తంగిరాల సౌమ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024లో నందిగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

తంగిరాల సౌమ్య
తంగిరాల సౌమ్య


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు మొండితోక జగన్ మోహన్ రావు
నియోజకవర్గం నందిగామ

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు తంగిరాల ప్రభాకరరావు
తరువాత మొండితోక జగన్ మోహన్ రావు
నియోజకవర్గం నందిగామ

వ్యక్తిగత వివరాలు

జననం 1981
పరిటాల గ్రామం, కంచికచర్ల మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు తంగిరాల ప్రభాకరరావు
జీవిత భాగస్వామి కోలా మోహన్ రావు
సంతానం సాహితి, సుహాస్
నివాసం ఇంటి.నెం. 22-23, కకాని నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు

సౌమ్య నందిగామ నుండి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో నందిగామ నియోజకవర్గ తొలి మహిళ శాసనసభ్యురాలుగా రికార్డు సృష్టించింది.

జననం, విద్యాభాస్యం

మార్చు

తంగిరాల సౌమ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా , నందిగామలో జన్మించింది. ఆమె విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ , ఏలూరు లోని సీఆర్ రెడ్డి కాలేజీలో బిటెక్ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె. తంగిరాల ప్రభాకర్ రావు 2014 సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. తంగిరాల సౌమ్య 2014లో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు పై 74,827 ఓట్ల మెజారిటీతో 16 సెప్టెంబర్ 2014న ఎమ్మెల్యేగా గెలిచింది.[1] ఆమె నందిగామ నియోజకవర్గ తొలి మహిళ శాసనసభ్యురాలుగా గెలిచి రికార్డు సృష్టించింది.[2] ఆమె 18 సెప్టెంబర్ 2014న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది.[3]

తంగిరాల సౌమ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పై 10881 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో నందిగామ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావుపై 27395 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై,[4] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితురాలైంది.[5][6]

మూలాలు

మార్చు
  1. PTI (25 November 2017). "AP by-poll: Ruling TDP wins Nandigama seat" (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
  2. Sakshi (17 September 2014). "నాన్న మంచితనమే గెలిపించింది". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
  3. Sakshi (17 September 2014). "ఎమ్మెల్యేగా సౌమ్య ప్రమాణ స్వీకారం". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Nandigama". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  5. Eenadu (13 November 2024). "అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  6. Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.