బాల సరస్వతి (నృత్యకారిణి)

నర్తకి, పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత
(తంజావూరు బాలసరస్వతి నుండి దారిమార్పు చెందింది)

20 వశతాబ్దం భరతనాట్యానికి సువర్ణయుగం. అటు కులీన కుటుంబంలో జన్మించిన రుక్మిణి అరండేల్, ఇటు దేవదాసి కుటుంబంలో జన్మించిన టి.బాలసరస్వతి భరతనాట్యకళ ప్రపంచ లలితకళల పటంలో ప్రముఖస్ధానం అలంకరించటానికి తమవంతు కృషి చేశారు.

తంజావూరు బాలసరస్వతి
వ్యక్తిగత సమాచారం
జననం13 మే 1918
మద్రాస్, బ్రిటీష్ ఇండియా
మూలంతంజావూరు
మరణం9 ఫిబ్రవరి 1984 (వయస్సు 65)
మద్రాస్, ఇండియా
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం నృత్యకారిణి
క్రియాశీల కాలం1925-1984

మనముందు తరాలవారు సాహిత్య, సంగీత, నాట్యరంగాలలో తెలుగు భాషను సుసంపన్నం చేస్తూనే శృంగార సాహిత్యానికి గట్టి పునాది వేస్తే, బాలసరస్వతి (బాల) అదే సాహిత్యానికి తన అభినయంతో రూపం ఇచ్చి తరువాతి తరాలవారికి మార్గదర్శి అయింది. కర్ణాటక సంగీతానికి, ఆ సంగీతంతో ముడివడిన భరతనాట్యానికి తెలుగుభాష పరిపుష్టత చేకూర్చింది. నాట్యంలో భాగమైన, ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో భారతనాట్యం నేర్చుకోవాలనుకొనే ప్రతి వర్దమాన యువతి తలమానికమైన అభినయానికి తెలుగు జావళీలు, పదాలు తిరుగు లేని సాధికారతను చేకూర్చాయి. బాలసరస్వతి, సంస్కృతం, తెలుగు విధిగా నేర్చుకుని తీరాలని నొక్కి చెప్పారు. పాశ్చాత్యులు, దక్షిణ దేశీయులు వివిధ రకాలుగా మన తెలుగు జాతిని జాగృతం చేశారు. బ్రౌన్, కాటన్‌దొర, తంజావూరు నేలిన మరాఠా రాజులు మొ।। వారు. అలానే తంజావూరులో జన్మించిన బాలసరస్వతి తన నాట్యాభినయంతో తెలుగుపదాలు, జావళీలు ప్రదర్శించి ఆ సంస్కృతి మరుగునపడకుండా తర్వాతి తరాల వారికి అందించారు.

బాలసరస్వతి జన్మించినది సంగీత, నాట్య కళాకారులవంశం. వారిద్వారా లలితకళలను జీర్ణించుకున్న వారసత్వం మనకు తెలియవచ్చింది. ఆరు తరాలనుండే పాపమ్మాళ్, తంజావూరు ఆస్ధానంలో ప్రదర్శనలు ఇచ్చారు. తరువాత వరుసగా

వీరందరూ సంగీతంలోను, నాట్యంలోను ఆనాడు ప్రసిద్దులే!బాలసరస్వతి తన తొలినాట్య ప్రదర్శన కాంచీపురంలో ఇచ్చినా, తర్వాత మద్రాసులో ఆనాటి అతిరధ, మహారధుల సమక్షంలో ప్రదర్శించిన నాట్యమే తన అరంగేట్రం. ‘వీణధనమ్మాళ్ మనుమరాలు ప్రదర్శనను జనం విరగబడి చూశారని, బాలసరస్వతి అభినయించిన హావభావాలు ఆమె ఈడుకు మించినవని అంటూ, ఇది బాలమేధావులకే సాధ్యం’ అని ప్రస్తుతించారు. ఎన్నొవడిదుడుకులున్నా, సంప్రదాయం పాటిస్తూ ఆమె నాట్యకళకు అంకితమయింది. ఒక దేవదాసి కేవలం నాట్యకళకు పరిమితమవ్వడం ఒక వర్గం వారికి మింగుడుపడలేదు. అరయక్కుడి రామానుజ అయ్యర్, డా.వి. రాఘవన్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాట్యకళలో తాను ఎప్పుడూ విద్యార్ధినేనని నమ్మి ముందుకు పోగలిగారు. చివరలో వేదాంతం లక్ష్మీ నరసింహాశాస్త్రి వద్ద కూచిపూడి అభినయం దీక్షతో నేర్చుకున్నారు.

