిన్ టెండుల్కర్ గాయపడడంతో అతడి స్థానంలో సెహ్వాగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు..[4] అదే సీరీస్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 69 బంతులోనే సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. అదే అతని తొలి వన్‌డే సెంచరీ కావడం గమనార్హం.[5] అప్పటికి ఆ సెంచరీ భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీగా నమోదైంది. ఆ మ్యాచ్‌లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ తరువాత భారత జట్టులో రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌గా చెలామణి అయ్యాడు.

2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించి భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్థసెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. 2002 జనవరిలో సౌరవ్ గంగూలీ గాయపడడంతో ఇంగ్లాండ్తో కాన్పూర్లో జరిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రంగప్రవేశం చేసి 64 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.[6] అప్పటి నుంచి సచిన్ టెండుల్కర్‌ను మిడిల్ ఆర్డర్ పంపించి సెహ్వాగ్‌చే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయించారు.[7] ఆ తరువాత ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సీరీస్ లలో చెలరేగి ఆడి 4 అర్థ సెంచరీలతో 42.6 సగటుతో 426 పరుగులు సాధించాడు. 2002లో శ్రీలంకలో జరిగిన ఐ.సి.సి.చాంపియన్ ట్రోఫీలో 90.33 సగటుతో 271 పరుగులు సాధించాడు. అందులో రెండు పర్యాయాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినాడు. ఆ సీరీస్‌లో గంగూలీతో జతగా సాధించిన 192 పార్ట్నర్‌షిప్ సెంచరీ, వ్యక్తిగతంగా 104 బంతులలో సాధించిన 126 పరుగులు కూడా ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్లతో నెగ్గింది.[8] ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 58 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో కూడా రాణించి 25 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి భారత్‌కు 10 పరుగుల విజయాన్ని అందించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించడానికి దోహదపడ్డాడు.[9]

2002 చివరిలో రాజ్‌కోట్లో వెస్ట్‌ఇండీస్తో జరిగిన మ్యాచ్‌లో 82 బంతుల్లో 114 పరుగులు సాధించడమే కాకుండా గంగూలీతో కలిసి 196 పరుగుల భాగస్వామ్య పరుగులు జతచేసి ఆ మ్యాచ్‌లో భారత్‌కు 9 వికెట్లతో విజయాన్నిఅందించాడు.[10] న్యూజీలాండ్తో జరిగిన 7 మ్యాచ్‌ల సీరీస్‌లో సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ అవతరించాడు. అందులో మొదటిది నేపియర్లో 108 పరుగులతో సెంచరీ చేయగా [11] రెండో సారి ఆక్లాండ్లో 112 పరుగులు సాధించాడు.[12]

2003లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో సెహ్వాగ్ 27 సగటుతో 299 పరుగులు సాధించాడు. అందులో అత్యధిక స్కోరు ఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన 82 పరుగులు.[13] ప్రపంచ కప్ తరువాత హైదరాబాదులో న్యూజీలాండ్తో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగులు చేయడమే కాకుండా సచిన్ టెండుల్కర్తో జతగా 182 పరుగుల భాగస్వామ్యం జతచేసి భారత్ 145 పరుగులతో విజయం సాధించడానికి పునాది వేశాడు. ఇది అతనికి నాలుగవ సెంచరీ కాగా ఆ మ్యాచ్‌లో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.[14] ఆ తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో జరిగిన 22 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక సెంచరీ సాధించాడు.

2008లో ఆస్ట్రేలియా పర్యటనకై ఎంపికై అడిలైడ్ టెస్ట్ రెండో ఇన్నింగ్సులో శతకాన్ని సాధించాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 41 ఫోర్లు, 5 సిక్సర్లతో రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు.[15] భారత్ తరఫున నమోదై ఉన్న రెండు ట్రిపుల్ సెంచరీలు కూడా ఇతని పేరిటే ఉండటం గమనార్హం. టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన వారిలో సెహ్వాగ్ మూడోవాడు. ఇదివరకు డాన్ బ్రాడ్‌మెన్, బ్రియాన్ లారాలు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించిన వారిలో ఉన్నారు.

2009 న్యూజీలాండ్ పర్యటనలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించాడు. హామిల్టన్‌లో జరిగిన నాలుగవ వన్డేలో కేవలం 60 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి సరికొత్త భారత రికార్డును సృష్టించాడు. న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో, అతడిని అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్‌గా ప్రశంసించాడు.[16]

సాధించిన టెస్ట్ సెంచరీలుసవరించు

వీరేంద్ర సెహ్వాన్ టెస్ట్ సెంచరీల వివరాలు
సం. పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సంవత్సరం
1 105 1 దక్షిణాఫ్రికా బ్లోయెంఫాంటీన్, దక్షిణాఫ్రికా స్ప్రింగ్‌బొక్ పార్క్ 2001
2 106 7 ఇంగ్లాండు నాటింఘమ్, ఇంగ్లాండు ట్రెంట్ బ్రిడ్జి 2002
3 147 10 వెస్ట్‌ఇండీస్ ముంబాయి, భారత్ వాంఖేడే స్టేడియం 2002
4 130 16 న్యూజీలాండ్ మొహాలీ, భారత్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2003
5 195 19 ఆస్ట్రేలియా మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 2003
6 309 21 పాకిస్తాన్ ముల్తాన్, పాకిస్తాన్ ముల్తాన్ క్రికెట్ స్టేడియం 2004
7 155 25 ఆస్ట్రేలియా చెన్నై, భారత్ ఎం.ఏ.చిదంబరం స్టేడియం 2004
8 164 28 దక్షిణాఫ్రికా కాన్పూర్, భారత్ గ్రీన్ పార్క్ స్టేడియం 2004
9 173 32 పాకిస్తాన్ మొహలి, భారత్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2005
10 201 34 పాకిస్తాన్ బెంగుళూరు, భారత్ ఎం.చిన్నస్వామి స్టేడియం 2005
11 254 40 పాకిస్తాన్ లాహోర్, పాకిస్తాన్ గఢాఫీ స్టేడియం 2006
12 180 47 వెస్ట్ ఇండీస్ గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా బ్యూస్‌జోర్ స్టేడియం 2006
13 151 54 ఆస్ట్రేలియా అడిలైడ్, ఆస్ట్రేలియా ఓవల్ 2008
14 319 55 దక్షిణాఫ్రికా చెన్నై, భారత్ చేపాక్ 2008
15 201* 59 శ్రీలంక గాలె (శ్రీలంక) గాలె ఇంటర్నేషనల్ స్టేడియం 2008

వన్డే సెంచరీలుసవరించు

వీరేంద్ర సెహ్వాగ్ వన్డే సెంచరీలు
సం. పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సంవత్సరం
1 100 15 న్యూజీలాండ్ కొలంబో, శ్రీలంక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ 2001
2 126 40 ఇంగ్లాండు కొలంబో, శ్రీలంక ఆర్.ప్రేమదాస స్టేడియం 2002
3 114* 46 వెస్ట్‌ఇండీస్ రాజ్‌కోట్, భారత్ మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్ 2002
4 108 52 న్యూజీలాండ్ నేపియర్, న్యూజీలాండ్ మెక్‌లీన్ పార్క్ 2002
5 112 56 న్యూజీలాండ్ ఆక్లాండ్, న్యూజీలాండ్ ఈడెన్ పార్క్ 2003
6 130 78 న్యూజీలాండ్ హైదరాబాదు, భారత్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం 2003
7 108 108 పాకిస్తాన్ కొచ్చి, భారత్ నెహ్రూ స్టేడియం 2005
8 114 169 బెర్మూడా పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ క్వీన్స్ పార్క్ ఓవల్ 2007
9 119 - పాకిస్తాన్ కరాచి నేషనల్ స్టేడియం, కరాచి 2008
10 116 197 శ్రీలంక కొలంబో ప్రేమదాస స్టేడియం 2009
11 125* 204 న్యూజీలాండ్ హామిల్టన్ సెడ్డన్ పార్క్ 2009

అవార్డులుసవరించు

రికార్డులుసవరించు

  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడు. (319 పరుగులు)
  • పాకిస్తాన్ పై అత్యధిక డబుల్ సెంచరీలు (3) సాధించిన భారతీయుడు.[18]
  • అతివేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్.
  • ఒకే ఇన్నింగ్సులో వరుసగా రెండు డబుల్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదుచేసిన రికార్డు.
  • 2011 వన్డేవరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.

టెస్ట్ మ్యాచ్ అవార్డులుసవరించు

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు

# సీరీస్ సీజన్ సీరీస్ గణాంకాలు
1 పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్‌ 2003/04 438 (3 మ్యాచ్‌లు, 4 ఇన్నింగ్సులు, 1x100, 1x50) ; 6-0-27-0; 2 క్యాచ్‌లు
2 దక్షిణాఫ్రికాతో టెస్ట్ సీరీస్‌లో 2004/05 262 పరుగులు (2 మ్యాచ్‌లు, 3 ఇన్నింగ్సులు, 1x100, 2x50) ; 1 క్యాచ్
3 పాకిస్తాన్తో టెస్ట్ సీరీస్ 2004/05 544 పరుగులు (3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్సులు, 2x100, 1x50) ; 5-2-14-0; 2 క్యాచ్‌లు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు

క్ర.సం. ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ గణాంకాలు
1 వెస్ట్‌ఇండీస్ ముంబాయి 2002/03 తొలి ఇన్నింగ్స్: 147 (24x4, 3x6) ; 2-0-7-0
రెండో ఇన్నింగ్స్: 1 క్యాచ్
2 పాకిస్తాన్ ముల్తాన్ 2003/04 తొలి ఇన్నింగ్స్: 309 (39x4, 6x6) ; 2-0-11-0
రెండో ఇన్నింగ్స్: 3-0-8-0; 1 క్యాచ్
3 పాకిస్తాన్ లాహోర్ 2006 తొలి ఇన్నింగ్స్: 254 (47x4, 1x6) ; 6-0-24-0
4 వెస్ట్‌ఇండీస్ సెయింట్ లూసియా 2006 తొలి ఇన్నింగ్స్: 180 (20x4, 2x6) ; 16.1-5-33-3
రెండో ఇన్నింగ్స్: 30-9-48-1
5 దక్షిణాప్రికా చెన్నై 2007-08 మొదటి ఇన్నింగ్సు 319 319 (42x4, 5x6) ; 11-1-37-1
రెండో ఇన్నింగ్సు 22-2-55-1
6 శ్రీలంక గాలె 2008-09 మొదటి ఇన్నింగ్సు 201 (22x4, 4x6)
రెండో ఇన్నింగ్సు 50 (6x4, 1x6)
7 ఇంగ్లాండు చెన్నై 2008-09 మొదటి ఇన్నింగ్సు 9 (2x4) ; 1-0-8-0
రెండో ఇన్నింగ్సు 83 (11x4, 4x6) ; 6-0-22-0

[19]

మూలాలుసవరించు

  1. http://content-usa.cricinfo.com/indvwi/content/story/276198.html
  2. 6th ODI: India v Pakistan at Mohali, 1 Apr 1999
  3. 1st ODI: India v Australia at Bangalore, 25 Mar 2001
  4. Cricinfo - Injured Tendulkar ruled out for Sri Lanka tri-series
  5. 9th Match: India v New Zealand at Colombo, 2 Aug 2001
  6. 4th ODI: India v England at Kanpur, 28 Jan 2002
  7. Cricinfo - Pushing Tendulkar and Dravid around
  8. England v India at Colombo (RPS), 22 Sep 2002
  9. India v South Africa at Colombo (RPS), 25 Sep 2002
  10. 3rd ODI: India v West Indies at Rajkot, 12 Nov 2002
  11. http://www.cricinfo.com/db/ARCHIVE/2002-03/IND_IN_NZ/SCORECARDS/IND_NZ_ODI2_29DEC2002.html
  12. 6th ODI: New Zealand v India at Auckland, 11 Jan 2003
  13. Final: Australia v India at Johannesburg, 23 Mar 2003
  14. 9th Match: India v New Zealand at Hyderabad, 15 Nov 2003
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-04-02. Retrieved 2008-03-28.
  16. ఈనాడు దినపత్రిక, ఛాంపియన్ పేజీ, తేది 13.03.2009
  17. http://content-www.cricinfo.com/india/content/story/125215.html
  18. http://stats.cricinfo.com/statsguru/engine/stats/index.html?class=1;filter=advanced;opposition=7;orderby=runs;runsmin1=200;runsval1=runs;template=results;type=batting
  19. "ANI News". aninews.in.


వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.