ఆకాశవాణి డైరెక్డర్ జనరల్, కేంద్ర సాహిత్య అకాడమి ఛైర్మన్ నారాయణమీనన్ వివరణ ప్రకారం బాలసరస్వతి చేయగల నాట్య అంశాలు అపూర్వం వాటిలో కొన్ని:

ఇవికాక భామాకలాపం, కురవంజి, శ్లోకాలు, పద్యాలు, విరుత్తం మొ।। మరికొన్నివందల సంఖ్యలో అద్భుతంగా నాట్యం చేసేవారు.జపాన్లో తన ప్రదర్శ తిలకించిన ఎరల్ ఆఫ్ హార్డ్ డే, ‘తాను చూసిన అపూర్వ నర్తకిమణులు ముగ్గురిలో టి. బాలసరస్వతి ఒకరు’ అని ప్రశంసించారు. 1962లో అమెరికాలో తన ప్రదర్శన చూసిన ప్రేక్షకులు ఆరోజును ఒక చారిత్రక దినంగా భావించారట. ఆ క్షణం తామంతా చరిత్రకుసాక్షులమయ్యామని అనుభూతి చెందారట. ‘‘క్వీన్ ఆఫ్ డాన్స్’’(నాట్యలోకానికి రాణి) అని అందరూ ఆప్యాయంగా హర్షధ్వానాలు చేశారు. ఈ విషయం నూరుశాతం తెలుగువారు, ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ అనే ఇంగ్లీషు వారపత్రికకు తొలి భారతీయ సంపాదకుడు అయిన డా.ఎ.ఎస్.రామన్ (అవధాన సీతారాముడు)తో 60 సం।। తర్వాత తెలియజేశారు. బాలసరస్వతితో రామన్ గార్కి మధ్య చివరి వరకూ ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగు భాషలోనే నడస్తూ ఉండేవి.

బాలసరస్వతిపై ఒక డాక్యుమెంటరీ తీయడానికి భారతరత్న సత్యజిత్ రే ని భారతప్రభుత్వపు ‘నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ వారు సంప్రదించడంతో సత్యజిత్ రే కొన్ని నెలలు మద్రాసులో ఉండి కళాత్మకమైన డాక్యుమెంటరీ తయారు చేయడం మరో చారిత్రక ఘట్టం. చర్చల సమయంలో స్టూడియోలో, ఎప్పుడూ ఆ నాట్య సరస్వతితో మాట్లాడిన సమయాలలో తను ఎంతో చిన్నవాడిగా భావిస్తూ ఉండేవాడినని రాయ్ వినయంతో అనేవారు.

బాలసరస్వతి 1935లో మొదటిసారిగా కొల్ కతాలో నాట్యప్రదర్శన ఇచ్చారు. దానికి ప్రపంచ ప్రసిద్ధ చిత్రదర్శకులు సత్యజితే రే హాజరయ్యారు.

1936 లో ఆమెను ఉత్తరభారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వటానికి ప్రఖ్యాత నాట్యకారుడు ఉదయశంకర్ ఆహ్వానించారు.1937లో వారణాసిలో ఆమె కార్యక్రమానికి విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ హాజరయ్యారు. ఆమెను కార్యక్రమానికి శాంతినికేతన్ కు ఆహ్వానించారు.1957 లో కళారంగంలో పద్మభూషణ్ అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న మహిళలు ముగ్గురిలో ఆమె ఒకరు. జపాన్, అమెరికా వంటి పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి, పురస్కారాలు అందుకున్నారు. 1973లో చెన్నయ్ లో మ్యూజిక్ అకాడమి వారు జరిపిన సత్కారం కళానిధిగా నాట్యంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి. 1977 లో భారత ప్రభుత్వము వారిచే పద్మ విభూషణ్ పురస్కారం. రిఫరెన్స్. నర్తనం, భారతీయ నాట్యం పై త్రైమాసిక పత్రిక, సంపుటి-9, సంచిక.4

విశిష్టపురస్కారాలు

మార్చు
  • 1955 - సంగీత నాటక ఆకాడమి ఫెలోషిప్.
  • 1957 - పద్మభూషణ్ పురస్కారం.
  • 1961 - ఈస్ట్ వెస్ట్ ఎన్ కౌంటర్, టోకియో.
  • 1962 - టెడ్ షాన్స్ జాకొబ్ పిల్లో పెస్టివల్ వారిద్వారా 16 కేంద్రాలలో ప్రదర్శనలు, USA, ఇంగ్లండు – ఎడింబరో మ్యూజిక్ పెస్టివల్.
  • 1974 - మద్రాసు మ్యూజిక్ ఆకాడమీ పురస్కారం ‘సంగీత కళానిధి’.
  • 1977 - పద్మవిభూషణ్ పురస్కారం.
  • 1978 - శాంతినికేతన్ విశ్వభారతి వారి ‘‘దేశికొత్తమ్’’.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు